2026 TVS Raider 125 Launched with New Nitro Green Colour: ఇండియాలో 125సీసీ బైక్ సెగ్మెంట్లో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న టీవీఎస్ రైడర్ (TVS Raider) ఇప్పుడు మరింత స్టైలిష్ గా మారిపోయింది. స్పోర్టీ లుక్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో యూత్ ను ఆకట్టుకుంటున్న ఈ బైక్, కంపెనీ నెలవారీ విక్రయాల్లో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉంది. మార్కెట్లో హోండా సిబి125 హార్నెట్, హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 వంటి గట్టి పోటీదారులను ఎదుర్కోవడానికి టీవీఎస్ ఇప్పుడు ఈ బైక్ లో సరికొత్త మార్పులు చేసింది. కొత్త రంగులు, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రైడర్ 125 ఇప్పుడు కస్టమర్ల ముందుకు వచ్చింది.

Continues below advertisement

సరికొత్త నిట్రో గ్రీన్ కలర్ ఆప్షన్..టీవీఎస్ రైడర్ 125లో ఇప్పుడు 'నిట్రో గ్రీన్' (Nitro Green) అనే సరికొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ రంగు బైక్ కు ఒక ఫ్రెష్ లుక్ ఇస్తోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ డిజైన్ చేసిన ఈ కలర్ స్కీమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త రంగును ప్రధానంగా బైక్ ముందు భాగంలో ఉపయోగించారు. ఫ్రంట్ కౌల్, ఫెండర్ టిప్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్ తో పాటు బెల్లీ పాన్ మీద కూడా ఈ గ్రీన్ షేడ్ కనిపిస్తుంది. దీనికి తోడు గ్రే కలర్ గ్రాఫిక్స్ బైక్ కు మరింత డైనమిక్ ఫీల్ ఇస్తున్నాయి. మరో విశేషం ఏంటంటే, ముందు చక్రానికి నిట్రో గ్రీన్ కలర్ వేయగా, వెనుక చక్రానికి బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

అడ్వాన్స్‌డ్ టీఎఫ్టీ డిస్‌ప్లే (TFT Display)..టెక్నాలజీ పరంగా చూస్తే, టాప్ స్పెక్ 'TFT DD' వేరియంట్ లో ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉండి, హై కాంట్రాస్ట్ బ్రైట్ కలర్స్ తో సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆరెంజ్, బ్లాక్ కలర్ థీమ్ తో ఉన్న ఈ యూజర్ ఇంటర్ఫేస్ స్పోర్టీగా కనిపిస్తుంది. ఈ స్మార్ట్ డిస్‌ప్లే ద్వారా రైడర్లు కాల్స్ అటెండ్ చేయవచ్చు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్ వాడవచ్చు. ఇందులో దాదాపు 99కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. రైడింగ్ రిపోర్ట్స్, క్రికెట్ మ్యాచ్ స్కోర్లు, వాతావరణ అప్‌డేట్స్ వంటి సమాచారాన్ని కూడా ఈ కన్సోల్ ద్వారా తెలుసుకోవచ్చు. గతంలో ఉన్న రివర్స్ ఎల్సీడీ డిజిటల్ డిస్‌ప్లేను ఇప్పుడు 'SXC DD' ట్రిమ్‌లో అందుబాటులో ఉంచారు.

Continues below advertisement

ధర - ఇతర ఫీచర్లు..టీవీఎస్ రైడర్ 125 కొత్త టాప్ ట్రిమ్ ‘TFT DD’ ధర రూ. 98,550 (ప్రారంభ ధర) గా ఉంది. ఈ వేరియంట్ లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ తో కూడిన రోటో పెటల్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ విత్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. సిటీ ట్రాఫిక్ లో సులభంగా ప్రయాణించడానికి ఉపయోగపడే జిటిటి (Glide Through Traffic) టెక్నాలజీ కూడా ఇందులో ఉండటం గమనార్హం.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 124.8 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ వాడారు. ఇది 11.38 PS పవర్, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. మెటాలిక్ బ్లూ, స్ట్రైకింగ్ రెడ్ వంటి రంగుల్లో కూడా ఈ కొత్త ట్రిమ్స్ లభిస్తాయి. తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారికి టీవీఎస్ రైడర్ 125 ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.