Tata Punch Facelift 2026 Price And Specifications: టాటా మోటార్స్‌, తన పాపులర్‌ మైక్రో SUV అయిన పంచ్‌‌కు 2026 సంవత్సరం ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త పంచ్‌ జనవరి 13న లాంచ్‌ అవుతుంది. డిజైన్‌, ఇంటీరియర్‌, ఫీచర్లు మాత్రమే కాకుండా కొత్తగా "టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌‌"ను కూడా అందించనున్నారు. 

Continues below advertisement

ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ పంచ్‌‌, పాత మోడల్‌ పంచ్‌ మధ్య ఉన్న భేదాలు, పోలికలు:

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో మార్పులు

Continues below advertisement

2026 టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌ విషయంలో పంచ్‌ EV నుంచి ప్రేరణ పొందింది. ముందు భాగంలో కొత్త ఫ్రంట్‌ ఫేసియా, బ్లాక్‌ సరౌండ్‌తో ఉన్న DRLs, స్ప్లిట్‌ హెడ్‌ల్యాంప్స్‌ సెటప్‌, డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌తో రీడిజైన్‌ చేసిన బంపర్‌ కనిపిస్తాయి.

మొత్తంగా చూస్తే పంచ్‌కు ఉన్న మైక్రో SUV తరహాలో ఉండే బలమైన లుక్‌‌ను టాటా అలాగే కొనసాగించింది. సైడ్‌ ప్రొఫైల్‌లో కొత్త డిజైన్‌ అలాయ్‌ వీల్స్‌, మందమైన బ్లాక్‌ క్లాడింగ్‌ ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్‌గేట్‌ మీద బ్లాక్‌ ప్యానెల్‌, కనెక్టెడ్‌ LED టెయిల్‌ లైట్‌ సెటప్‌, కొత్త బంపర్‌ ఈ ఫేస్‌లిఫ్ట్‌ను పాత మోడల్‌ నుంచి స్పష్టంగా వేరు చేస్తాయి.

ఇంటీరియర్‌ & ఫీచర్లలో అప్‌డేట్‌

ఇంటీరియర్‌ లేఅవుట్‌ పాత మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, డిజైన్‌ టచ్‌ పూర్తిగా కొత్తగా ఉంది. కొత్త టూ-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌, ఖరీదైన టాటా మోడళ్ల నుంచి తీసుకున్న టచ్‌ బేస్డ్‌ HVAC కంట్రోల్స్‌, కొత్త ట్రిమ్‌, అప్‌హోల్స్టరీ కనిపిస్తాయి.

సీట్లు ఇప్పుడు బ్లాక్‌-బ్లూ డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌తో వస్తాయి. ఫీచర్ల పరంగా చూస్తే, ఈసారి 360 డిగ్రీ కెమెరా, కొత్త డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ లాంటి అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు టీజర్లు స్పష్టం చేశాయి. పూర్తి ఫీచర్ల జాబితా లాంచ్‌ రోజున వెల్లడించనున్నారు.

ఇంజిన్‌ & పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లు

ఈ ఫేస్‌లిఫ్ట్‌లో ఇదే అత్యంత ముఖ్యమైన అప్‌డేట్‌. కొత్తగా 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌‌ను అందించనున్నారు. ఇది నెక్సాన్‌ నుంచి తీసుకున్న ఇంజిన్‌ అయినప్పటికీ, పంచ్‌ కోసం ట్యూన్‌ చేశారు. పవర్‌, టార్క్‌ వివరాలు ఇంకా వెల్లడించలేదు.

అయితే పాత మోడల్‌లో ఉన్న 1.2 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ (88hp, 115Nm)‌ను కూడా కొనసాగిస్తారు. ఇది 5 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. CNG వేరియంట్‌ కూడా 5 స్పీడ్‌ మాన్యువల్‌తో అందుబాటులో ఉంటుంది.

మొత్తం మీద ఎలా ఉంది?

2026 టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌... డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌ ఆప్షన్ల పరంగా పెద్ద అప్‌డేట్‌తోనే వస్తోంది. ముఖ్యంగా టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ రావడం వల్ల పంచ్‌కు కొత్త కస్టమర్‌ బేస్‌ వచ్చే అవకాశం ఉంది. పాత మోడల్‌ నమ్మకాన్ని అలాగే ఉంచుతూ, కొత్త టెక్నాలజీతో ఈ కారును టాటా మోటార్స్‌ తీసుకొస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.