Skoda Kushaq Facelift 2026 Price And Features: 2026 స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో పరిచయం అయ్యింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌తో పోలిస్తే డిజైన్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌, కంఫర్ట్‌ పరంగా కొన్ని అప్‌డేట్లు వచ్చాయి. అయినా, ఈ సెగ్మెంట్‌లోని ఇతర SUVలతో పోలిస్తే కుషాక్‌లో ఇంకా కొన్ని కీలక ఫీచర్లు లేవు. వాటిలో కొన్ని లేకపోవడం అర్థం చేసుకోవచ్చు, కానీ మరికొన్ని ఫీచర్లు లేకపోవడం బయ్యర్లను అయోమయంలో పడేస్తుంది.

Continues below advertisement

1. లెవల్‌ 2 ADAS

ఇప్పటికే మిడ్‌ సైజ్‌ SUV సెగ్మెంట్‌లో ADAS సాధారణ ఫీచర్‌గా మారుతోంది. హోండా ఎలివేట్‌, MG ఆస్టర్‌ వంటి కార్లు లెవల్‌ 2 ADAS‌తో వస్తున్నాయి. ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు కుషాక్‌లో లేకపోవడం పెద్ద లోపమే.

Continues below advertisement

2. 360 డిగ్రీ సర్‌రౌండ్‌ వ్యూ కెమెరా

టాప్‌ వేరియంట్‌లో కూడా 360 డిగ్రీ కెమెరా ఇవ్వలేదు. ఇప్పుడు కాంపాక్ట్‌ SUVలలో కూడా ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ట్రాఫిక్‌లో లేదా పార్కింగ్‌ సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

3. ప్రీమియం బ్రాండెడ్‌ ఆడియో సిస్టమ్‌

రైవల్స్‌లో Bose, JBL వంటి బ్రాండెడ్‌ సౌండ్‌ సిస్టమ్‌లు ఉన్నాయి. కానీ కుషాక్‌లో స్కోడా సొంత 6 స్పీకర్‌ సిస్టమ్‌ మాత్రమే ఉంది. ఆడియో ప్రేమికులకు ఇది నిరాశే.

4. డ్యూయల్‌ జోన్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌

టాప్‌ ట్రిమ్‌లలో కూడా కేవలం సింగిల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ మాత్రమే ఉంది. హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌ ఈ విషయంలో ముందున్నాయి.

5. పవర్డ్‌ టెయిల్‌గేట్‌

టాటా సియేరా, టాటా కర్వ్‌ లాంటి SUVలు పవర్డ్‌ టెయిల్‌గేట్‌ ఇస్తున్నాయి. చేతుల్లో సామాను ఉన్నప్పుడు, కేవలం కాలిని గాల్లో ఊపి టెయిల్‌గేట్‌ తెలవొచ్చు, ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫీచర్‌ ఇచ్చి ఉంటే కుషాక్‌కు ప్లస్‌ అయ్యేది.

6. ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌

స్టాప్‌-అండ్‌-గో ట్రాఫిక్‌లో EPB (ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌) చాలా ఉపయోగపడుతుంది. మారుతి విక్టోరిస్‌, MG ఆస్టర్‌ వంటి రైవల్స్‌ ఈ ఫీచర్‌ ఇస్తున్నాయి.

7. రియర్‌ సన్‌షేడ్స్‌

మన దేశంలోని వేడి వాతావరణంలో వెనుక సీటు ప్రయాణికులకు సన్‌షేడ్స్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ కుషాక్‌లోని ఏ వేరియంట్‌లోనూ ఇవి లేవు.

8. వెంటిలేటెడ్‌ రియర్‌ సీట్లు

ఈ సెగ్మెంట్‌లో ఎవరూ ఇవ్వని ఈ ఫీచర్‌ను స్కోడా తీసుకురావచ్చు. మసాజ్‌ ఫంక్షన్‌ ఇచ్చినా, వెంటిలేషన్‌ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.

మొత్తంగా చూస్తే, 2026 Skoda Kushaq Facelift డ్రైవింగ్‌ డైనమిక్స్‌, బిల్డ్‌ క్వాలిటీ పరంగా బలంగా ఉన్నా, ఫీచర్ల విషయంలో రైవల్స్‌తో పోలిస్తే వెనుకబడింది. ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.