2026 KTM 390 Duke Price And Features: కేటీఎం అభిమానులకు అదిరిపోయే వార్త. గ్లోబల్‌ మార్కెట్ల కోసం 2026 KTM 390 Duke ను కంపెనీ అధికారికంగా పరిచయం చేసింది. ఇప్పటికే యూత్‌లో క్రేజ్‌ ఉన్న ఈ నేకెడ్‌ బైక్‌, తాజా అప్‌డేట్స్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. పెద్ద మెకానికల్‌ మార్పులు లేకపోయినా, బ్రేకింగ్‌ వ్యవస్థలో కీలక అప్‌గ్రేడ్‌, కొత్త కలర్‌ ఆప్షన్‌ ఇవ్వడం ద్వారా 390 డ్యూక్‌కు ఫ్రెష్‌ ఫీల్‌ను తీసుకొచ్చింది KTM.

Continues below advertisement

కొత్త బ్రేకులు - అదిరే స్టాపింగ్‌ పవర్‌

2026 KTM 390 Dukeలో ప్రధాన అప్‌డేట్‌ WP FCR4 ఫ్రంట్‌ బ్రేక్‌ కాలిపర్‌. కొత్తగా ఇచ్చిన ఈ కాలిపర్‌తో బ్రేకింగ్‌ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని KTM చెబుతోంది. హై స్పీడ్‌లోనూ, ఆకస్మికంగా బ్రేక్‌ వేయాల్సిన పరిస్థితుల్లోనూ ఇది మంచి కంట్రోల్‌ను ఇస్తుంది.

Continues below advertisement

అయితే బ్రేక్‌ డిస్క్‌ సెటప్‌ మాత్రం మునుపటిలాగే కొనసాగుతోంది. ముందు భాగంలో 320 మిల్లీమీటర్ల డిస్క్‌, వెనుక 240 మిల్లీమీటర్ల డిస్క్‌ ఉన్నాయి. వీటితో పాటు కోర్నరింగ్‌ ABS, సూపర్‌మోటో ABS స్టాండర్డ్‌గా లభిస్తాయి. స్పోర్టీ రైడింగ్‌ ఇష్టపడే వారికి ఇది పెద్ద ప్లస్‌ పాయింట్‌.

కొత్త డీప్‌ బ్లూ కలర్‌

2026 మోడల్‌ కోసం KTM ఒక కొత్త డీప్‌ మ్యాట్‌ బ్లూ కలర్‌ స్కీమ్‌ను పరిచయం చేసింది. ఇది బైక్‌కు మరింత అగ్రెసివ్‌, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కొత్త బ్లూ కలర్‌, ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న బ్లాక్‌ కలర్‌తో పాటు అందుబాటులో ఉంటుంది.

డిజైన్‌ పరంగా చూస్తే, షార్ప్‌ ట్యాంక్‌ ఎక్స్‌టెన్షన్స్‌, మస్క్యులర్‌ స్టాన్స్‌, నేకడ్‌ స్ట్రీట్‌ ఫైటర్‌ లుక్‌ అలాగే కొనసాగుతున్నాయి. కొత్త కలర్‌ వల్ల 390 డ్యూక్‌ మరింత ఫ్రెష్‌గా కనిపిస్తోంది.

ఇంజిన్‌, పెర్ఫార్మెన్స్‌ యథాతథం

మెకానికల్‌గా 2026 KTM 390 Dukeలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో అదే 399cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 46hp పవర్‌, 39Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్‌ నగర రైడింగ్‌కే కాదు, హైవే రన్స్‌కూ చక్కగా సరిపోతుంది.

ఫీచర్లు ఇంకా హైలైట్‌

ఫీచర్ల విషయానికి వస్తే, 390 డ్యూక్‌ ఇప్పటికీ సెగ్మెంట్‌లో బెస్ట్‌గా నిలుస్తుంది. 5 ఇంచుల TFT డిస్‌ప్లే, మల్టిపుల్‌ రైడింగ్‌ మోడ్‌లు, ట్రాక్షన్‌ కంట్రోల్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, లాంచ్‌ కంట్రోల్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ రైడర్‌ ఎయిడ్స్‌ ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్లు యూత్‌తో పాటు అనుభవం ఉన్న రైడర్లను కూడా ఆకట్టుకుంటాయి.

ఇండియా స్పెక్‌పై స్పష్టత లేదు

ప్రస్తుతానికి KTM ఇండియా నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కొత్త WP బ్రేక్‌ కాలిపర్‌, డీప్‌ బ్లూ కలర్‌ భారత మార్కెట్లోకి వస్తాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే గ్లోబల్‌ అప్‌డేట్స్‌ను చూసిన తర్వాత, ఇండియన్‌ యూత్‌లో ఆసక్తి మాత్రం గట్టిగానే పెరిగింది.

మొత్తంగా చెప్పాలంటే, పెద్ద మార్పులు లేకపోయినా 2026 KTM 390 Duke చిన్న అప్‌డేట్స్‌తోనే మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. పవర్‌, ఫీచర్లు, స్టైల్‌ అన్నీ కలిసిన ఈ బండిని యూత్‌ అస్సలు వదిలేట్లు లేదు!.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.