2026 Kia Seltos Variants Explained: కియా కొత్త తరం సెల్టోస్‌ మరికొన్ని రోజుల్లో, జనవరి 2న లాంచ్‌ కానుంది. ధరలను జనవరి 2నే ప్రకటించనున్నారు.  బుకింగ్స్‌ మాత్రం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ "సెకండ్‌ జనరేషన్‌ సెల్టోస్‌" K3 ప్లాట్‌ఫారమ్‌పై తయారైంది. ఈసారి డిజైన్‌, టెక్నాలజీ, ఇంజిన్‌ ఆప్షన్లు అన్నీ పూర్తిగా అప్‌డేట్‌ అయ్యాయి. కొత్త డిజైన్‌ డిటైలింగ్స్‌, మరింత పవర్‌ఫుల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో ఈ కొత్త మోడల్‌ తెలుగు రాష్ట్రాల SUV కొనుగోలుదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Continues below advertisement

కొత్త డిజైన్‌ & డైమెన్షన్స్‌కొత్త సెల్టోస్‌ పొడవు 4,460 mm, వెడల్పు 1,830 mm, వీల్‌బేస్‌ 2,690 mm. ముందుభాగంలో వైడ్‌ గ్రిల్‌, ఇన్వర్టెడ్‌ L షేప్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, కొత్త హెడ్‌ల్యాంప్‌ డిజైన్‌ అందాన్ని మరింత పెంచాయి. హైయ్యర్‌ వేరియంట్స్‌లో 18-ఇంచుల అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో షార్ప్‌ లైన్స్‌, ఫ్లష్‌-ఫిట్టింగ్‌ డోర్‌ హ్యాండిల్స్‌ SUVకి మరింత ప్రీమియం లుక్‌ ఇస్తాయి. వెనుక భాగంలో నెంబర్‌ ప్లేట్‌ను బంపర్‌కు మార్చడం వల్ల డిజైన్‌ మరింత క్లీన్‌గా కనిపిస్తోంది.

ఇంజిన్‌ ఆప్షన్లు

Continues below advertisement

మన మార్కెట్‌లో 3 ఇంజిన్‌ ఎంపికలు అందుబాటులో ఉంటాయి:

1.5L పెట్రోల్‌ – 113.4 bhp, 144 Nm

1.5L టర్బో పెట్రోల్‌ – 157.8 bhp, 253 Nm

1.5L డీజిల్‌ – 114.4 bhp, 250 Nm

ట్రాన్స్‌మిషన్‌ ఎంపికల్లో 6-స్పీడ్‌ మ్యాన్యువల్‌, 6-స్పీడ్‌ iMT, IVT, 7-స్పీడ్‌ DCT, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ఉన్నాయి. నగరాల్లో డ్రైవింగ్‌, హైవే క్రూజింగ్‌, తెలుగు రాష్ట్రాల రోడ్లలోని విభిన్న పరిస్థితులకు ఇవి పూర్తిగా సరిపోతాయి.

వేరియంట్లు

2026 సెల్టోస్‌ మొత్తం ఎనిమిది వేరియంట్స్‌లో లభిస్తుంది అవి: HTE, HTE(O), HTK, HTK(O), HTX, HTX(A), GTX, GTX(A).  GTX వేరియంట్స్‌ కోసం ప్రత్యేక X-Line స్టైలింగ్‌ ప్యాక్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

వేరియంట్‌ వారీగా ఫీచర్లు:

HTE

ఇది బేస్‌ వెరియంట్‌. దీనిలో LED హెడ్‌ల్యాంప్స్‌, 10.25-ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌, 6 స్పీకర్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, పవర్‌ విండోలు, స్మార్ట్‌ ఇంటీరియర్‌ లేఅవుట్‌ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి.

HTE(O)

HTEలో ఉన్న ఫీచర్లతో పాటు స్టైల్‌ స్టీల్‌ వీల్స్‌, కనెక్టెడ్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, సెమీ లెదరెట్‌ సీట్స్‌, 60:40 స్ప్లిట్‌ రియర్‌ సీట్స్‌ వంటి అప్‌గ్రేడ్స్‌ వస్తాయి.

HTK

HTE(O)లో ఉన్న ఫీచర్లతో పాటు 17-ఇంచ్‌ క్రిస్టల్‌ కట్‌ అల్లాయ్స్‌, స్మార్ట్‌ కీ, పుష్‌ స్టార్ట్‌, రియర్‌ సన్‌షేడ్స్‌, టిల్ట్‌ & టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌ వంటి ఫీచర్లు వచ్చి కలుస్తాయి.

HTK(O)

HTKలో ఉన్న ఫీచర్లతో పాటు డ్యూయల్‌ పేన్‌ పానోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, స్పోర్టీ అల్యూమినియం పెడల్స్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు వంటి ప్రీమియమ్‌ ఫీచర్లు ఉంటాయి.

HTX

HTK(O)లో ఉన్న ఫీచర్లతో పాటు LED ఫాగ్‌ల్యాంప్స్‌, నీయాన్‌ యాక్సెంట్స్‌తో ఇంటీరియర్‌, 12.3-ఇంచ్‌ స్క్రీన్‌, బోస్‌ ఆడియో సిస్టమ్‌, వెంటిలేటెడ్‌ సీట్స్‌, Kia Connect 2.0 టెక్‌ వంటి హై-ఎండ్‌ ఫీచర్లు అందుతాయి.

HTX(A)

HTXలో ఉన్న ఫీచర్లతో పాటు ADAS లెవల్‌ 2, పెద్ద 12.3-ఇంచ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, సైడ్‌ పార్కింగ్‌ సెన్సర్లు వంటి అదనపు ఆధునిక ఫీచర్లు ఉంటాయి.

GTX & GTX(A)

అత్యంత ప్రీమియమ్‌ వెరియంట్స్‌ ఇవే. పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు 18-ఇంచుల స్పోర్టీ అల్లాయ్స్‌, డార్క్‌ గన్‌మెటల్‌ గ్రిల్‌, GT లైన్‌ బాడీ కిట్‌, 10-వే పవర్‌ డ్రైవర్‌ సీట్‌, మెమరీ ఫంక్షన్‌, నీయాన్‌ బ్రేక్‌ కేలిపర్స్‌ వంటి అత్యున్నత ఫీచర్లు అందిస్తాయి.

X-Line Pack

GTX/ GTX (A) కోసమే ఈ ప్యాక్‌ అందుబాటులో ఉంటుంది. దీనిలో మ్యాట్‌ గ్రాఫైట్‌, హంటర్‌ గ్రీన్‌ ఇంటీరియర్‌, బ్లాక్‌ అల్లాయ్స్‌ వంటి ప్రత్యేక స్టైలింగ్‌ అంశాలున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.