Top 5 upgrades in 2026 Kia Seltos: మన మార్కెట్లో అత్యంత పాపులారిటీ సంపాదించిన మిడ్‌సైజ్‌ SUVలలో కియా సెల్టోస్‌ ఒకటి. ఇప్పుడు అదే సెల్టోస్‌, కొత్త తరం మోడల్‌గా (2026 Kia Seltos) జనవరి 2 నుంచి అమ్మకాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. రూ.25,000 టోకెన్‌ అమౌంట్‌తో ఆన్‌లైన్‌, కియా డీలర్‌షిప్‌ల్లో బుక్‌ చేసుకోవచ్చు. ఈ కారు ధరలను ఇంకా వెల్లడించలేదు.

Continues below advertisement

పాత సెల్టోస్‌తో పోలిస్తే కొత్త మోడల్‌లో డిజైన్‌, సైజ్‌, టెక్నాలజీ, కంఫర్ట్‌ పరంగా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త 2026 Kia Seltos‌ను మరింత ఆకర్షణీయంగా మార్చిన టాప్‌ 5 అప్‌గ్రేడ్స్‌ ఇవే.

1. సైజ్‌లో పెరుగుదల.. బలమైన రోడ్‌ ప్రెజెన్స్‌

Continues below advertisement

కొత్త తరం సెల్టోస్‌ పాత మోడల్‌తో పోలిస్తే 95 mm ఎక్కువ పొడవుగా, 30 mm ఎక్కువ వెడల్పుగా మారింది. వీల్‌బేస్‌ కూడా 80 mm పెరిగింది. దీంతో క్యాబిన్‌లో ప్రయాణికులకు ఎక్కువ లెగ్‌రూమ్‌, హెడ్‌రూమ్‌ లభిస్తుంది. బూట్‌ స్పేస్‌ కూడా 14 లీటర్లు పెరిగింది. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 200 mm ఉండటంతో, బ్యాడ్‌ రోడ్లపై కూడా SUV ధైర్యంగా సాగుతుంది.

2. మరింత ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌

2026 Kia Seltos లుక్‌ పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. కొత్త LED DRL సిగ్నేచర్‌, నిలువుగా అమర్చిన LED హెడ్‌ల్యాంప్స్‌, రీడిజైన్‌ చేసిన గ్రిల్‌, కొత్త బంపర్లు SUVకి అగ్రెసివ్‌ లుక్‌ ఇస్తాయి. కొత్త డిజైన్‌ అల్లాయ్‌ వీల్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫ్లష్‌ ఫిట్టింగ్‌ మోటరైజ్డ్‌ డోర్‌ హ్యాండిల్స్‌ ఈ సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి.

3. సైడ్‌ పార్కింగ్‌ సెన్సర్లు

సేఫ్టీ విషయంలో కొత్త సెల్టోస్‌ మరో అడుగు ముందుకు వేసింది. ముందు, వెనుక సెన్సర్లతో పాటు సైడ్‌ పార్కింగ్‌ సెన్సర్లు కూడా అందించింది. ఇవి కారుకు రెండు పక్కల ఉండే అడ్డంకులను గుర్తించి, ఇరుకైన పార్కింగ్‌ స్పేస్‌ల్లో డ్రైవర్‌కు సహాయపడతాయి.

4. మెరుగైన డిజిటల్‌ ఇంటర్‌ఫేస్‌

క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే టెక్నాలజీ స్పష్టంగా కనిపిస్తుంది. 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, 12.3 ఇంచుల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 5.0 ఇంచుల క్లైమేట్‌ కంట్రోల్‌ స్క్రీన్‌ - ఈ మూడు స్క్రీన్లు కలిపి ప్రీమియం ఫీల్‌ ఇస్తాయి. పాత మోడల్‌తో పోలిస్తే ఇది పెద్ద అప్‌గ్రేడ్‌.

5. 10-వే అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీట్‌             

డ్రైవర్‌ కంఫర్ట్‌పై కియా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కొత్త సెల్టోస్‌లో 10-వే ఎలక్ట్రిక్‌ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీట్‌, పవర్డ్‌ లంబార్‌ సపోర్ట్‌ ఉన్నాయి. పాత మోడల్‌లో లేని ఈ ఫీచర్‌ దీర్ఘ ప్రయాణాల్లో వెన్నునొప్పి సమస్యను తగ్గిస్తుంది.          

మొత్తానికి, 2026 Kia Seltos, పాత మోడల్‌తో పోలిస్తే దాదాపు అన్ని విభాగాల్లో బెటర్‌మెంట్లు అందించింది. డిజైన్‌, స్పేస్‌, టెక్నాలజీ, కంఫర్ట్‌ కోరుకునే తెలుగు ప్రజలకు ఈ కొత్త తరం సెల్టోస్‌ ఖచ్చితంగా ఆకట్టుకునే SUVగా నిలవనుంది.            

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.