Hyundai New Venue Car Letest News: సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో హ్యుందాయ్ (Hyundai) తన సరికొత్త 2026 వెన్యూ (Venue) మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఇది కేవలం ఫేస్‌లిఫ్ట్ (Facelift) కాకుండా, కొనుగోలుదారుల పెరుగుతున్న అంచనాలకు అనుగుణంగా పరిమాణంలో, ఫీచర్లలో పూర్తిగా పునఃరూపకల్పన చేయబడింది. 2026 వెన్యూ మొత్తం డిజైన్ ఇప్పుడు మరింత ఆకర్షణీయ రూపంలో (boxier) మారి, స్పోర్టీ (Sporty) లుక్‌ను సంతరించుకుంది. మునుపటి గుండ్రటి రూపానికి భిన్నంగా, కొత్త గ్రిల్ (Grille) నిలువుగా కనెక్ట్ అయ్యే ఎల్ఈడీ (LED) లైట్‌బార్‌తో, క్వాడ్-బారెల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లతో (Headlights) ఆకర్షణీయంగా ఉంది. సైడ్ ప్రొఫైల్‌లో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త వెనుక డోర్లు, పెద్ద రూఫ్ రెయిల్స్, చతురస్రాకార వీల్ ఆర్చ్‌లు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.
అద్భుత డిజైన్..వెనుక భాగంలో కూడా కనెక్ట్ అయ్యే టైల్ లైట్లు (Tail lights) ఉన్నా, మధ్యలో 'VENUE' అక్షరాలతో కూడిన బ్లాక్ పలక డిజైన్ బాగుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా, ఇందులో 360-డిగ్రీ కెమెరాను (Camera) సూచించే ఓఆర్‌వీఎం (ORVM) కెమెరాలు ,లెవెల్-2 ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్లు ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త ట్రిమ్ స్థాయిలు (Trim levels) HX 2 నుండి HX 10 వరకు పెంచినట్లు తెలుస్తోంది. ఇక ఇంటీరియర్ (Interior) విషయానికి వస్తే, 2026 వెన్యూలో అత్యంత కీలకమైన అప్‌డేట్ కనిపిస్తుంది. పాత రౌండ్ డిజైన్‌కు బదులుగా చదునైన, పదునైన లైన్‌లతో కూడిన డ్యాష్‌బోర్డ్ (Dashboard) ఏర్పాటు చేశారు.
సూపర్బ్ ఫీచర్లు..క్యాబిన్‌లో ప్రధాన ఆకర్షణ గా 12.3-అంగుళాల కర్విలినియర్ డ్యూయల్ డిస్‌ప్లే లు (Dual Displays) నిలుస్తు న్నట్లు తెలుస్తోంది. ఇవి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో (Android Auto), యాపిల్ కార్‌ప్లే (Apple CarPlay) , అడ్వాన్స్‌డ్ టెలిమాటిక్స్ సూట్‌కు సపోర్ట్ చేస్తాయని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి, దీని వలన కారుకు ఫ్యూచరిస్టిక్ కనెక్టెడ్ అనుభూతి లభిస్తుంది. ఏసీ కంట్రోల్స్ (AC Controls) కూడా నాన్-సర్క్యులర్‌గా మారాయి. స్టీరింగ్ వీల్‌పై హ్యుందాయ్ కొత్త క్వాడ్ డాట్ లోగో (Logo) కనిపిస్తుంది. ఇతర ప్రీమియం ఫీచర్లలో ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం (IRVM), ముందు-వెనుక ఆర్మ్‌రెస్ట్‌లు, వెనుక ఏసీ వెంట్స్, బోస్ సౌండ్ సిస్టమ్, రియర్ విండో షేడ్స్ , సరికొత్త డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ ఉన్నాయి. మొత్తంగా, కొత్త 2026 హ్యుందాయ్ వెన్యూ స్టైల్, టెక్నాలజీ (Technology) ,భద్రత (Safety) పరంగా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఒక బెంచ్ మార్కును నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది.