2026 Honda Elevate facelift Down Payment, Loan and EMI Details: జపాన్ దిగ్గజ బ్రాండ్ హోండా, తన అప్‌డేటెడ్ 2026 Honda Elevate Facelift మోడల్‌తో మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌లోకి వచ్చింది. క్లాసిక్ హోండా డిజైన్‌ను, మోడర్న్ టెక్నాలజీని మేళవించి ఈ SUVని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. కార్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రీమియం వెహికల్ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.11.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇంత డబ్బు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేకుండా, వివిధ బ్యాంక్‌లు సులభమైన EMI ఆప్షన్లతో ఫైనాన్స్ ఫెసిలిటీ అందిస్తున్నాయి.

Continues below advertisement

 హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ & ఫీచర్లు

ఈ మోడల్‌లో 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 121 PS గరిష్ట పవర్ & 145 Nm టాప్ టార్క్‌ను సునాయాసంగా ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ & Advanced CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లాంగ్ డ్రైవ్‌లలో సూపర్ స్మూత్ రౌండింగ్ అనుభూతిని అందిస్తుంది. సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా లెవెల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ & డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి.

Continues below advertisement

 హైదరాబాద్‌లో ఎక్స్ షోరూమ్ & ఆన్‌రోడ్ ధరలు

2026 Honda Elevate Facelift మోడల్‌ను SV, V, VX, ZX, ZX+, ZX+ Black వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ (SV వేరియంట్‌) ఎక్స్ షోరూమ్ ధర రూ.11.80 లక్షలు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ & ఇతర ఛార్జీలు కలిపి హైదరాబాద్‌లో SV వేరియంట్‌ ఆన్‌ రోడ్‌ ధర రూ. 14.70 లక్షలు అవుతుంది. వేరియంట్‌ను బట్టి ఎక్స్‌ షోరూమ్‌ రేటు, ఆన్‌రోడ్‌ ధర మారుతుంది. 

విజయవాడలో ఎక్స్ షోరూమ్ & ఆన్‌రోడ్ ధరలు

విజయవాడలో కూడా 2026 Honda Elevate Facelift SV ఎక్స్ షోరూమ్ ధర రూ.11.80 లక్షలు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ & ఇతర ఛార్జీలు కలిపి ఇక్కడ ఆన్‌ రోడ్‌ ధర రూ. 14.57 లక్షలు అవుతుంది. 

 కనీస డౌన్‌పేమెంట్ & బ్యాంక్ ఫైనాన్స్ వివరాలు

ఈ ప్రీమియం SUVని కొనడానికి ప్రముఖ బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలు 10% కనీస డౌన్‌పేమెంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. విజయవాడలో SV వేరియంట్‌ కోసం మీరు కనీసం రూ.2.80 లక్షలు చెల్లించాలి. ప్రస్తుతం ప్రముఖ బ్యాంకులు సంవత్సరానికి 8.5% నుంచి 14% వరకు వార్షిక వడ్డీ రేటు చొప్పున కార్ లోన్లు మంజూరు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు

10% వడ్డీ రేటు చొప్పున 4, 5, 6, 7 ఏళ్లకు EMI వివరాలు

మీరు కనీస డౌన్‌పేమెంట్ రూ.2.80 లక్షలు చెల్లిస్తే, మిగిలిన రూ.11.77 లక్షలను కార్‌ లోన్‌గా తీసుకోవాలి. ఈ మొత్తంపై 10% వడ్డీ రేటు అనుకుంటే, నెలకు చెల్లించాల్సిన EMI అంచనాలు:

4 ఏళ్ల కాలవ్యవధి (48 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 29,8555 ఏళ్ల కాలవ్యవధి (60 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 25,0106 ఏళ్ల కాలవ్యవధి (72 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 21,8077 ఏళ్ల కాలవ్యవధి (84 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 19,541

మీరు రూ.3.50 లక్షలు డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన రూ.11.07 లక్షలను 10% వడ్డీతో లోన్‌గా తీసుకుంటే, నెలకు EMI అంచనాలు:

4 ఏళ్ల కాలవ్యవధి (48 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 28,0795 ఏళ్ల కాలవ్యవధి (60 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 23,5236 ఏళ్ల కాలవ్యవధి (72 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 20,5107 ఏళ్ల కాలవ్యవధి (84 నెలలు): నెలకు EMI దాదాపు రూ. 18,379

మీరు రూ.5 లక్షలు చెల్లించగలిగితే, మిగిలిన లోన్‌పై ఇదే 10% వడ్డీతో 7 ఏళ్ల కాలవ్యవధిని ఎంచుకుంటే, నెలకు EMI దాదాపు రూ.15,889 మాత్రమే అవుతుంది. అంటే, మీరు ఎంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చేస్తే మీ EMI అంత తగ్గుతూ వస్తుంది.

ఇది కూడా చదవండి: టాటా ఏరిస్ iCNG కొనబోతున్నారా? ముందు ఈ 2 మైనస్‌ల గురించి తప్పక తెలుసుకోండి

కార్ లోన్ తీసుకునేముందు వేర్వేరు బ్యాంకులు అందించే ప్రాసెసింగ్ ఫీజులు & హిడెన్ ఛార్జీలను చెక్‌ చేసుకోవడం మంచిది. సిబిల్ స్కోర్‌ లేదా క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. లోన్ కాలపరిమితి కోసం 7 సంవత్సరాల సుదీర్ఘ కాలవ్యవధిని ఎంచుకోకుండా, 5 ఏళ్లు లేదా 6 ఏళ్ల ప్లాన్‌ను ఎంచుకోవడం ఆర్థికంగా సురక్షితం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.