Old vs New Tata Sierra Comparison: టాటా సియారా... భారత మార్కెట్‌లో ప్రత్యేకమైన స్టైల్‌తో కనిపించిన SUV. మొదటిసారి, 1991లో వచ్చిన ఒరిజినల్‌ సియారా అప్పట్లో చాలా యూనిక్‌గా కనిపించింది. ఇప్పుడు, టాటా కంపెనీ, ఆ లెజెండరీ కార్‌ పేరును తిరిగి తీసుకొచ్చింది & 2025 సియారాను పూర్తిగా ఆధునిక రూపంలో మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. కొత్త సియారా ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). పాత సియారాతో పోలిస్తే కొత్త సియారా డిజైన్‌, ఫీచర్లు, ఇంటీరియర్‌ & ఇంజిన్‌ ఆప్షన్‌లు ఎంత మారాయో ఇప్పుడు సింపుల్‌గా, క్లియర్‌గా చూద్దాం.

Continues below advertisement

డిజైన్‌లో భారీ మార్పులు - పాత గుర్తులు, కొత్త స్టైల్‌

చూడగానే గుర్తుపట్టే పాత సియారా డిజైన్‌లో అత్యంత ప్రధానమైన అంశం కర్వ్‌గా ఉండే రియర్‌ గ్లాస్‌. ఇప్పుడు సేఫ్టీ నిబంధనల వల్ల అచ్చం అదే డిజైన్‌ సాధ్యం కాకపోయినా, 2025 సియారాలో రియర్‌ విండోపై బ్లాక్‌ కాంట్రాస్ట్‌ ప్యానెల్‌ పెట్టి ఆ స్టైల్‌కు దగ్గరగా తీసుకెళ్లారు.

Continues below advertisement

పాత సియారాలో కనిపించే స్క్వేర్‌ వీల్‌ ఆర్చెస్‌, హై బోనెట్‌ స్టాన్స్‌ వంటి ఎలిమెంట్స్‌ను కూడా కొత్త వెర్షన్‌లో స్మార్ట్‌గా కొనసాగించారు. ముందు భాగంలో రెక్టాంగ్యులర్‌ షేప్‌లు, గ్రిల్‌పై సూటిగా వచ్చే బ్లాక్‌ స్ట్రిప్‌ వంటి అంశాలు పాత SUV స్టైల్‌కు గౌరవంగా కనిపిస్తాయి.

అయితే 2025 సియారాలో ఆధునిక SUV లాంటి షార్ప్‌ లైన్స్‌, చిన్న ఓవర్‌హ్యాంగ్స్‌, పెద్ద 19-ఇంచ్‌ వీల్స్‌ ఉన్నాయి. LED హెడ్‌ల్యాంప్స్‌, ఫుల్‌-విడ్త్‌ LED లైట్‌బార్‌, ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌, పవర్డ్‌ టెయిల్‌గేట్‌.. ఇవన్నీ దీనిలో కనిపించే కొత్త కాలపు ఫీచర్లు.

ఇంటీరియర్‌లో పూర్తిగా కొత్త ప్రపంచం

2025 సియారా ఇంటీరియర్‌లో మాత్రం పాత సియారాలోని సాదా సీదా డిజైన్‌ కనిపించదు. కేవలం ఫోర్‌-స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ కాన్సెప్ట్‌ మాత్రమే కొనసాగించారు. 2025 సియారాలో 10.25-ఇంచ్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 12.3-ఇంచ్‌ సెంట్రల్‌ టచ్‌స్క్రీన్‌, మరో 12.3-ఇంచ్‌ పాసింజర్‌ స్క్రీన్‌... ఇలా మూడు స్క్రీన్‌లు డ్యాష్‌బోర్డ్‌ మొత్తాన్ని ఆకర్షణీయంగా మార్చేస్తాయి.

HVAC కంట్రోల్స్‌ను మాత్రం ఫిజికల్‌ టాగిల్స్‌గా ఇచ్చారు. డ్యాష్‌బోర్డ్‌పై ఉండే స్లిమ్‌ బ్యాండ్‌ లోపల JBL సౌండ్‌ బార్‌ దాచిన విధానం కూడా చాలా ప్రీమియంగా ఉంది.

పాత సియారా కాలంలో... అప్పట్లో AC, పవర్‌ విండోస్‌, టాకోమీటర్‌ వంటి అంశాలు ఉండడం SUVని చాలా అడ్వాన్స్‌డ్‌గా చూపించేవి. ఇప్పటి సియారాలోనూ అవి నిజంగా ఫ్యూచరిస్టిక్‌ SUV ఫీచర్లు.

పవర్‌ట్రెయిన్‌ - పాత డీజిల్‌ నుంచి ఆధునిక ఇంజిన్‌ల వరకు

పాత సియారాలో మొదట నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ డీజిల్‌, తర్వాత 2-లీటర్‌ 91hp టర్బో డీజిల్‌ వచ్చింది. 5-స్పీడ్‌ మాన్యువల్‌, ఇంకా 4x4 ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉండేది.

కొత్త 2025 సియారాలో మాత్రం ఆధునిక ఇంజిన్‌ సెటప్‌ ఉంది.

1.5-లీటర్‌ 160hp టర్బో పెట్రోల్‌ - ఆటోమేటిక్‌

1.5-లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ - 6-స్పీడ్‌ మాన్యువల్‌ / 7-స్పీడ్‌ DCT

1.5-లీటర్‌ డీజిల్‌ - 260Nm మాన్యువల్‌ / 280Nm ఆటోమేటిక్‌

భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ సియారా కూడా రాబోతోంది.

కొత్త సియారా FWD (ఫార్వర్డ్‌ వీల్‌ డ్రైవ్‌) మాత్రమే అయినా, ఆప్షన్లు మాత్రం చాలా విస్తృతంగా ఉన్నాయి.

మొత్తానికి, టాటా సియారా పేరును తిరిగి తీసుకురావడం కేవలం వారసత్వం మాత్రమే కాదు. ఇప్పటి నిజమైన పోటీలో నిలబడగల అన్ని ఫీచర్లు, స్టైల్‌, టెక్నాలజీ, శక్తిమంతమైన ఇంజిన్‌ ఆప్షన్‌లతో కొత్త సియారా తిరిగి వచ్చింది. ఇది క్రెటా వంటి SUVలకు మంచి ఛాలెంజ్‌ ఇవ్వగలిగే స్థాయిలో ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.