2025 Tata Sierra Colours: 2025 టాటా సియారా కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాటా మోటార్స్‌ తాజాగా ఈ SUVకి సంబంధించిన ఆరు కలర్‌ ఆప్షన్స్‌ను రివీల్‌ చేయడంతో సియారా మీద హైప్‌ మరింత పెరిగింది. సియారా డిజైన్‌ ప్రీమియంగా ఉండటంతో, దీనికి వచ్చే రంగులు SUV లుక్‌నే కాక, రోడ్డుపై దాని ప్రెజెన్స్‌ని కూడా హైలైట్‌ చేస్తాయి.

Continues below advertisement

సియారాలో లభించే ఆరు కలర్స్‌, వాటి పేర్లు

టాటా, ఈసారి కలర్‌ పేర్లను కూడా చాలా క్రియేటివ్‌గా పెట్టింది. ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేసిన మోనోటోన్ కలర్స్‌ ఇవి:

Continues below advertisement

అండమాన్‌ అడ్వెంచర్‌ (పసుపు)

బెంగాల్‌ రూజ్‌ (ఎరుపు)

మున్నార్‌ మిస్ట్‌ (పచ్చ/బూడిద మిక్స్‌ షేడ్‌)

కూర్గ్‌ క్లౌడ్స్‌ (సిల్వర్/లైట్‌ గ్రే)

మింటల్‌ గ్రే (డార్క్‌ గ్రే)

ప్రిస్టైన్‌ వైట్‌

వీటిలో అండమాన్‌ అడ్వెంచర్‌ & బెంగాల్‌ రూజ్‌ బాగా వైబ్రెంట్‌గా ఉండగా... ప్రిస్టైన్‌ వైట్‌, కూర్గ్‌ క్లౌడ్స్‌ లాంటి షేడ్స్‌ క్లాసిక్‌ SUV లుక్‌ను ఇష్టపడేవారికి నచ్చుతాయి.

పబ్లిక్‌ పోల్‌లో ఏ రంగుకు ఎక్కువ ఓట్లు పడ్డాయి?

ఇన్‌స్టాగ్రామ్‌లో, టాటా సియారా కలర్‌ పోల్‌ బాగా వైరల్‌ అయ్యింది. మొత్తం 4,244 ఓట్లు వచ్చిన ఈ పోల్‌లో తెలుగువాళ్లు దేశంలో దాదాపు అన్ని భాషల ప్రజలు ఓట్లు వేసారు.

ఫలితాలు ఇలా వచ్చాయి:

ఎక్కువ మందికి నచ్చిన కలర్‌ వైట్‌. ఈ ఒక్క రంగే 1,000కి పైగా ఓట్లు సంపాదించింది.

సిల్వర్‌ (కూర్గ్‌ క్లౌడ్స్‌) రెండో స్థానంలో నిలిచింది.

మింటల్‌ గ్రే మూడో స్థానంలో ఉంది.

వైబ్రెంట్‌ కలర్స్‌లో మున్నార్‌ మిస్ట్‌ & అండమాన్‌ అడ్వెంచర్‌ గట్టిగా పోటీ పడ్డాయి, మున్నార్‌ మిస్ట్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి.

కాగా, బెంగాల్‌ రూజ్‌ (ఎరుపు) అదిరిపోయేలా కనిపించినా, అతి తక్కువ ఓట్లు తెచ్చుకుంది.

ఈ పోల్‌ ఫలితాలను చూస్తే, సియారాలో ఎక్కువగా మోనోక్రోమ్‌ షేడ్స్‌కే జనం ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది.

బ్లాక్‌ కలర్‌? - ఇంకా పెండింగ్‌లోనే!

సర్వేలో పెద్ద సంఖ్యలో ప్రజలు “బ్లాక్‌ ఎందుకు లేదు?” అని ప్రశ్నించారు. టాటా ఇప్పటి వరకు బ్లాక్‌ను కన్ఫర్మ్ చేయలేదు గానీ, టాటా స్టైల్‌ చూస్తే సియారా డార్క్‌ ఎడిషన్‌ రావడం ఖాయం అన్న అభిప్రాయం ఉంది.

2025 టాటా సియారా - ఫీచర్లు & డిజైన్

సియారా డిజైన్‌లో బాక్సీ స్టాన్స్‌, ఫుల్‌-విడ్త్‌ LED లైటింగ్, ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌, 19-అంగుళాల అల్లాయ్స్‌ ఈ SUVకి ప్రీమియం లుక్‌ ఇస్తాయి.

ఇంటీరియర్‌ హైలైట్స్‌:

  • బేజ్‌ డ్యుయల్‌-టోన్‌ ఇంటీరియర్‌
  • ట్రిపుల్‌ స్క్రీన్‌ సెటప్‌
  • JBL 12-స్పీకర్‌ సౌండ్‌బార్‌
  • మెమరీ ఫంక్షన్‌తో పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌
  • పానొరమిక్‌ సన్‌రూఫ్‌
  • వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు
  • రియర్‌ సన్‌షేడ్స్‌
  • వైర్‌లెస్‌ చార్జింగ్‌
  • డ్యూయల్‌-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌
  • ఇంజిన్‌ ఆప్షన్స్‌
  • టాటా సియారాలో రెండు ఇంజిన్‌లు అందించే అవకాశం ఉంది:
  • 1.5L T-GDI పెట్రోల్‌ - 170 PS పవర్‌, 280 Nm టార్క్‌
  • 1.5L డీజిల్‌ – 118 PS పవర్‌, 260 Nm టార్క్‌
  • 6-స్పీడ్‌ మాన్యువల్‌, 7-స్పీడ్‌ DCT ఆప్షన్స్‌

ధర & రైవల్స్‌

ఎక్స్‌-షోరూమ్‌ ప్రారంభ ధర సుమారు ₹11 లక్షలు ఉండొచ్చు. హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో ఈ SUVకి డిమాండ్‌ బాగానే ఉండే అవకాశం ఉంది.

పోటీ కార్లు: Hyundai Creta, Kia Seltos, Maruti Victoris, Grand Vitara, Tata Curvv.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.