2025 Tata Punch Long Term Review: తెలుగు రాష్ట్రాల్లో నగరాల పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్, మెట్రో నిర్మాణాలు, రోడ్లపై గుంతలు - ఇవన్నీ సిటీ డ్రైవింగ్‌ను ఓ పరీక్షగా మారుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2025 టాటా పంచ్ ఎంతవరకు పనికొస్తుంది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి, ఈ మైక్రో SUVని ఎక్స్‌పర్ట్‌లు సిటీ డ్రైవింగ్‌లో 2,000 కిలోమీటర్లు పాటు డైలీ పరీక్షించారు.
టాటా పంచ్ కామో ఎడిషన్ (Tata Punch Camo edition)ను, విపరీతమైన రద్దీ ఉన్న ముంబైలో ఎక్స్‌పర్ట్‌లు పరీక్షించారు. మొదట గమనించాల్సినది ఈ కారు కాంపాక్ట్ సైజ్. ఇరుకైన రోడ్లలో, బిజీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడం, వాహనాల మధ్యలోంచి దూరడం చాలా ఈజీగా అనిపించింది. ముంబై లాంటి నగరంలో ఇది పెద్ద ప్లస్. డార్క్ గ్రీన్ షేడ్‌లో ఉన్న కామో ఎడిషన్ బయట నుంచి చూసినా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
డ్రైవింగ్ పొజిషన్, కంఫర్ట్
పంచ్‌లో కూర్చోగానే నిటారుగా కూర్చున్న భావన వస్తుంది. రోడ్డు ముందే క్లియర్‌గా కనిపిస్తుంది. స్టీరింగ్, గేర్, పెడల్స్ అన్నీ చేతులకు, కాళ్లకు అందుబాటులో ఉంటాయి. రోజంతా ట్రాఫిక్‌లో గడిపినా అలసట తక్కువగా అనిపించింది. ఫుట్‌వెల్‌లో సరైన స్థలం ఉండటం, డెడ్ పెడల్ ఉండటం కూడా కంఫర్ట్‌కు తోడయ్యాయి.
ఇంజిన్, గేర్‌బాక్స్ అనుభవం
ఇందులో 1.2 లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది హైవే రేసింగ్ కోసం కాదు, కానీ సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా బాగా సరిపోతుంది. పవర్ డెలివరీ స్మూత్‌గా ఉంటుంది. తక్కువ స్పీడ్‌లో కూడా ఇంజిన్ ఇబ్బంది పెట్టదు. లైట్ క్లచ్, స్లిక్ గేర్‌బాక్స్ వల్ల స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో డ్రైవింగ్ సులభంగా మారుతుంది.
మైలేజ్ ఎలా ఉంది?
ఈ 2,000 కిలోమీటర్ల ప్రయాణంలో ఎక్కువగా సిటీ వినియోగమే జరిగింది. సగటుగా 12 కిలోమీటర్లు ప్రతి లీటర్ మైలేజ్ వచ్చింది. భారీ బాడీ, ఎత్తైన స్టాన్స్ ఉన్న SUV తరహాలో ఉండే వాహనం కాబట్టి ఈ మైలేజ్ సరిపోతుందని చెప్పాలి.
టచ్‌స్క్రీన్, ఫీచర్లు
పంచ్‌లోని 10.2 ఇంచుల టచ్‌స్క్రీన్ సిస్టమ్ నిజంగా ఆకట్టుకుంది. గ్రాఫిక్స్ షార్ప్‌గా ఉంటాయి. రెస్పాన్స్ వేగంగా ఉంటుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సజావుగా పనిచేస్తాయి. ముందు ఉన్న నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లు మ్యూజిక్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. 45W టైప్-C పోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చార్జింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగింది.
రైడ్ క్వాలిటీ - పెద్ద బలం
టాటా పంచ్‌లో ప్రధాన హైలైట్ దాని రైడ్ క్వాలిటీ. చెత్త రోడ్లు, సరిగా గుర్తు పెట్టని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా సస్పెన్షన్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. పూర్తి లోడ్‌తో ఉన్నా వాహనం స్టేబుల్‌గా ఉంటుంది. ఇది నగరాల పరిస్థితుల్లో పెద్ద ప్లస్ పాయింట్.
లోపాలు కూడా ఉన్నాయి
రియర్ సీట్ స్పేస్ సగటుగా మాత్రమే ఉంటుంది. లోడ్ సెన్సర్లు లేకపోవడం వల్ల ఖాళీ సీట్లకు కూడా సీట్ బెల్ట్ పెట్టాల్సి వస్తుంది. మరో ముఖ్యమైన లోపం హెడ్‌ల్యాంప్స్. రాత్రి డ్రైవింగ్‌లో లైట్ త్రో, స్ప్రెడ్ తక్కువగా అనిపిస్తుంది. నగరంలో సరిపోతుంది కానీ హైవేల్లో ఇబ్బంది కలిగిస్తుంది.
టెస్ట్ డేటా
మోడల్: టాటా పంచ్ కామో ఎడిషన్ Tata Punch Camo edition Accomplished+ధర: రూ.8.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)సగటు మైలేజ్: 12 కిలోమీటర్లు ప్రతి లీటర్మెయింటెనెన్స్ ఖర్చులు: లేవులోపాలు: లేవు
తుది అభిప్రాయం
కొన్ని చిన్న లోపాలు ఉన్నా, 2025 టాటా పంచ్ కామో ఎడిషన్ రోజువారీ సిటీ డ్రైవింగ్‌కు నమ్మకమైన వాహనంగా నిలిచింది. మంచి రైడ్ క్వాలిటీ, ఈజీ డ్రైవబిలిటీ, ఉపయోగకరమైన ఫీచర్లు దీనిని ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తాయి. నగరాల్లో ఎక్కువగా ప్రయాణించే వారికి ఇది ఒక బలమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.