2025 Mahindra Thar Roxx Review: మహీంద్రా థార్‌ రాక్స్‌ అనేది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, ఒక స్పష్టమైన లక్ష్యంతో రూపొందిన 4x4 అనుభూతి. 19,000 కిలోమీటర్ల లాంగ్‌ టర్మ్‌ డ్రైవ్‌లో ఈ SUV తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను ఎంతవరకు నెరవేర్చిందో ఈ రిపోర్ట్‌లో స్పష్టంగా అర్ధం చేసుకుందాం. ఈ వెహికల్‌ను 19,000 కిలోమీటర్లు నడిపిన ఒక యూజర్‌ నిజమైన అనుభవం ఇది.

Continues below advertisement

విభిన్న బాధ్యతల్లో థార్‌ రాక్స్‌

ఆఫ్‌రోడ్‌ ఈవెంట్లలో సపోర్ట్‌ కార్‌గా పనిచేయడం నుంచి, నాట్రాక్స్‌ సూపర్‌కార్‌ ఈవెంట్‌లో కెమెరా, లగేజ్‌ వాహనంగా మారడం వరకు, ఫ్యామిలీ వీకెండ్‌ ట్రిప్స్‌, ప్రత్యేక డే డ్రైవ్స్‌ వరకు - థార్‌ రాక్స్‌ను విభిన్న పాత్రల్లో పరీక్షించారు. యూజర్‌ ఊహించినట్టుగానే, ఇది నిజమైన హార్డ్‌కోర్‌ ఆఫ్‌రోడర్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

Continues below advertisement

లో-రేంజ్‌ గేర్‌బాక్స్‌, పవర్‌ఫుల్‌ డీజిల్‌ ఇంజిన్‌, ఆధునిక ఎలక్ట్రానిక్స్‌ కలయికతో ఆఫ్‌రోడ్‌ ట్రాక్స్‌పై ఈ SUV చాలా సులభంగా ముందుకు సాగింది. పాత తరం 4x4 వాహనాలు వయస్సు కారణంగా కొన్ని చోట్ల ఇబ్బంది పడినప్పుడు, థార్‌ రాక్స్‌ సపోర్ట్‌ కార్‌గా వెంటనే సహాయం అందించింది. ట్రయల్స్‌ పక్కనే సాగినా, అడ్డంకులను చాకచక్యంగా దాటడం దీని ప్రత్యేకత.

హైవే అనుభవంలో కాస్త నిరాశ

హైవే ప్రయాణాల్లో మాత్రం మిశ్రమ అనుభవం ఎదురైంది. ముంబై నుంచి ఇండోర్‌ వరకు చేసిన ప్రయాణంలో ఇది తన పనిని బాగానే పూర్తి చేసింది. కానీ, లాంగ్‌ హైవే డ్రైవ్స్‌ కోసం దీని కంటే ఇంకా మెరుగైన మిడ్‌సైజ్‌ SUVలు ఉన్నాయనే భావనను మాత్రం కలిగింది. ఇంజిన్‌ చాలా పంచీగా ఉండటం వల్ల 100 km వేగం కంటే తక్కువగా నడపడం కాస్త కష్టంగా మారింది. దీని ప్రభావం మైలేజ్‌పై కూడా పడింది. హైవేపై లీటర్‌కు 10 నుంచి 11.8 కిలోమీటర్లు మాత్రమే రావడం అనేది డీజిల్‌ SUVకి అంతగా సంతృప్తికరమైన విషయంగా అనిపించలేదు.

19,000 కిలోమీటర్ల డ్రైవింగ్‌ కాలంలో కొన్ని చిన్న సమస్యలు కూడా కనిపించాయి. ఒకసారి డ్రైవ్‌ చేస్తుండగా ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ పూర్తిగా బ్లాంక్‌ అవ్వడం ఆందోళన కలిగించింది. రీస్టార్ట్‌ చేసిన తర్వాత సరిగా పనిచేసినా, ఇది గమనించాల్సిన అంశమే. అలాగే, ఒక ఏసీ వెంట్‌ కూడా విరిగింది.

సిటీలో ఇలా పని చేసింది

నగరంలో డైలీ డ్రైవ్‌గా ఉపయోగించినప్పుడు థార్‌ రాక్స్‌ అసలు స్వభావం బయటపడింది. ముంబై ట్రాఫిక్‌లో తక్కువ వేగంలో గుంతలు, బంప్స్‌ దాటేటప్పుడు సస్పెన్షన్‌ గట్టితనం స్పష్టంగా తెలిసింది. అంటే దీని షాక్స్‌ కారు లోపల కూర్చున్నవాళ్లకు కూడా తగిలాయి. ల్యాడర్‌ ఫ్రేమ్‌ నిర్మాణం కారణంగా బాడీ మూవ్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ వాహనం ప్రధాన లక్ష్యం అయిన ఆఫ్‌రోడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని సిటీ రోడ్లపై ఈ మూవ్‌మెంట్లను భరించాల్సిందే.

అయితే, నగర డ్రైవ్‌లో ఇంజిన్‌ రెస్పాన్స్‌, ఓవర్‌టేకింగ్‌ సౌలభ్యం చాలా ఉపయోగపడింది. వెంటిలేటెడ్‌ సీట్లు, హర్మన్‌ కార్డన్‌ సౌండ్‌ సిస్టమ్‌ రోజువారీ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి. డ్రైవింగ్‌ పొజిషన్‌, ఎత్తైన సీటింగ్‌, బలమైన SUV లుక్‌ కుటుంబ సభ్యులకు కూడా నచ్చాయి.

మొత్తంగా చెప్పాలంటే, థార్‌ రాక్స్‌ ప్రతి ఒక్కరికీ సరిపోయే SUV కాదు. కానీ ఆఫ్‌రోడింగ్‌ను ప్రేమించే వారికి, ఆ ఇమేజ్‌ను ఆస్వాదించే వారికి మంచి థ్రిల్‌ ఇస్తుంది. మహీంద్రా ఈసారి రఫ్‌ ఎడ్జ్‌లను చాలా వరకు పాలిష్‌ చేసింది. 19,000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కూడా ఈ 4x4 తన అసలు లక్ష్యాన్ని నిజాయితీగా నెరవేర్చిందని చెప్పొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో, 2025 Mahindra Thar Roxx ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 12.25 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.