Harley Davidson X440 Lineup 2025: హార్లే డేవిడ్‌సన్‌, 2025 కోసం తన X440 లైనప్‌ను రిఫ్రెష్‌ చేస్తూ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇండియన్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ తెచ్చుకున్న ఈ మిడ్‌-సైజ్‌ రెట్రో స్ట్రీట్‌ మోటార్‌సైకిల్‌ను ఇప్పుడు మరింత అప్‌డేటెడ్‌గా, మరిన్ని విభిన్నమైన వేరియెంట్లతో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా, Denim వేరియెంట్‌ను కంప్లీట్‌గా తీసేయడం, కొత్తగా T‌ వేరియంట్‌ని ఫ్లాగ్‌షిప్‌గా తీసుకురావడం పెద్ద అప్‌డేట్‌గా చెప్పుకోవచ్చు.

Continues below advertisement

X440 లైనప్‌లో ఏం మారింది?2025 లైనప్‌లో ఇప్పుడు మూడు వేరియెంట్లు మాత్రమే ఉన్నాయి, అవి - Vivid, S & కొత్తగా వచ్చిన T. డెనిమ్‌ వేరియెంట్‌ను తీసేయడంతో, ఎంట్రీ-లెవల్‌ ఆప్షన్‌గా ఇప్పుడు Vivid నిలిచింది. అదనంగా, Vivid & S వేరియెంట్ల ధరలను ₹25,000 తగ్గించడం కూడా కస్టమర్లకు మంచి బెనిఫిట్‌. ఈ ధర తగ్గింపు వల్ల కొత్త T వేరియెంట్‌ పర్ఫెక్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ పొజిషన్‌లోకి వచ్చింది.

ఈ మూడు వేరియెంట్లలోనూ (Vivid, S & T) ఒకే ఇంజిన్‌ - 440cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ - ఉంటుంది. ఇది 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో 27hp పవర్‌, 38Nm టార్క్‌ ఇస్తుంది. సస్పెన్షన్‌, బ్రేకులు, ఫ్రేమ్‌ వంటి ప్రధాన భాగాలు మొత్తం లైనప్‌లో (అన్ని వేరియంట్లకూ) ఒకేలా ఉంటాయి, మార్పులు లేవు.

Continues below advertisement

X440 Vivid – ఎంట్రీ లెవల్‌, కానీ ఆకర్షణీయమైన ఫీచర్లుVivid ధర ₹2.35 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). డెనిమ్‌ వేరియెంట్‌లో ఉన్న spoke వీల్స్‌ స్థానంలో, ఇప్పుడు, ఈ వేరియెంట్‌లో అలాయ్‌ వీల్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు వచ్చాయి. ట్యాంక్‌పై స్టిక్కర్‌ డిజైన్‌ ఉండగా, Sలో ఉన్న 3D లోగో ఇక్కడ లేదు. 3.5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉన్నప్పటికీ, బ్లూటూత్‌ కనెక్టివిటీ మిస్సింగ్‌. కాబట్టి జియో-ఫెన్స్‌, రిమోట్‌ ఇమ్మోబిలైజర్‌, వెహికల్‌ డయాగ్నస్టిక్స్‌, ఫైండ్‌ మై బైక్‌, థెఫ్ట్‌ అలర్ట్స్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండవు. అయినా, ఈ ధర వద్ద ఇది మంచి విలువైన వేరియెంట్‌గానే చెప్పుకోవాలి.

X440 S – ప్రీమియం లుక్‌తో మధ్య స్థాయి వేరియెంట్‌X440 S ధర ₹2.55 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).Vivid కంటే ₹20,000 ఎక్కువ అయిన ఈ వేరియెంట్‌ అదనపు కనెక్టివిటీ ఫీచర్లతో, మరింత ప్రీమియం లుక్‌తో వచ్చింది.బ్లూటూత్‌ కనెక్టివిటీ వల్ల:• నావిగేషన్‌• మ్యూజిక్‌ కంట్రోల్‌• కాల్‌ అలర్ట్స్‌• ఫోన్‌ బ్యాటరీ స్టేటస్‌• మెసేజ్‌ నోటిఫికేషన్లుఅందుబాటులో ఉంటాయి. డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌, మెషిన్‌ ఫినిష్‌ ఇంజిన్‌ ఫిన్స్‌, కొన్ని బ్రాంజ్‌ అక్సెంట్స్‌ బైక్‌కు మోర్‌ రిచ్‌ ఫీలింగ్‌ ఇస్తాయి.

X440 T – కొత్త ఫ్లాగ్‌షిప్‌, మరింత టెక్నాలజీతోX440 T ధర ₹2.80 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

2025 లైనప్‌లో అత్యంత ముఖ్యమైన అప్‌డేట్‌ ఇదే. ఈ T వేరియెంట్‌లో —• రైడ్‌-బై-వైర్‌ థ్రోటిల్‌• మార్చుకోదగిన ట్రాక్షన్‌ కంట్రోల్‌• మార్చుకోదగిన ABS• రోడ్‌ & రెయిన్‌ మోడ్స్‌లభిస్తాయి. ఈ మోడ్స్‌ వల్ల థ్రోటిల్‌ రెస్పాన్స్‌ను మార్చడం, ట్రాక్షన్‌ సెట్టింగ్స్‌ మార్చడం వంటివి వీలవుతాయి.

కొత్తగా జోడించిన "పానిక్‌ బ్రేకింగ్‌ అలర్ట్‌"తో, హార్డ్‌ బ్రేకింగ్‌ సమయంలో అన్ని ఇండికేటర్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి, వెనుక వెళ్తున్న వాహనాలకు వార్నింగ్‌లా పని చేస్తాయి.

డిజైన్‌ మార్పులు కూడా ముఖ్యమేX440 T వెర్షన్‌లో రియర్‌ సెక్షన్‌ను పూర్తిగా రీడిజైన్‌ చేశారు. కొత్త సబ్‌ ఫ్రేమ్‌, పొడవైన టెయిల్‌ కౌల్‌, కొత్త పిలియన్‌ (కో-రైడర్‌) సీట్‌, గ్రాబ్‌ రైల్స్‌ ఈ బైక్‌ను మరింత బ్యాలెన్స్‌డ్‌గా కనిపించేలా చేస్తాయి. అదనంగా, బార్‌-ఎండ్‌ మిర్రర్లు కూడా మరో ప్రత్యేకత.

2025 Harley Davidson X440 లైనప్‌ కస్టమర్లకు మరింత క్లారిటీ, మరిన్ని ఫీచర్లు, మంచి ధరలో మంచి ఆప్షన్లు అందిస్తోంది. Vivid విలువైన ఎంట్రీ-లెవల్‌ వేరియెంట్‌, S మరింత ఫీచర్‌ రిచ్‌, T మాత్రం పూర్తిస్థాయి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ అందించే ఫ్లాగ్‌షిప్‌ వేరియంట్‌.

తెలుగు ప్రజల కోసం, ముఖ్యంగా యువత దృష్టితో చూస్తే - ధర, లుక్‌, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా X440 T ఎక్కువ ఆకట్టుకుంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.