ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మారుతీ సుజుకీ(Maruti Suzuki) లాంచ్ చేసిన XL6 ఫేస్‌లిఫ్ట్ సరికొత్త ఫీచర్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న మారుతీ ఎర్టిగా(Maruti Ertiga)కు అప్‌డేట్ లాంటిది. మూడు వేరియంట్‌లలో లాంచ్ అయిన XL6లో గేర్‌బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్ ప్రత్యేక ఆకర్షణ.
ఎంపీవీ(MPV)లపై స్పెషల్ పోకస్ పెట్టిన మారుతీ సుజుకీ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మోడల్స్‌లో ది బెస్ట్ మోడల్‌గా దీన్ని చెప్పవచ్చు. తోటి వాహన తయారీ దారుల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు డైనమిక్ ఛేంజెస్‌తో XL6 ఫేస్‌లిఫ్ట్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇంజిన్‌లో మార్పులు చేసింది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తీసుకొచ్చింది. ఇంటీరియర్ ఫీచర్స్‌లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి.
అవుట్ లుక్ చూస్తే...
XL6 చాలా భిన్నంగా కనిపిస్తుంది. వెంటనే గుర్తించేలా ఉంది. ముందుభాగాన ఎల్‌ఈడీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వచ్చాయి. మరింత ప్రీమియం లుక్ కోసం ముందు భాగంలో న్యూ గ్రిల్ వెనుకవైపు పెద్ద క్రోమ్ బార్ ఇచ్చారు. ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ప్రక్కన క్లాడింగ్ చూస్తే SUV లుక్ ఇస్తున్నాయి. గతంలో ఉన్న చిన్న వీల్స్‌తో పోలిస్తే ఈసారి పెద్ద అలోవీల్స్ ఇచ్చారు. ఇవి 16 ఇంచెస్ ఉంటాయి. గ్రే ఫనిషింగ్‌తో స్మార్ట్ న్యూ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. కొత్త డ్యూయల్ షేడ్స్ ఉన్నప్పటికీ నెక్సా బ్లూ గ్రాండ్‌గా కనిపిస్తోంది. పెయింట్ ఫినిష్ చాలా బాగుంది.
ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ చూస్తే...
ఇంటీరియర్ మొత్తం బ్లాక్ థీమ్‌తో చేశారు. ఎర్టిగాతో పోలిస్తే చాలా కొత్తగా ఉంది. ఇంటీరియర్‌కు సిల్వర్ ఫినిషింగ్ మరింత ఆకర్షణీయంగా ఉంది. డ్యాష్ బోర్డు, స్టీరింగ్ అంతటా సిల్వర్ కోటింగ్ ఇచ్చారు. డోర్స్ క్లోజింగ్ సౌండ్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. రూఫ్ లైనింగ్, అండ్ డోర్ ప్యాడ్స్ నాణ్యమైనవిగా ఉన్నాయి. 7 ఇంచ్‌ల స్క్రీన్ ఇందులో మరో బిగ్ ఫీచర్.
టచ్ స్క్రీన్ చాలా చిన్నదిగా ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఇంటర్‌ఫేస్ అండ్ టచ్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. 360 డిగ్రీలు కనిపించే కెమెరా ఈ కారుకు అదనపు ఆకర్షణ. వెంటిలేటెడ్ కూల్డ్ సీట్లు(ఇవి త్వరగా చల్లబడతాయి, దృఢంగా ఉంటాయి.) ఫోన్‌లో యాప్ ద్వారా, స్మార్ట్ వాచ్ ద్వారా యాక్సెస్ చేసే ఫీచర్ ఉంది.
యాంబియంట్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, టెలిస్కోపిక్ స్టీరింగ్, నాలుగు ఎయిర్ బ్యాగ్స్(డ్రైవర్, కో డ్రైవర్, ఫ్రంట్ సీట్ సైడ్)ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESP), హిల్ హోల్డ్ అసిస్ట్(HHA) లాంటి ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆరు ఎయిర్ బ్యాగ్స్ అవసరం, మరిన్న యూఎస్‌పీ పోర్ట్ ఉంటే బాగుంటుంది. ఈ రెండు మినహా మిగిలిన ఫీచర్స్ చాలా బాగున్నాయి.
కారులో స్పేస్ ఎలా ఉందంటే
ఎంపీవీలో ఎంత స్పెస్ కావాలని కోరుకుంటారో XL6లో అది లభిస్తుంది. కెప్టెన్ సీట్‌తో కలిపి ఆరు సీట్ల లే అవుట్‌తో ఉందీ కారు. లెగ్‌రూమ్ సరిపడేంత ఉంది. సీటింగ్ అడ్జెస్ట్‌మెంట్ ఉంది. సన్ మూడో వరుసలో సీట్లు వంచుకోవచ్చు. రూఫ్ లేనప్పటికీ రూఫ్ మౌంటెడ్ వెంట్స్ చాలా ప్రభావంతంగా పని చేస్తాయి.
డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్
ఇప్పుడు XL6 ప్రస్తుతానికి పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. స్మార్ట్ హైబ్రీడ్‌తో కూడిన డ్యూయల్‌జెట్ టెక్నాలజీతో ఉంటుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్, 6- స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనే రెండు ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. తక్కువ వేగంతో వెళ్లేటప్పుడు ఇంజిన్ స్మూత్‌గా సైలెంట్‌గా ఉంటుంది. భారీ ట్రాఫిక్ ఉన్న రోడ్లు, ఇరుగ్గా ఉండే రోడ్లపై నడిపేందుకు లైట్ స్టీరింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మంచి డ్రైవింగ్‌లో ఇది 16/17kmpl మైలేజీ ఇస్తుంది.
ఇప్పుడీ XL6 ప్రారంభ ధర రూ. 11.2 లక్షలుగా ఉంది. టాప్-ఎండ్ మోడల్స్ రూ. 14.55 లక్షలు. ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా ఇన్ని ఫీచర్స్‌తో ధర ఫర్వాలేదని చెప్పవచ్చు.
ఆకట్టుకునే ఫీచర్స్:- కొత్త ఫీచర్స్, ఎక్స్‌లెంట్ ఎఫిసెన్సీ, స్పేస్, న్యూ గేర్ బాక్స్
ఏవి నచ్చకపోవచ్చు:- మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ అవసరం, టాప్ ఎండ్ చాలా ఖరీదైంది.