ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్‌లో లాంగ్ రేంజ్, హైబ్రిడ్ కార్లదే హవా. ఈ క్రమంలో మార్కెట్లోకి ఒక కొత్త SUV రాబోతోంది. ఈ వాహనం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చైనా ఆటో మార్కెట్లో ఒక కొత్త ఆఫ్-రోడ్ హైబ్రిడ్ SUV ఎంట్రీకి సిద్ధంగా ఉంది. విశ్లేషకులు దీనిని నడిచే పవర్‌హౌస్ అని పిలిచినా ఆశ్చర్యం అక్కర్లేదు. అయితే ఇతర దేశాల్లోనూ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Continues below advertisement

 ఈ వాహనం పేరు Geely Galaxy Battleship 700 Hybrid SUV. కాగా దీని అతిపెద్ద ప్రత్యేకత 1,770 కిలోమీటర్ల లాంగ్ ఓవరాల్ డ్రైవింగ్ రేంజ్. అంటే ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయడంతో పాటు ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మీరు రీఫ్యూయలింగ్ లేదా ఛార్జింగ్ గురించి త్వరగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఈ కారు కేవలం 3.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్

Continues below advertisement

ఈ కారు పేరు గీలీ గెలాక్సీ 700 హైబ్రిడ్ ఎస్‌యూవీ. గీలీ గెలాక్సీ తమ కొత్త SUV 'బ్యాటిల్‌‌షిప్ 700'లో భాగంగా ఈ శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ అందించినట్లు తెలిసింది. ఇందులో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ వస్తుంది. అందువల్ల వాహనానికి యాక్సిలరేషన్, భారీ టార్క్‌ను ఉత్పత్తి చేయడంలో దోహదం చేస్తుంది. అందుకే ఇంత పెద్ద మరియు బరువైన SUV అయినప్పటికీ, ఇది స్పోర్ట్స్ కారులా కొన్ని సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుని ఆశ్చర్యపరుస్తుంది.

 ఓవరాల్ రేంజ్ 1770 కి.మీ.

లాంగ్ జర్నీ చేసేవారికి ఈ కారు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇందులో పెద్ద బ్యాటరీతో పాటు పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. దాంతో మీరు ఫ్యూయల్, ఇటు బ్యాటరీ సాయంతో కలిసి  మొత్తం 1,770 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌పై కూడా ఈ కారు రోజువారీ పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.దీనివల్ల పెట్రోల్ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.

Also Read: కొత్త లుక్‌తో వస్తున్న Honda Elevate Facelift.. లోపల, బయట కీలక మార్పులతో అక్టోబర్‌ 6న లాంచ్‌

ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, ఆల్-వీల్ డ్రైవ్

గీలీ గెలాక్సీ SUV కేవలం ప్లెయిన్ హైవేలకే కాకుండా ఇతర రోడ్డు మార్గాల్లోనూ దూసుకెళ్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్,రకరకాల ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్స్ లభిస్తాయి. దీని హై గ్రౌండ్ క్లియరెన్స్, స్ట్రాంగ్ సస్పెన్షన్, ఆల్-టెర్రైన్ గ్రిప్ దీనికి బురద, ఇసుక, కొండలపై కూడా సులభంగా వెళ్లేలా చేస్తాయి. 

ఫ్యూచరిస్టిక్ లుక్, క్యాబిన్ టెక్నాలజీ

కారు లుక్ విషయానికి వస్తే చాలా మస్క్యులర్,  బోల్డ్‌గా కనిపిస్తుంది. SUV క్యాబిన్‌లో లేటెస్ట్ జనరేషన్‌కు చెందిన పెద్ద టచ్‌‌స్క్రీన్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ కన్సోల్, ప్రీమియం లెదర్ సీట్లు ఇచ్చారు. సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో లెవెల్-2 ADAS ఫీచర్లు, 360 డిగ్రీ కెమెరా, పలు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారు స్పీడ్, రేంజ్,  రఫ్ అండ్ టఫ్ పెర్ఫార్మెన్స్‌ల ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ అని చెప్పవచ్చు.