Easy ways to improve your bike’s fuel efficiency: ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆఫీస్‌కి, వ్యాపారం కోసం లేదా ఇతర అవసరాల కోసం ప్రతి రోజూ ప్రయాణించే వాళ్లకు బైక్‌ మంచి మైలేజ్‌ ఇవ్వడం చాలా ముఖ్యం. పెద్ద మార్పులు చేయకుండానే కొన్ని సింపుల్‌ చిట్కాలతో మీ బైక్‌ ఇంధన సామర్థ్యాన్ని బాగా పెంచుకోవచ్చు.

Continues below advertisement

1. సర్వీసింగ్‌ రెగ్యులర్‌గా చేయండి

మీ బైక్‌ ఇంజిన్‌ మెయింటైనెన్స్‌ బాగా ఉంటే మైలేజ్‌ సహజంగానే మెరుగవుతుంది. రెగ్యులర్‌గా సర్వీస్‌ చేయించుకుంటే ఇంజిన్‌లో ఘర్షణ తగ్గి, ఫ్యూయల్‌ వృథా తగ్గుతుంది.

Continues below advertisement

2. ఎయిర్‌ ఫిల్టర్‌ శుభ్రంగా ఉంచండి

దుమ్ము, ధూళితో మూసుకుపోయిన ఎయిర్‌ ఫిల్టర్‌ ఇంజిన్‌కు గాలి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా ఇంధనం ఎక్కువగా దహనం అవుతుంది. ఎయిర్‌ ఫిల్టర్‌ను క్లీన్‌గా ఉంచడం ద్వారా ఎయిర్‌-ఫ్యూయల్‌ మిశ్రమం సరిగ్గా పని చేస్తుంది.

3. టైర్‌ ప్రెషర్‌ సరిగ్గా ఉంచండి

టైర్‌లో గాలి తక్కువగా ఉంటే బైక్‌ రోడ్డుపై ఎక్కువ రెసిస్టెన్స్‌ ఎదుర్కొంటుంది. దాంతో ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. కంపెనీ చెప్పిన ప్రెషర్‌ స్థాయిని ఎప్పుడూ పాటించండి.

4. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఇంజిన్‌ ఆఫ్‌ చేయండి

20 సెకన్లకు మించి సిగ్నల్‌ వద్ద ఆగాల్సి వస్తే, బైక్‌ ఇంజిన్‌ ఆఫ్‌ చేయడం ద్వారా 10% వరకు ఇంధనం సేవ్‌ చేయవచ్చు. తిరిగి స్టార్ట్‌ చేయడానికి అవసరమైన ఫ్యూయల్‌ అంత తక్కువగానే ఉంటుంది.

5. తరచుగా బ్రేక్‌లు వాడకండి

హఠాత్తుగా బ్రేక్‌లు వాడటం లేదా వేగంగా నడిపి అకస్మాత్తుగా ఆపడం వల్ల ఇంధనం వృథా అవుతుంది. ముందుగానే ట్రాఫిక్‌ను అంచనా వేసి, రైజింగ్‌ను స్మూత్‌గా తగ్గిస్తూ, సాఫ్ట్‌గా బ్రేక్‌లు వాడండి.

6. అవసరం లేని బరువు తగ్గించండి

బైక్‌పై అదనపు సామాను, హేవీ యాక్సెసరీస్‌ పెట్టుకోవడం వలన మైలేజ్‌ తగ్గుతుంది. బైక్‌ తేలికగా ఉంటే మైలేజ్‌ కూడా పెరుగుతుంది.

7. మంచి క్వాలిటీ ఫ్యూయల్‌ వాడండి

శుభ్రమైన, మంచి క్వాలిటీ ఫ్యూయల్‌ ఇంజిన్‌లో స్మూత్‌గా బర్న్‌ అవుతుంది. ఇది ఇంజిన్‌ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

8. బైక్‌ ఎక్కువసేపు వార్మప్‌ చేయకండి

ఇప్పటి ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ బైక్‌లకు ఎక్కువ వార్మప్‌ అవసరం లేదు. ఇంజిన్‌ రేవ్స్‌ స్థిరంగా ఉన్న వెంటనే రైడ్‌ ప్రారంభించవచ్చు.

9. సాఫ్ట్‌గా రైడ్‌ చేయండి, ఓవర్‌ రేవింగ్‌ వద్దు

వేగంగా యాక్సిలరేట్‌ చేయడం, గేర్‌ లేట్‌గా మార్చడం వంటివి ఫ్యూయల్‌ వృథా చేస్తాయి. మెల్లగా, సాఫ్ట్‌గా నడపడం మైలేజ్‌ను మెరుగుపరుస్తుంది.

10. ఏరోడైనమిక్‌గా రైడ్‌ చేయండి

బైక్‌ లేదా స్కూటర్‌ను అధిక వేగంతో నడిపినప్పుడు గాలి నుంచి ప్రతిఘటన పెరుగుతుంది. కాబట్టి రైడ్‌ చేస్తున్నప్పుడు స్లిమ్‌ పొజిషన్‌లో ఉండటం ద్వారా ఫ్యూయల్‌ సేవ్‌ చేయవచ్చు.

చివరి మాట - తెలివిగా నడపండి, ఇంధనం ఆదా చేసుకోండి

ఈ 10 సులభమైన అలవాట్లు పాటించడం ద్వారా మీరు రోజువారీ రైడింగ్‌లో ఇంధనాన్ని గణనీయంగా ఆదా చేయవచ్చు. స్మార్ట్‌గా నడిపితే మైలేజ్‌ పెరగడమే కాకుండా, ఇంజిన్‌ జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌, విజయవాడ వంటి బిజీ నగరాల్లో రోజూ ప్రయాణించే రైడర్లకు ఈ టిప్స్‌ తప్పక ఉపయోగపడతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.