Matter Aera Electric Bike Price And Features: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుండేసరికి, తాజాగా, ఈ రేసులో అరా (Aera) అనే కొత్త పేరు యాడ్‌ అయింది. వాస్తవానికి, ఇది భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్. దిల్లీకి చెందిన 'మ్యాటర్' (Matter) అనే స్టార్టప్ ఈ బండి లాంచ్‌ చేసింది. Aera వల్ల వచ్చే అతి పెద్ద ప్రయోజనం - ఈ బైక్ కిలోమీటరుకు కేవలం 25 పైసల ఖర్చుతో నడుస్తుంది. ఫుల్‌గా ఛార్జ్ చేస్తే ఈ మోటార్‌ సైకల్‌ 172 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

మ్యాటర్ అరా ధర & బుకింగ్ వివరాలుMatter Aera ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,93,826. మీరు ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను Matter అధికారిక వెబ్‌సైట్ నుండి సులభంగా బుక్ చేసుకోవచ్చు. అరా USP దాని హైపర్‌షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్, ఇది ఇంటర్నల్‌గా అభివృద్ధి చేసిన 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & దీనిని ఇప్పటివరకు భారతదేశంలోని ఏ ఎలక్ట్రిక్ బైక్‌లోనూ చూడలేదు.

3 రైడ్ మోడ్స్‌మ్యాటర్ అరాలో మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి, ఇవి 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లింక్‌ అయ్యాయి. అంటే, మొత్తం 12 గేర్ మోడ్ కాంబినేషన్‌లను ఈ బండి అందిస్తుంది. చాలా ఎలక్ట్రిక్ టూవీలర్లు ట్విస్ట్-అండ్-గో అనుభవాన్ని అందిస్తాయి, అయితే అరా నిజమైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ బైక్ లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో పని చేస్తుంది. ఈ బైక్‌లో 5 kWh బ్యాటరీ ప్యాక్‌ ఇచ్చారు. కంపెనీ లెక్కల ప్రకారం, అరాను ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్ చేస్తే 172 కి.మీ. వరకు IDC సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. ఈ బైక్ కేవలం 2.8 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ./గం వరకు వేగాన్ని అందుకోగలదు.

మోడర్న్‌ ఫీచర్లుమ్యాటర్ అరా ఎలక్ట్రిక్ బైక్‌లో చాలా అద్భుతమైన & మోడర్న్‌ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇచ్చారు, ఇది నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ & రైడింగ్ గణాంకాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని రియల్‌ టైమ్‌లో చూపిస్తుంది. ఈ డిస్‌ప్లే OTA (ఓవర్-ది-ఎయిర్) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది, తద్వారా బైక్ ఎప్పటికప్పుడు తాజా టెక్నాలజీతో అప్‌డేట్‌ అవుతుంది.

సూపర్‌ స్మార్ట్‌ బైక్‌గా పరిచయడం చేయడానికి మ్యాటర్‌వర్స్ యాప్ సాయంతో ఈ టూవీలర్‌లో చాలా కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. వాటిలో - రిమోట్ లాక్ & అన్‌లాక్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్ & రైడ్ అనలిటిక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా.. కీలెస్ స్టార్ట్ సిస్టమ్ కూడా ఉంది, రైడర్ కీ లేకుండా బైక్‌ను స్టార్ట్ చేయవచ్చు.

కిలోమీటరుకు కేవలం 25 పైసల మైలేజ్మ్యాటర్ అరా ఫీచర్లలో బలాన్ని ప్రదర్శించడమే కాదు, మైలేజ్ పరంగా పొదుపుగా ఉంటుంది. కంపెనీ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను నడపడానికి అంచనా వేసిన ఖర్చు కిలోమీటరుకు 25 పైసలు మాత్రమే. మ్యాటర్ అరా డిజైనింగ్‌లో భద్రత & సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీనికి ABSతో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు, ఇది బ్రేకింగ్‌ను వేగంగా & సురక్షితంగా ఉంచుతుంది. బైక్‌లో డ్యూయల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. ఈ బైక్‌లో స్మార్ట్ పార్క్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది, ఇది తక్కువ వేగంతో పార్కింగ్‌ను ఈజీగా మారుస్తుంది.