Your Weekly Horoscope For May 18 - 25 : మే 18 సోమవారం నుంచి మే 25 ఆదివారం వరకూ ఈ వారం ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
మేష రాశి (Aries Weekly Horoscope)
ఈ వారం మేష రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైనా మనోబలంతో పూర్తిచేస్తారు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. పెండింగ్ లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సన్నిహితుల ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది. ఉద్యోగులు , వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి . రాజకీయాల్లో ఉండేవారు కష్టపడితేనే ప్రజాదరణ పందగలరు. వారం ఆరంభంలో కన్నా వారాంతంలో కొన్ని చికాకులు తప్పవు.
మిథున రాశి (Gemini Weekly Horoscope)
ఈవారం మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలొస్తాయి. నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఏ విషయాలను తీవ్రంగా ఆలోచించవద్దు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎంత మౌనంగా ఉంటే అంత సంతోషంగా ఉంటారు. వారం మొదట్లో కుటుంబంలో సమస్యలు వెంటాడుతాయి..ఆ తర్వాత ఆ చికాకుల నుంచి బయటపడతారు. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ అడుగువేయండి.
కర్కాటక రాశి (Cancer Weekly Horoscope)
ఈ వారం కర్కాటక రాశివారికి మంచి ఫలితాలున్నాయి. ధైర్యంగా అడుగేస్తారు. ఉద్యోగులు తమ పనితీరుతో మెప్పిస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి వాటి వల్ల భవిష్యత్ లో లాభపడతారు. చాలాకాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించండి. చిన్న సమస్య అని వదిలేస్తే పెద్దదిగా మారే అవకాశం ఉంది.
కన్యా రాశి (Virgo Weekly Horoscope)
ఈ వారం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అతిగా ఆలోచించవద్దు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మాటతూలొద్దు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు, ఎవర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అప్పులు తీర్చేస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. వారాంతానికి అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వారం ఆరంభం బావున్నా వారాంతానికి చిన్న చిన్న సమస్యలుంటాయి.
మకర రాశి (Capricorn Weekly Horoscope)
ఈ వారం మకర రాశివారు ఆవేశానికి దూరంగా ఉండాలి. తొందర పాటు నిర్ణయాలు తీసుకోకూడదు. బుద్ధిబలంతో వ్యవహరించాలి. ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేయాలి. అప్పుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. కుటుంబంలో వివాదాలకు స్వస్తి చెప్పి.. వారి సలహాలకు విలువఇస్తే కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి