Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిద్ల సమస్యలు (ఇన్సోమ్నియా లేదా రెగ్యులర్ గా నిద్రపట్టకపోవడం)...ఇది జాతకంలో కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం లేదా దోషాల వల్ల వస్తుంది. ఇది ఓ నిర్దిష్ట దోషం కాకపోయినా గ్రహాల బలహీనత లేదా అఫ్లిక్షన్(దుష్ట ప్రభావం)గా చూస్తారు. దీనిని మెడికల్ ఆస్ట్రాలజీలో భాగంగా పరిగణిస్తారు జాతకంలో ఎలాంటి దోషం ఉంటే ఇలా జరుగుతుంది? మూన్ ( చంద్రుడు) అప్లిక్షన్
చంద్రుడిని మనఃకారకుడు అంటారు..అంటే మనసుపై ప్రభావం చూపించేవాడు అని అర్థం. చంద్రుడు మనస్సుని, భావోద్వేగాలను, నిద్రను నియంత్రిస్తాడు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నా లేదంటే శత్రుగ్రహాలైన రాహువు, కేతువు, శనితో కలసి ఉన్నా నిద్రకు భంగం కలుగుతుంది..మానసికంగా అలసిపోతుంటారు, అనవసరం ఆలోచనలతో ఆందోళన చెందుతారు మీ జాతకంలో 12 ఇంట్లో దోషం ఉంటే..12వ స్థానం ఇల్లు,నిద్ర, విశ్రాంతి వంటివాటిని సూచిస్తుంది. ఈ స్థానంలో బలహీనంగా ఉంటే దుష్టగ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండి నిద్ర సంబంధిత సమస్యలు ఇబ్బందిపెడతాయి జాతకచక్రంలో 4 వ స్థానంనాలుగో ఇల్లు సుఖం, మనశ్సాంతి, ఇంటివాతావరనాన్ని సూచిస్తుంది. ఈ స్థాననం బలహీనంగా ఉన్నా నిద్రపట్టదు
ఇతర దోషాలు
రాహువు, కేతువు, కాలసర్పదోషం ఉన్నవారికి నిత్యం మానసిక అస్థిరత వెంటాడుతుంది. శనిదోషం ఉన్నవారికి కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది నిద్రపట్టకపోవడానికి ఏ గ్రహం ప్రధాన కారణం? చంద్రుడు - మనస్సు, భావోద్వేగాలను నియంత్రిస్తాడు..అందులో నిద్రపట్టదు
బధుడు - నరాల వ్యవస్థ, ఆలోచనలపై ప్రభావం చూపిస్తాడు..అతి ఆలోచన నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది శని - దీర్ఘకాలిక సమస్యలు, ఒత్తిడి పెంచే గ్రహం ఇది రాహువు-కేతువు - అస్థిరత, భయాలను సృష్టించే గ్రహాలు అయితే జాతకాన్ని పూర్తిగా పరిశీలించకుండా ఈ దోషాల గురించి కచ్చితంగా చెప్పలేం..అందుకే మీకు నమ్మకమైన జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది
ఇక సాధారణ పరిహారాల విషయానికొస్తే.. గ్రహాలను బలపర్చేందుకు ఇవి పాటించాల్సి ఉంటుంది..అయితే పూర్తి విశ్వాసంతో అనుసరించినప్పుడే ఫలితం ఉంటుంది చంద్ర దోషానికి
చంద్ర మంత్రం"ఓం సోమ సోమాయ నమః" రోజూ 108 సార్లు పఠించాలి.. సోమవారం ముత్యం ధరించాలి. పాలు,బియ్యం దానం ఇవ్వడం మంచిది శని దోషానికి
శని మంత్రం: "ఓం శం శనైశ్చరాయ నమః" జపం.
మీ జాతకంలో శని స్థానం చూసుకుని నీలం ధరించాలి..శనివారం రోజు నల్ల నువ్వులు దానం ఇవ్వాలి
బుధ దోషానికి
బుధ మంత్రం: "ఓం బుం బుధాయ నమః".పచ్చ ధరించాలి..బుధవారం రోజు ఆకుపచ్చని వస్త్రాలు దానం ఇవ్వాలి సాధారణ పరిహారాలు పంచకర్మ థెరపీ ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది రాహు-కేతు శాంతి పూజలు చేస్తే కొంత ఉపశమనం దక్కుతుంది..కాలసర్ప దోషాలు ఏమైనా ఉన్నా నిద్రలేమి సమస్య ఉంటుంది కాబట్టి కొంత ప్రశాంతత లభిస్తుంది రోజూ రాత్రి నిద్రపోయే ముందు చంద్రుడిని పార్థించండి యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుంది
ఆయుర్వేదం ప్రకారం..
రాత్రి ఏడున్నర లోపే భోజనం చేయండి
రాత్రి 9 గంటల తర్వాత ఫోన్, ల్యాప్టాట్ వినియోగించవద్దు
పదిన్నర దాటకుండా నిద్రకు ఉపక్రమించండి
పాదాలను నూనెతో మర్ధన చేస్తే అలసట ఆందోళన తగ్గి మంచి నిద్ర పడుతుంది
గ్లాస్ గోరువెచ్చని ఆవుపాలు తాగండి ఇదంతా సాధారణ సమాచారం మాత్రమే..నిద్రలేమి సమస్యలకు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటూ అడ్వైస్ తీసుకోవడం ముఖ్యం..ఎందుకంటే ఇది అనారోగ్య సమస్య కూడా కావొచ్చు..
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABPLive.com ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!