జీవితంలో నుంచి చీకటి తొలగించి వెలుగులు నింపే పండగ, నెగెటివిటిని తరిమేసి పాజిటివ్ గా మార్చుకునే అవకాశం కల్పించే పండగ దీపావళి. ఈ సందర్భంలో ప్రతీ ఒక్కరూ లక్ష్మీ కృపకు పాత్రులు కావాలని కోరుకుంటారు. ఈ వారంలో ధన్‌తెరాస్ పర్వదినం ఉంటుంది. ఈ సందర్భంగా అందరూ రకరకాల కొత్త వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటారు. అయితే ఈ రాశి వారు ఏ రకమైన వస్తువులు కొంటే మంచిదో జ్యోతిష్కులు చెబుతున్నారు. ఒకసారి అవేమిటో చూద్దాం.


మేష రాశి 


పసుపు రంగు వస్తువులను కొనడం మంచిది. తాబేలు బొమ్మ (కుబేర) వంటి ఇంటి అలంకరణ సామాగ్రి మీద పెట్టుబడి పెట్టడం మంచిది. ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంట్లో సామరస్యం నెలకొంటుంది. అలంకరణ సామాగ్రి కొనె అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. వీరు ఈ వారంలో చెక్క సామాగ్రి కొనకుండా ఉండడం మంచిది.


వృషభం (టారస్)


మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వస్తువులు కొనడం మీకు మేలు చేస్తుంది. బంగారం, రాగి, ఎర్రని దారం వంటివి మీ వ్యక్తిత్వాన్ని సూచించే వస్తువులు. మీరు గాజు వస్తువులు, ఇంటికి అవసరమైన సామాగ్రీ ఈ వారంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.


మిధునం 


బంగారం కొనుగోలు చెయ్యడం మంచిది. మీ పరిసరాలలో మార్పులు తెచ్చే అలంకరణ సామాగ్రీ, కొత్త బట్టలు కొనడం శ్రేయస్కరం. ఈ సమయంలో మీరు ఏవైనా డీల్స్ సైన్ చేస్తే అవి మీకు మంచి భవిష్యత్తును ఇస్తాయి. ఈ రాశిలో కొంత మందికి జీవితంలో కొత్త ద్వారాలు తెరచుకునే అవకాశం ఉంది.


కర్కాటకం 


వజ్రాలు, ప్రిషియస్ స్టోన్స్, నగలు కొనడం ఈ రాశి వారికి మేలు చేస్తుంది. అయితే నమ్మకమైన చోట మాత్రమే కొనుక్కోండి. ఈ రాశిలో కొంత మంది ఈ వారంలో కొత్త పెట్ లేదా మొక్కను కొనే అవకాశం ఉంది.


సింహం 


వెండి లేదా బంగారంలో లక్ష్మీ దేవి మూర్తి కొనుక్కోవడం చాలా మంచిది. లేదా ఏదైనా దైవ సంబంధ వస్తువు కొని తెచ్చుకోవడం మంచిది. ఇంట్లో అవసరం లేని వస్తువులను తప్పకుండా తీసి పారెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మీకు కొత్త వస్తువులకు స్థలం ఏర్పాటవుతుంది. పువ్వులు, ధాన్యం, కొత్త బట్టలు ఈ వారం కొనుగోలు చేస్తే మంచిది.


కన్య 


ఆ రాశి వారు మల్టీ కలర్ లో ఏదైనా కొనుగోలు చెయ్యడం మంచిది. గ్రీన్ కలర్ లో ఏదైనా విలువైన వస్తువు కొనుక్కోవడం వల్ల మేలు జరుగుతుంది. స్తోమతకు మించిన కర్చులు చెయ్యకూడదు. పువ్వులు లేదా పువ్వులతో ఉన్న ఫ్రేమ్ కొనడం వల్ల లాభం ఉంటుంది.


తుల 


వజ్రాలు, ప్లాటినం, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కోనడం మంచిది. విలువైన రాయి ఏదైనా కొనడం కూడా మంచిదే. ట్రావెల్ ప్లాన్స్ తో పాటు డిజైనర్ దుస్తులు కొనడం కూడా మంచిదే ఈ వారంలో.


వృశ్చిక 


మీ మనసుకు నచ్చిన మీ స్తోమతకు తగిన వస్తువులు ఏవైనా ఈ రాశి వారు కొనవచ్చు. బంగారం, వజ్రాలు, పుస్తకాలు, ఏవైనా నీటికి సంబంధించిన వస్తువులు కొనడం కూడా మంచిదే.  కొంచెం తెలివిగా షాపింగ్ చేయాలనేది చెప్పదగిన సూచన.


ధనస్సు 


ఇతరులకు గిప్ట్ చెయ్యగలిగే వస్తువు ఏదైనా మీరు కొనుగోలు చెయ్యవచ్చు. మీకోసం కంటే కూడా ఇతరులకోసం షాపింగ్ చెయ్యడం మంచిది. మీ కోసమైతే వెండి కొనడం మంచిది. వెండి మీద పెట్టుబడి పెట్టినా మంచిదే. ప్రకృతిలో సహజంగా దొరికే రాళ్లు, క్రిస్టల్స్ వంటివి కొంటే మేలు జరుగుతుంది.


మకరం  


బంగారం లేదా వెండి మీద పెట్టుబడి పెట్టడం మంచిది. నీటికి సంబంధించిన వస్తువులు కొనడం మంచిది. కొత్త బట్టలు కొనుక్కోవడం వల్ల మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఈ వారం కొత్త శక్తి సంతరించుకొని పనులు చేసుకుంటారు.


కుంభం 


దేనిలోనైనా పెట్టుబడి పెట్టడం ఈ సమయంలో చాలా శుభకరం. బంగారం, కెంపులు లేదా పసుపు పచ్చని వస్తువులు కొనడం శుభప్రదం.


మీనం 


లక్ష్మీ, గణేష వెండి నాణేలు లేదా విగ్రహాలు వంటి ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం మంచిది. ఈ వారం మీరు వెండి కొనడం లాభదాయకం.


Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!