Weekly Horoscope November 23 to 29 : నవంబర్ చివరి వారం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ చివరి వారంలో చాలా గ్రహాలు రాశిచక్రాలను, నక్షత్రాలను మారుస్తాయి. అటువంటి పరిస్థితిలో 12 రాశిచక్రాల జీవితాలపై ఈ ప్రభావం కనిపిస్తుంది. నవంబర్ 23 నుంచి 29 వరకు బుధుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ శుక్రునితో కలిసి రాజ్యలక్ష్మి యోగాన్ని ఏర్పరుస్తాడు. మేషం నుంచి కన్యా రాశి వరకు వారం ఎలా ఉందంటే.. మేష రాశి (Aries Weekly Tarot Card Reading)
టారో కార్డుల గణన ప్రకారం మేష రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుందని చెబుతోంది. మీరు మీ జీవితాన్ని ఆచరణాత్మకంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వారంలో మీరు మీ ఆరోగ్యం ..ధనానికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనం పొందవచ్చు. మీ పనులు ఆలస్యం అవుతున్నట్లు మీకు అనిపిస్తుంది..కానీ మీరు మార్చలేని కొన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకోవడం తెలివైన పని.
వృషభ రాశి (Taurus Weekly Tarot Card Reading)
వృషభ రాశి వారు ఈ వారంలో కుటుంబ సభ్యులతో ఏదైనా తీవ్రమైన విషయం గురించి చర్చించకుండా ఉండాలి. ఎందుకంటే, ఇది చేదు వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చు, కానీ రెండవ భాగంలో కొంత మెరుగుదల ఉంటుంది
మిథున రాశి (Gemini Weekly Tarot Card Reading)
టారో కార్డుల గణన మిథున రాశి వారు ఈ వారం కొంచెం విచారంగా ఉంటారు. విమర్శలు , మీ శ్రేయోభిలాషుల వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. ఈ వారం మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా పెద్ద డీల్ చేసేటప్పుడు ఓపికగా ఉండాలి
కర్కాటక రాశి (Cancer Weekly Tarot Card Reading)
కర్కాటక రాశి వారికి ఈ వారం మీ ఆలోచనలతో ఎవరూ ఏకీభవించరు. కుటుంబంలో, పనిచేసే ప్రదేశంలో మీ కారణంగా గందరగోళవాతావరణం ఏర్పడుతుంది. మీ స్వభావంలో కోపం, చిరాకు పెరుగుతుంది. మీరు మీ సమస్యలపై మాత్రమే దృష్టి పెట్టాలి, లేకపోతే నష్టపోవచ్చు.
సింహ రాశి ( Leo Weekly Tarot Card Reading)
సింహ రాశి వారికి ఈ వారం ఊహించని ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ వారంలో మీరు కుటుంబ జీవితంలో ఆనందం పొందుతారు. కార్యాలయంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు
కన్యా రాశి (Cancer Weekly Tarot Card Reading)
కన్యా రాశి వారికి ఈ వారం సృజనాత్మకంగా ఉంటుంది. మీరు చేసే పనులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మీ సమయం మీ కుటుంబం , స్నేహితులతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుస్తుంది. మీరు మీలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఈ వారం మీరు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!