News
News
వీడియోలు ఆటలు
X

Weekly Horoscope 6 to 12 February 2023: ఈ రాశులవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, లాభ-నష్టాలు సమానంగా ఉంటాయి

Weekly Rasi Phalalu In Telugu : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Weekly Horoscope 6 to 12 February 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మిథున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఇంకొన్ని రోజులు నిరాశ తప్పదు. ఆరోగ్యం విషయంలో కొన్ని చికాకులు తప్పవు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలుండవు. ఉద్యోగులు ఉన్నతస్థాయి వ్యక్తుల ఆదేశాలు పాటించడం మంచిది. పనిభారం పెరుగుతుంది. వారం మధ్యలో విందువినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కలసొస్తుంది. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెరగాలి. సరైన ప్రణాళిక చేసే పనులు అద్భుతమైన విజయాన్నిస్తాయి. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. వివాదాలకు అవకాశమివ్వవద్దు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మంచిది. 

తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అప్పలు తీరుస్తారు. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు చిన్న చిన్న  సమస్యలుంటాయి. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సమస్యను అర్థంచేసుకుని శాంతంగా పరిష్కరించుకోండి. వివాదాలకు దూరంగా ఉండాలి

Also Read: ఈ వారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది, ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఈ రాశివారు ఈ వారం ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది.  ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. గత కొద్దిరోజులుగా ఉద్యోగులను వెంటాడుతున్న సమస్యలు తీరిపోతాయి. రాజకీయవర్గాలకు అనుకూల సమయం. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి.  సోదరులతో విభేదాలున్నాయి జాగ్రత్త. మీ నిర్ణయాలు మీరే తీసుకోవడం మంచిది. కొన్ని విషయాల్లో గందరగోళ స్థితి ఏర్పడుతుంది కానీ దాన్నుంచి బయటపడతారు. 

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ రాశివారు ఈ వారం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులు గతంలో  చేజారిన కొన్ని అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. 

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) 
ఈ రాశివారు సంకల్పబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఏదో తెలియని ఆటంకాలుంటాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు. వ్యాపారంలో చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్యసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు పారిశ్రామికవర్గాల వారు కొత్త సంస్థలు ప్రారంభిస్తారు. 

Also Read: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
తలపెట్టిన పనులు ఫాస్ట్ గా పూర్తవుతాయి. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు సాధ్యమవుతాయి. ఉద్యోగులకు ఎదురైన ఇబ్బందులు సమసిపోతాయి. రాజకీయవర్గాల వారికి ఆశించిన పదవులు దక్కుతాయి. అద్భుతమైన విజయాలుసాధిస్తారు. ఇబ్బందుల నుంచి బయటపడతారు. గతంలో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. 

Published at : 05 Feb 2023 01:35 PM (IST) Tags: Check Astrological prediction Weekly Horoscope Telugu Weekly Horoscope predictions Weekly Horoscope Aries Weekly Horoscope leo Rasi Phalalu Weekly

సంబంధిత కథనాలు

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి  ఎప్పుడొచ్చింది,  ప్రత్యేకత ఏంటి!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !