Venus transit in Aries 2023: ప్రతి నెలా గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. గ్రహాల కదలికలు అన్ని రాశులపైనా ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశులపై శుభ ఫలితాలను చూపిస్తే మరికొన్ని రాశులపై అశుభ ఫలితాలను సూచిస్తాయి. మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. సుఖ సంతోషాలనిచ్చే శుక్రుడు మార్చి 12వ తేదీ ఉదయం మీన రాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. 6 ఏప్రిల్ 2023 ఉదయం వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. అప్పటికే అదే రాశిలో ఉంటాడు రాహువు. మేషరాశిలో శుక్రుడు, రాహువు కలయిక వల్ల కొన్ని రాశులవారికి శుభఫలితాలను సూచిస్తోంది. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read: 12 ఏళ్ల తర్వాత ఏర్పడిన నవపంచమ రాజ్యయోగం, ఈ 3 రాశుల వారికి మహర్థశ
మిథున రాశి
మేష రాశిలో శుక్రుడు, రాహువు కలయిక మిథున రాశివారికి అనుకూల ఫలితాలనిస్తోంది. మిథునరాశికి 11వ ఇంటిలో శుక్రుడు సంచరిస్తాడు..ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులకు ఇదే సరైన సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అనుకోని ఆదాయం చేతికందుతుంది. తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు శుభసమయం...ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు.
తులా రాశి
తులా రాశి వారికి కూడా మేష రాశిలో శుక్రుని సంచారం చాలా శుభప్రదం కానుంది. ఈ సమయంలో అవివాహితులకు వివాహం జరుగుతుంది. పెళ్లైన వారి జీవితం ప్రేమపూర్వకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులకు శుభసమయం. ఆదాయం పెరుగుతుంది..ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
మీన రాశి
రాహువు, శుక్రుల కలయిక వల్ల మీనరాశివారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈ సమయంలో డబ్బు ఆకస్మికంగా చేతికందుతుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న మొత్తం కూడా వసూలవుతుంది. వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి...లాభాలు పొందుతారు. సౌకర్యాలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో సంతోషం ఉంటుంది. అవివాహితులు పెళ్లిదిశగా ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆలోచించి మాట్లాడండి.
Also Read: ఈ వారం ఈ రాశివారి జీవితంలో పెద్ద సానుకూల మార్పు రాబోతోంది
సాధారణంగా శుక్రుడు.. జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆనందం, ఆకర్షణ, అందం, యవ్వనం, ప్రేమ సంబంధం, కోరికలు, ప్రేమ నుంచి సంతృప్తిని సూచిస్తుంది. ఇది సృజనాత్మకత, కళలు, సంగీతం, కవిత్వం, డిజైనింగ్, వినోదం, ప్రదర్శనలు, గ్లామర్, ఫ్యాషన్, నగలు, విలువైన రాళ్లు, అలంకరణ, విలాసవంతమైన ప్రయాణం, విలాసవంతమైన ఆహారం, లగ్జరీ వాహనాలకు సంబంధించన అంశాలకు కూడా సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా, మేషం అంగారక గ్రహానికి చెందినది..మండుతున్న సంకేతం. ఇది శుక్రుని కంటే ప్రకృతిలో పూర్తిగా వ్యతిరేకమైనది కానీ "వ్యతిరేకమైనది ఆకర్షిస్తుంది" అనే పదబంధం మేషరాశిలో శుక్ర సంచారానికి పూర్తిగా సరిపోతుంది.
నోట్: ఆయా రాశుల్లో ఫలితాలు ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.