Weekly Horoscope November 23 to 29 :ఈ వారం  టారో కార్డ్  గణన ప్రకారం తులా నుండి మీనం వరకూ 23-29 నవంబర్ 2025 వార ఫలితాలు తెలుసుకుందాం

Continues below advertisement

నవంబర్ చివరి వారంలో గ్రహాలు, నక్షత్రాల్లో ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. మొదట, బుధుడు తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 29న, శుక్రుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు, ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది కొన్ని రాశులకు సానుకూల ఫలితాలను తెస్తుంది. ఇప్పుడు ఈ గ్రహాల మార్పు తులా నుంచి మీనం వరకు ఏ అంశాలపై ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం ముఖ్యం. 

తులా రాశి  (Libra Weekly Tarot Card Reading)

Continues below advertisement

 టారో   కార్డుల గణన ప్రకారం తులా రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ వారంలో మీ స్వభావంలో కోపం కనిపిస్తుంది. అయితే అనవసరపు ఖర్చులను నివారించాలి..లేదంటే ఆ ప్రభావం మీ ఆర్థిక పరిస్థితిపై కనిపిస్తుంది. ఏదో ఒక విషయంలో మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో మనస్పర్థలు ఉండవచ్చు.

వృశ్చిక రాశి (Scorpio Weekly Tarot Card Reading)

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కార్యాలయంలో సహోద్యోగి ఆకర్షణకు గురవుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ వారంలో మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంబంధిత విషయాల్లో ఆచితూచి అడుగేయాలి ధనుస్సు  రాశి (Sagittarius Weekly Tarot Card Reading)

టారో కార్డుల గణన ప్రకారం, ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మీ వ్యక్తిత్వం బలహీనంగా కనిపిస్తుంది.  మీ ప్రజా సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. మీరు ఈ వారం ఏదో ఒక విషయంలో కొంచెం విచారంగా అనిపించవచ్చు. విమర్శలు,  మీ శ్రేయోభిలాషుల వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి 

మకర రాశి (Capricorn Weekly Tarot Card Reading)

మకర రాశి వారు ఈ వారం కొత్త పనులలో చాలా బిజీగా ఉంటారు. అయితే, మీ ఆర్థిక పరిస్థితి మునుపటిలాగే బాగుంటుంది. అలాగే, ఈ రోజు మీరు చాలా రిలాక్స్‌గా ఉంటారు. మీరు మీ పని రంగంలో పురోగతితో సంతృప్తి చెందుతారు.  మీ కుటుంబం , స్నేహితులతో సంతోషకరమైన వాతావరణంలో గడుస్తుంది. ఈ వారం మీలో కొత్త శక్తిని నింపుతుంది

కుంభ రాశి (Aquarius Weekly Tarot Card Reading)

కుంభ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వారంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు దేని కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అది నెరవేరుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. లాభం పొందే అవకాశం ఉంది, కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. 

మీన రాశి (Pisces Weekly Tarot Card Reading)

మీన రాశి ఉద్యోగులకు ఈ వారం కొత్త ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. ఈ వారంలో కోపంగా ఉంటారు. అనవసరపు ఖర్చులను తగ్గించండి. జీవిత భాగస్వామితో మనర్పర్థలు ఉండొచ్చు.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.