Shani Effect 2026: కొన్ని రోజుల్లో క్యాలెండర్ మారుతుంది..కానీ...శని అదే రాశిలో సంచరిస్తాడు.పాత సంవత్సరంలో ఏ రాశులపై శనిప్రభావం ఉంటుందో అవే రాశులపై శనిప్రభావం కొనసాగుతుంది. కారణం శని ఒక్కో రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తాడు. అంటే రెండున్నరేళ్లకు ఓసారి రాశులపై శని ప్రభావంలో మార్పులువస్తాయన్నమాట. శనిదేవుడు 2025 ఏప్రిల్ నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు..ఇదే రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తాడు. అందుకే క్యాలెండర్ 2025 నుంచి 2026 కి మారినా కానీ ఆయా రాశులపై శని ప్రభావంంలో మార్పులు ఉండవు.
నూతన సంవత్సరం 2026 గురించి కొత్త ఆశలు, సానుకూల మార్పులను ఆశిస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరం చాలా రాశిచక్ర గుర్తులకు కష్టతరంగా ఉండవచ్చు. దీనికి కారణం శని సాడేసతి అని చెప్పాలి. శనిని న్యాయ దేవతగా భావిస్తారు, ఇది చాలా శక్తివంతమైన గ్రహం. శని మనిషికి కర్మల ప్రకారం ఫలితాలను కూడా ఇస్తాడు. శని గోచార సమయంలో జీవితంలో పోరాటం, ఒత్తిడి, ఆలస్యం, మానసిక హెచ్చు తగ్గులు కనిపిస్తాయి.
2026లో శని రాశిని మార్చడు
శని దేవుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తాడు. 2025లో మీనరాశిలోకి ప్రవేశించిన శనిభగవానుడు 2027 జూన్ వరకూ ఇదే రాశిలో ఉంటాడుయ అటువంటి పరిస్థితిలో 2026లో శని రాశి మార్పు ఉండదు ... ఏ రాశిచక్ర గుర్తులపై శని ప్రభావం నడుస్తోందో అదే 2026లోనూ కొనసాగుతుంది. ఈ కారణంగా 2026 సంవత్సరంలో కూడా ఈ రాశిచక్ర గుర్తులు శని యొక్క ఈ తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ సహనం, సంయమనం అవసరం.
2026లో ఏ రాశిచక్ర గుర్తులపై శనిప్రభావం ఉంటుందో తెలుసుకోండి! కుంభ రాశి
కుంభ రాశి జాతకులపై ఏల్నాటి శని చివరి దశ నడుస్తోంది. మీ రాశి నుంచి శనిదేవుడు రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో మీరు కష్టపడి పనిచేయాలి, సహనంగా ఉండాలి..అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. అయితే 2026లో మీకు మానసిక ఒత్తిడి పెరగవచ్చు..చిన్న చిన్న పనులు పూర్తిచేయడానికి కూడా ఎక్కువసమయం పట్టొచ్చు మీన రాశి
శని ప్రస్తుతం మీ రాశిలోనే ఉన్నాడు. ఏల్నాటి శని రెండో దశ నడుస్తోంది మీకు. ఇది జూన్ 2027 వరకు కొనసాగుతుంది. ఏల్నాటి శని మూడు దశల్లో రెండో దశ చాలా కష్టతరమైనది. ఈ సమయంలో శని ప్రభావం మీ ఆరోగ్యంపై ఉంటుంది..ఆర్థిక ఇబ్బందులుకూడా వెంటాడుతాయి మేష రాశి
మీ రాశి నుంచి శని సంచారం 12వ ఇంట్లో ఉంది. అంటే మీకు ఏల్నాటి శని మొదటి దశ నడుస్తోంది. ఈ సమయంలో కుటుంబ సుఖ శాంతులు భంగం కలిగించవచ్చు.. మానసిక ఒత్తిడి నిరంతరం పెరగవచ్చు. సహనమే మీకు రక్ష సింహ రాశి
సింహ రాశి వారిపై శని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుంచి శని సంచారం ఎనిమిదో స్థానంలో ఉంది..ఈ సమయంలో మీకు అష్టమ శని అన్నమాట. అష్టమంలో శని సంచారం ఖర్చులు పెంచుతాడు..అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసిక, శారీర బాధలు పెరగవచ్చు ధనుస్సు రాశి
జూన్ 2027 వరకూ శని సంచారం మీన రాశిలో ఉంటుంది..అంటే మీ రాశి నుంచి నాలుగో స్థానంలో శని సంచారం..దీన్ని అర్ధాష్టమ శని అంటారు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏర్పడతాయి శని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఇవి చేయండి
ప్రతి శనివారం శని దేవుడిని, హనుమంతుడిని పూజించండి శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి ప్రదక్షిణలు చేయండి , ఆవాల నూనెతో దీపం వెలిగించండి
శనివారం నల్ల నువ్వులు, మినపప్పు, నల్ల గొడుగు, చెప్పులు, ఇనుము, ఆవాల నూనెను దానం చేయండి
శని చాలీసా లేదా హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించడం ద్వారా కూడా శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.