Renault Kiger Latest News: కేవలం లక్ష రూపాయల డౌన్ పేమెంట్ కడితే చాలు Renault కిగర్ ను సొంతం చేసుకోవచ్చు. అలాగే అతి తక్కువ డౌన్ పేమెంట్ తో ఈఎంఐ రూపంలో ఈ కారును దక్కించుకోవచ్చు. కిగర్ కార్ ను లక్ష డౌన్ పేమెంట్ తోపాటు దాని ఈఎంఐ ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం..Renault 2025 కిగర్ ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ SUV ని Renault కంపెనీ నుండి వచ్చిన సబ్-4 మీటర్ల బడ్జెట్ ఫ్రెండ్లీ, స్టైలిష్ , ఫీచర్-రిచ్ వాహనంగా చెప్పుకోవచ్చు.
కొత్తగా వచ్చిన ఈ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ bold డిజైన్‌తో పాటు premium ఫీచర్లు ,advanced safety ప్యాకేజీతో ఆకట్టుకుంటోంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ. 6.29 లక్షలు కాగా, హైదరాబాద్ లో దీని అన్-రోడ్ ధర సుమారు రూ. 7.25 లక్షలుగా ఉంటుంది, ఇందులో RTO రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్సూరెన్స్, హ్యాండ్లింగ్ ఛార్జీలు మొదలైనవి కలుపుకొని ఉంటాయి. మీరు ఈ కారును కొనాలనుకుంటే, మీరు కనీసం రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. మిగతా రూ. 6.25 లక్షలపై మీరు 5 సంవత్సరాల పాటు 9% వడ్డీ రేటుతో కార్ లోన్ తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ. 12,000 నుండి రూ. 13,000 మధ్య ఉండవచ్చును. అయితే ఈ EMI ఖచ్చితంగా మీరు తీసుకునే బ్యాంకు, మీ క్రెడిట్ స్కోరు , రుణ కాల వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.
రెండు ఇంజిన్లు..
ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త Renault కిగర్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు లభిస్తున్నాయి. మొదటిది 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది సిటీలో సాఫీగా నడపడానికి అనుకూలంగా ఉంటుంది. రెండవది 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, ఇది ఎక్కువ పవర్ , స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ రెండు ఇంజిన్లలో మాన్యువల్ , ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ సుమారు 19.83 కిలోమీటర్లు ప్రతి లీటరుకు మైలేజీ ఇస్తుందని తెలుస్తోంది. అలాగే టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 20.38 కిలోమీటర్లు లీటరుకు ఇస్తుందని తెలుస్తోంది.
అద్భుతమైన ఫీచర్లు..
ఫీచర్ల విషయానికి వస్తే, రెనో కిగర్ ప్రీమియం లుక్ లో రూపొందించబడింది. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ , ఆపిల్ కార్‌ప్లే, వైర్లెస్ మొబైల్ చార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దాంతో పాటు, Renault భద్రత పరంగా కూడా ఈ మోడల్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఉంటాయి, అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీటు మౌంటులు, అలాగే ABS మరియు EBD వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. మొత్తానికి Renault కిగర్ ఫేస్‌లిఫ్ట్ 2025 మోడల్ ఒక బడ్జెట్‌లో లభించే, ఆకర్షణీయమైన, అధునాతన ఫీచర్లతో కూడిన పూర్తి భద్రత కలిగిన SUVగా నిలుస్తోంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి ఫ్రాంక్స్ వంటి ప్రీమియం సబ్-కాంపాక్ట్ SUVలకు ఇది గట్టి పోటీనిస్తున్నది.