Politics Astrology: రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటారు. సామాజిక సేవా మార్గాల ద్వారా ప్రజలకు చేరువకావాలని వారు రాత్రింబవళ్లు కష్టపడతారు. అయితే  ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించేయలేరు..ఆశించిన స్థాయిలో రాజకీయాల్లో వెలగలేరు. అందుకు శ్రమ, అదృష్టంతో పాటూ గ్రహాల అనుగ్రహం కూడా ఉండాలని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాజకీయాల్లో విజయం సాధించాలంటే, జాతకంలో దానికి సంబంధించిన యోగం ఉండటం చాలా ముఖ్యం. మరి జాతకంలోని ఏ యోగాలు రాజకీయాల్లో విజయాన్ని అందిస్తాయో తెలుసుకుందాం.

Continues below advertisement

ప్రతి ఒక్కరూ గుంపులో భాగంగా ఉండిపోలేరు..అతికొద్దిమంది మాత్రమే ఆ గుంపుని నడిపించాలని, ఆ గుంపుకి నాయకుడు కావాలని కోరుకుంటారు.  వైదిక జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికలు ఉన్నాయి, ఇవి నేరుగా రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతారు.

సూర్యుడు - రాజు (అధికారం, బలం, గౌరవం)

Continues below advertisement

జాతకంలో సూర్యుడు 1,5,9,10,11వ ఇంట్లో ఉంటే, మీరు నాయకత్వ పాత్ర వైపు ఆకర్షితులవుతారు. జాతకంలో బలమైన సూర్యుడు మీకు-

సామాజిక గౌరవంఆత్మవిశ్వాసంఅధికారంప్రజలపై అధికారం చెలాయించే అవకాశం ఇస్తుంది.

అదే సమయంలో సూర్యభగవానుడు మీ జాతకంలో బలహీనంగా ఉంటే.. భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం,  రాజకీయాల్లో వైఫల్యానికి కారణం కావచ్చు.

మంగళ - కమాండర్ (వ్యూహం + ధైర్యం)

జాతకంలో కుజుడు మూడవ, ఆరవ, పదవ , పదకొండవ భావంలో ఉంటే..

కమ్యూనికేషన్‌లో మంచి పట్టువిపక్షాలతో పోరాడే సామర్థ్యంవ్యూహాత్మకనిర్ణయాలు తీసుకోవడంలో బలం ఇస్తుంది. ప్రతి రాజకీయ నాయకుడికి అగ్ని (ఆసక్తి) అవసరం, కుజుడు దీనిని అందిస్తాడు.

రాహువు - మాస్ ఇన్ఫ్లుయెన్సర్ (గుంపు + ప్రజాదరణ)

జాతకంలో రాహువు మూడవ, పదవ లేదా పదకొండవ ఇంట్లో ఉంటే-

పెరుగుతున్న ప్రజాదరణప్రజల మద్దతుమీడియా ఫేమ్జాతకంలో రాహువు బలంగా ఉండటం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది.

శని - వ్యవస్థ (ప్రభుత్వం + విధులు)

శని జాతకంలో పదవ లేదా పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల...

రాజకీయ ప్రపంచంలో ఎక్కువ కాలం అభివృద్ధిక్రమశిక్షణప్రజల్లో ఎప్పటికీ  ప్రజాదరణబాధ్యతలను నిర్వహించే సామర్థ్యాన్ని పొందుతారు. 

శని మహాదశ సమయంలో రాజకీయ జీవితంలో అత్యంత స్థిరత్వం వస్తుంది.

జాతకంలో రాజకీయాలకు ఉత్తమ యోగాలు

సూర్యుడు + కుజుడు + రాహువు + శని   నాయకత్వంప్రభావవంతమైననిర్వహణలో నైపుణ్యంప్రజలలో ప్రజాదరణప్రజల నిరంతర మద్దతును పొందడం

ముఖ్యమైన విషయం ఏమిటంటే నాయకత్వ యోగం అంటే రాజకీయ నాయకుడు అని మాత్రమే కాదు..ఇంకా ప్రజా ప్రతినిధులుసామాజిక కార్యకర్తలుకార్యకర్తలుప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తిఅడ్మినిస్ట్రేటర్ (పరిపాలకులు)

జాతకంలో ఈ బలమైన యోగం 10వ ,  11వ ఇళ్లతో కలిసినప్పుడు అది రాజకీయ యోగంగా పరిగణించవచ్చంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.  

ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

 దేవతల వాహనాలను ఆధునిక టెక్నాలజీతో ముడిపెడితే! ఆశ్చర్యపరిచే రహస్యాలు! eVTOL, AVATAR ఇంకా...