Palmistry: మీ అరచేతిలోఈ గుర్తులుంటే ఇక తిరుగులేదు! అదృష్టం తలుపు తడుతుంది, ధనం వెల్లువలా వస్తుంది!
Hast Rekha Shastra: చేతి రేఖలు భవిష్యత్, వ్యక్తిత్వం, అదృష్టాన్ని సూచిస్తాయి. మీ అరచేతిలో ఈ గుర్తులుంటే, మీఅంత అదృష్టవంతులు లేరు.

Palmistry: ఒక వ్యక్తి అరచేతిలో ఎన్నో గుర్తులుంటాయి, ఇవి శుభ - అశుభ సంఘటనలకు సంబంధించినవి. కొన్ని రేఖలు కూడా ఉన్నాయి, ఇవి ఒక వ్యక్తి అదృష్టాన్ని మారుస్తాయని నమ్ముతారు కొందరు. కొన్ని రేఖలు కెరీర్ ని సజావుగా సాగేలా చేస్తాయని, కొన్ని రేఖలు అంతులేని ధనాన్ని ఇస్తాయని చచెబుతారు. అయితే అందరి చేతిలో అదృష్ట రేఖలు ఉండవు. మరి ఏ రేఖలు అదృష్టాన్నిస్తాయో తెలుసుకోండి.
హస్తరేఖ గుర్తులు - వాటి అర్థాలు
చేప గుర్తు
అరచేతిలో చేప గుర్తు ఉండటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ వ్యక్తులు ఉన్నత పదవి లేదా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ గుర్తు వ్యక్తి కెరీర్‌లో కొత్త అవకాశాలను తెస్తుంది ..పనిచేసే ప్రదేశంలో సదా సక్సెస్ ను అందిస్తుంది
త్రిశూలం గుర్తు
అరచేతిలో త్రిశూలం గుర్తు శుభానికి, అదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇది వ్యక్తికి విజయం, కీర్తి, ధనం శ్రేయస్సును తెస్తుంది. ఈ గుర్తు శివుని అనుగ్రహానికి చిహ్నం. జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది.
ఓడ గుర్తు
అరచేతిలో ఓడ గుర్తు ఉంటే, అది వ్యక్తి సముద్రం దాటి వ్యాపారం చేస్తారని ..బారీగా సంపద పొందుతారు అనేందుకు సంకేతం. కేవలం ఇదొక్కటే కాదు ఓడగుర్తు ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా విజయం సాధిస్తారు... సముద్రంపై వ్యాపారం చేసేవారు మరింత లాభపడతారు.
కలశం గుర్తు
అరచేతిలో కలశం గుర్తు మతపరమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని సూచిస్తుంది. అలాంటి వారు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు . ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మతాన్ని ప్రచారం చేయాలనే ఆలోచనలో ఉంటారు. నిత్యం భగవంతుడి ధ్యానంలో ఉంటారు. తమచుట్టూ ఉండేవారిని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తారు.
చక్రం గుర్తు
చక్రం గుర్తు చాలా శుభంగా పరిగణిస్తారు.ఇలాంటి వారు తమ ఆలోచనలలో స్వతంత్రంగా ఉంటారు. వారి వివేకం మరియు సొంత ఆలోచనల ఆధారంగా ముందుకు సాగుతారు.
పల్లకి గుర్తు
అరచేతిలో పల్లకి గుర్తు ఉండటం అత్యంత శుభప్రదం అంటారు హస్తసాముద్రికం నిపుణులు. అలాంటి వారు గొప్ప జీవితాన్ని గడుపుతారు . భౌతిక సౌకర్యాలను అనుభవిస్తారు. విలాసవంతంగా జీవిస్తారు. అపారమైన ధనం ఉంటుంది. ఎప్పటికీ డబ్బు సమస్య ఉండదు. దేనికీ లోటుండదు
సూర్యుని గుర్తు
ఎవరి అరచేతిలో సూర్య రేఖ ఉంటుందో వారి అదృష్టాన్ని మాటల్లో చెప్పలేం. వారి జీవితం వెలిగిపోతుంది. చాలా తక్కువ శ్రమతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. జీవితంలో అడుగడుగునా గౌరవం అందుకుంటారు. అపారమైన ధనాన్ని సంపాదిస్తారు.దేనికీ లోటులేకుండా సాగిపోతారు...
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ABP దేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
నరక చతుర్దశి 2025 ఎప్పుడు! 19 లేదా 20 అక్టోబర్ 2025 ? పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















