#July5 Disaster

జపాన్, ఫిలిప్పీన్స్‌లో సునామీ రాబోతోందా?

భవనాల కంటే ఎత్తైన అలలు ఎగసిపడబోతున్నాయా?

లక్షల మంది ప్రజలు ప్రమాదానికి చేరువలో ఉన్నారా?

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న న్యూ బాబా వంగా.. ర్యో తత్సుకీ  జోస్యం

ఆమె చెప్పిన రోజు దగ్గరకు వచ్చేసింది

జూలై 5నే విలయం జరబోతుందా?

ద ఫ్యూచర్ ఐసా పేరుతో ర్యో తుత్సుకీ రాసిన పుస్తకంలో ఆమె ప్రస్తావించిన విషయాలివి. ఇప్పుడు ఆ వివరాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి..జూలై5 శనివారం నిజంగా సునామీ వస్తుందా అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది

జూలై 5 డిజాస్టర్ అంటూ ఆన్ లైన్లో ట్రెండ్ అవుతోంది...

ఈ జోస్యం చూసి టోక్యో, సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు..కుటుంబాన్ని వదలి ఎక్కడికీ వెళ్లడం లేదు, ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు ఇంతకీ ఎరీ రియో ​​టాట్సుకి- ఆమె ఏం చెప్పారు

జపాన్‌కు చెందిన మాంగా ఆర్టిస్టు రియో ​​టాట్సుకి. ‘ద ఫ్యూచర్‌ ఐ సా   పేరుతో ఆమె 1999లో స్వయంగా చేతిరాతతో పుస్తకం రాసింది.

ప్రిన్సెస్ డయానా మరణం

2011 జపాన్ భూకంపం మరియు సునామీ

COVID-19 మహమ్మారి

ఇప్పుడు—జూలై 5, 2025న భారీ సునామీ

గతంలో చెప్పినవి అక్షరాలా నిజం అవడంతో అంతా ఆమెను  ‘జపనీస్‌ బాబా వంగా’ అని పిలుస్తున్నారు. కరోనా గురించి కూడా ఈమె ముందే చెప్పారు. అప్పటి నుంచి  రియో ​​టాట్సుకి పేరు మారుమోగిపోయింది. జూలై 5న సునామీ వస్తుందని కూడా ఆమె తన పుస్తకంలో 20 ఏళ్ల క్రితం పేర్కొన్నారు. ఇప్పుడు టైమ్ దగ్గరపడడంతో ఇది మరోసారి ట్రెండ్ అవుతోంది.  జపాన్, ఫిలిప్పీన్స్‌ నడుమ సముద్రగర్భం బద్దలై భారీ భవనాలను దాటి రాకాసి అలలు ఎగసిపడనున్నాయని ఆమె పుస్తకంలో రాసుకొచ్చారు. దీంతో ఇది కూడా నిజమవుతుందా అనే భయాందోళనలో ఉన్నారంతా. అయితే 2025 తర్వాత అంచనాలు వేయడం పూర్తిగా మానేశారు..తన దృష్టి ఆకస్మికంగా ముగిసిందని ఆమె చెప్పారు.  ప్రస్తుతం #July5Disaster ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది

టోక్యో  ఒకినావాలో భయాందోళనల కారణంగా బుకింగ్ రద్దులు నమోదవుతున్నాయి.

ఈ భయంతో ప్రయాణాలు రద్దు చేసుకున్నారుట పలు విమానాలు కూడా రద్దు చేశారు

ఎక్స్ లో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం...

కరోనా గురించి రియో ​​టాట్సుకి చెప్పింది నిజమైంది. నేను ఏ అవకాశమూ తీసుకోను. ఒసాకాకు నా ట్రిప్ రద్దు చేసుకున్నాను. #July5Disaster" నిపుణులు చెబుతున్నారు: "శాస్త్రీయ ఆధారాలు లేవు" ని పోస్ట్ పెట్టారు

 

అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఆ ప్రాంతంలో తక్షణ భూకంపం లేదా సునామీ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఏ అధికారిక సంస్థ — JMA (జపాన్ వాతావరణ సంస్థ), IMD లేదా USGS — జూలై 5 కోసం ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.  

గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.