Mulank 2  Personality Traits:   సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 2, 11 , 20, 29వ తేదీల్లో జన్మించిన వారికి రాడిక్స్ సంఖ్య 2 ఉంటుంది. ఈ రాడిక్స్ సంఖ్య చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది, కాబట్టి ఈ వ్యక్తులు మృదుత్వం, సున్నితత్వం , ఆకర్షణను ప్రదర్శిస్తారు,   ప్రజలు వారితో త్వరగా అనుబంధం ఏర్పరచుకుంటారు. కొంతమందిని కలిసిన వెంటనే, వారు మనకు చాలా దగ్గరివారు అనిపిస్తుంది. సంఖ్యాశాస్త్రంలో, అటువంటి వ్యక్తులు తరచుగా 2 సంఖ్యకు చెందినవారు అంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. వారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపిస్తారో, అంతే భావోద్వేగంతో, లోతుగా ఆలోచించేవారిగా  తమ సంబంధాలలో నిండు మనసుతో ఉంటారు.

Continues below advertisement

ఈ తేదీల్లో జన్మించిన వారిని అంతా ఎందుకు ఇష్టపడతారు?

సంఖ్య 2 ఉన్న వ్యక్తులు చాలా స్వచ్ఛమైన హృదయం కలవారు. వారు ఇతరుల భావోద్వేగాలను త్వరగా అర్థం చేసుకుంటారు , ప్రతి సంబంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. వారి మృదువైన మాటతీరు , సమతుల్యమైన ప్రవర్తన వల్ల ఇతరులు సౌకర్యవంతంగా భావిస్తారు. వారి గొప్ప లక్షణం ఏంటంటే,  గొడవలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రతి పరిస్థితిని ప్రేమ, అవగాహనతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా కార్యాలయమైనా, వారు దాదాపు ప్రతి సందర్భంలోనూ అందరికీ ఇష్టమైనవారిగా మారిపోతారు. ఈ వ్యక్తులు ఊహాశక్తి, సృజనాత్మకత కలిగి ఉంటారు. వీరు కళ, సంగీతం, రచన, రూపకల్పన, ఇంకా భావోద్వేగభరితమైన కార్యకలాపాలను ఆస్వాదిస్తారు. వారు బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోతుగా ఆలోచించేవారుగా ఉంటారు. వారు కొన్నిసార్లు అతిగా ఆలోచించి, చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుంటారు. 

2,11,20,29 తేదీల్లో జన్మించిన ఏ వృత్తిలో విజయవంతమవుతారు?

సంఖ్య 2 ఉన్న వ్యక్తులు సృజనాత్మకత, భావోద్వేగాలు  ఇతరులతో అనుబంధం అవసరమయ్యే వృత్తులలో  విజయవంతమవుతారు. రచయితలు  కంటెంట్ సృష్టికర్తలు, కళా సంబంధిత రంగాలు, కౌన్సిలర్లు, ఫ్యాషన్ లేదా ఇంటీరియర్ డిజైన్, థెరపిస్టులు, సామాజిక సేవ,   హోటల్, ఆతిథ్య పరిశ్రమ వంటివి వారికి కొన్ని ఉత్తమమైన వృత్తి ఎంపికలు. వారు వ్యాపారంలో కూడా రాణించగలరు,  భాగస్వామ్యాలు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

Continues below advertisement

నంబర్ 2 ఉన్న వ్యక్తులు ప్రేమ, సంబంధాలలో ఎలా ఉంటారు?

2,11,20,29 తేదీల్లో జన్మించిన వారు నిజమైన ప్రేమికులు. వారు తమ భాగస్వామి చిన్న చిన్న భావాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. సంబంధాలలో నిజాయితీకి విలువ ఇస్తారు. వారు మోసాన్ని, అబద్ధాలను ఇష్టపడరు. వారు తమ సంబంధాలలో గాఢతను కోరుకుంటారు. తమ భాగస్వాములకు  పూర్తిగా ప్రత్యేకమైనవారమనే భావనను కలిగించడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు, మితిమీరిన సున్నితత్వం వారి సంబంధాలలో సమస్యలను సృష్టించవచ్చు. 

2 సంఖ్యకు చంద్రుడు శుభ గ్రహం. ఈ వ్యక్తులు తమ పనిలో విజయం సాధించాలనుకున్నప్పుడు, వారు తెలుపు, క్రీమ్ , లేత నీలం రంగు దుస్తులను ధరించాలి; ఈ రంగులు వారికి శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. వారి భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోవడానికి, వారు ముత్యాలను ధరించాలి . ఈ సంఖ్యకు  అదృష్ట సంఖ్యలు 2, 7, 11 .  

నంబర్ 2 బలాలు (Positive Traits)

భావోద్వేగంగా, సున్నితంగా ఉంటారుశృంగారభరిత స్వభావంప్రశాంతమైన , మర్యాదపూర్వకమైన వ్యక్తిత్వంఇతరులకు సహాయం చేసేవారుసృజనాత్మక మనస్సు కలవారుసంబంధాలకు విలువ ఇచ్చేవారుసులభంగా మనస్తాపం చెందుతారు

2,11,20,29 తేదీల్లో జన్మించినవారి బలహీనతలు  (Negative Traits) 

అతిగా భావోద్వేగానికి లోనవడంఅందరినీ తొందరగా నమ్మవద్దుఅతిగా ఆలోచించడంవిశ్వాసం లేకపోవడంఇతరులను సంతోషపెట్టడానికి మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోవడంప్రతికూల వ్యక్తుల సాంగత్యానికి దూరంగా ఉండండి

సలహా: ఈ వ్యక్తులు తమ భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం నేర్చుకుంటే, జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలరు.

రోహిణి కార్తె అంటే ఏంటి? 2026లో రోహిణి కార్తె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈ సమయంలో ఏం చేయకూడదు?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 న్యూమరాలజీ ప్రకారం మీ నంబర్ ఏది? కామెంట్ చేయండి... మీరు అడిగిన నంబర్ కి సంబంధించిన కథనం అందిస్తాం