Mangal Gochar Effect  2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు చాలా ముఖ్యమైనవి. ఒక గ్రహం రాశిచక్రంతో పాటు తన నక్షత్రాన్ని మార్చుకున్నప్పుడు, దాని ప్రభావం కూడా మారుతుంది. సెప్టెంబర్ చివరి వారంలో కుజుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ 24న కుజుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అందువల్ల, ఈ సమయం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. 

Continues below advertisement

కన్యారాశిలో సూర్య గోచారం 2026: బుధాదిత్య యోగంతో మేషం to మీనం మీ జాతకం మారనుందా?

కుజుడు సెప్టెంబర్ 24న ఉదయం 5:50 గంటలకు పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 17, 2026 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. ఈ సమయంలో కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు. కర్కాటక రాశి కుజుడికి బలహీనమైన రాశిగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అయినప్పటికీ, ఈ రాశిలో గురుడు ఉండటం వల్ల, కుజుడి దుష్ప్రభావాలు తగ్గి శుభ ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులవారికి శుభ ఫలితాలున్నాయి.           

సింహ రాశి

Continues below advertisement

కుజుడి రాశి మార్పు సింహ రాశి వారికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, మీకు ఒక మంచి అవకాశం లభించవచ్చు. పనిలో మీకు కొన్ని కొత్త బాధ్యతలు తీసుకుంటారు. త్వరలో మీకు కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది.    

సింహ రాశి వారఫలాలు సెప్టెంబర్ 13 - 19: అదృష్టం, ధనం, ప్రేమలో అద్భుత విజయాలు!                   

కన్యా రాశి కుజుడి సంచారం కన్యారాశి వారికి శుభప్రదం. ఈ సమయంలో మీరు సమాజంలో మంచి గౌరవం, హోదా పొందుతారు. మీ వృత్తిలో పురోగతికి సూచనలు కనిపిస్తున్నాయి. మీకు పనిలో కొన్ని కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి  మీకు మంచి సహకారం లభిస్తుంది. 

కన్యా రాశి వారఫలాలు సెప్టెంబర్ 13-19: ఈ వారం కీలక విషయాల్లో జాగ్రత్త!

ధనుస్సు రాశి                    కుజ సంచారం ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను మీరు చూస్తారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. అలాగే, మీ పని ఊపందుకుంటుంది. ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీరు ఉద్యోగంలో కొత్త అవకాశాలను చూస్తారు.    

ధనస్సు రాశి వారఫలాలు సెప్టెంబర్ 13-19: సవాళ్లు, అవకాశాలు.. శాంతికి మార్గం!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి