హిందూ ధర్మంలో జీవితం సుఖశాంతులతో గడపడానికి కావల్సిన అనేక నియమాలు, ఉపాయాలు ఎన్నో శాస్త్రబద్దంగా వివరించారు. అలా జీవన విధానాలను తెలియజేసిన శాస్త్రాలలో జ్యోతిష్యం ఒకటి. చాలా సులభంగా పాటించగలిగే అనేక ఉపాయాలు ఇందులో వివరించారు.


జ్యోతిష్య శాస్త్రంలో జీవితానికి సంబంధించి ఎన్నో చిన్నచిన్న నియమాలు చెప్పారు. వాటిని అనుసరించి జీవితం గడిపినపుడు సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. కొన్ని రాశుల వారి అదృష్లం ఎంత బావుంటుందంటే.. కాస్త శ్రద్ధ పెడితే చాలు విజయాలు వారి ముందుంటాయి. అదే ఇంకొన్ని రాశుల వారికి చాలా కష్టపడితే తప్ప జీవితం ఒక స్థాయికి రాదు. జ్యోతిష్యంలో చెప్పిన కొన్ని విధివిధానాలను అనుసరించినపుడు భాగ్యోదయం కావచ్చు. అలాంటి కొన్ని సులభమైన ఉపాయాలను తెలుసుకుందాం.



  1. సనాతన ధర్మం ప్రతి ఒక  చిన్న విషయం గురించి కూడా వివరణలు ఇచ్చింది. ఎక్కడో ఒక చోట కూర్చుని ఏదో నాలుగు ముద్దలు తినెయ్యడం కాదు. తినే చోటు కూడా ముఖ్యమే.  భోజనం చేసే సమయంలో ఎప్పుడూ తూర్పు వైపు ముఖం చేసి కూర్చోవాలి. ఇలా భోంచెయ్యడం వల్ల జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని, ధన ధాన్యాలకు లోటు ఉండదని  శాస్త్రం చెబుతుంది. అంతే కాదు భోజన సమయంలో పాదరక్షలు ధరించకూడదు. తినే సమయంలో చెప్పులు వేసుకుంటే అది అన్నపూర్ణా దేవిని అవమానించినట్టే. కనుక భోజనం ఎప్పుడూ చెప్పులు లేకుండానే చెయ్యాలి.

  2. ఇంట్లో పూజ చేసుకునే గది లేదా స్థలం పవిత్రమైంది. ఇక్కడి నుంచే ఇంట్లోకి మనం పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానించేంది. అందుకే పూజ గదిలో రోజూ పద్ధతిగా పూజ జరగాలి. తప్పని సరిగా దీపారాధన జరగాలి. ఇలా చెయ్యడం వల్ల నిత్యం దేవతల ఆశీర్వాదం ఆ ఇంటి మీద ఉంటుంది. తులసి హిందువులకు పవిత్రమైన దేవత. ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా ఒక మొక్క ఉంటుంది. ఇంట్లో తలసి కోట దగ్గర ప్రతి రోజు నేతితో దీపారాధన తప్పకుండా చెయ్యాలి.

  3. పూజ మాత్రమే కాదు, పూజలో వాడిన పూలకు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. పూజలో ఉపయోగించిన పూలను అవి వాడిపోయిన తర్వాత తెల్లవారి వాటిని నైమర్యల్యం అంటారు. కొత్త పూలను అలంకరించే ముందు పాత పూలను తీసి పారేయ్య కూడదు. వాటిని అన్నింటిని జమ చేసి ఏదైనా ప్రవహిస్తున్న నీటిలో వెయ్యాలి. లేదంటే భూమిలో పాతి పెట్టవచ్చు.

  4. హిందూ ధర్మం ప్రకారం స్నానం చెయ్యకుండా ఏపని చెయ్యకూడదు. ఇక దైవ సేవ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఉదయం స్నానం చేసిన తర్వాతే ఏదైనా దేవుడి ప్రతిమను తాకాలి. స్నానం చెయ్యకుండా పూజగదిలోకి వెళ్లకూడదు. అలా చేస్తే లక్ష్మీ దేవి ఆ ఇంటి నుంచి వెళ్లి పోతుంది.

  5. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లోని ఈశాన్య మూల చాలా పవిత్రమైంది. నకారాత్మక శక్తులు కూడా ఈ దిశ నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందుకని ఈ దిశను శుభ్రంగా గంగా జలంతో శుద్ది చేసి ఉంచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల నకారాత్మక శక్తి తగ్గి , సకారాత్మక వెలుగు ఇల్లంతా ప్రసరిస్తుంది. 


Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!