Horoscope Today 3rd October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి
అనవసరమైన విషయాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ నిర్ణయాలపై చాలా శ్రద్ధ వహించండి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు నిపుణుల మార్గదర్శకత్వం తీసుకోండి. మీ స్నేహితుల సహకారంతో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మీరు ఇష్టపడే వ్యక్తి ఆరోగ్యం అకస్మాత్తుగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.


వృషభం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వివాదాలకు దారితీస్తుంది. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. మీకు ఎవరెవరితోనో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. 


మిధునరాశి
ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనికి కట్టుబడి ఉంటారు. వివాహితుల జీవితంలో ఈ రోజు మంచిరోజు అవుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి సంబంధంలో కూడా సామరస్యాన్ని అనుభవిస్తారు. స్థిరాస్తి వ్యాపారంలో లాభాలు ఉండవచ్చు.


కర్కాటక రాశి
ఈ రోజు ఏ పనిని వాయిదా వేయకండి. ఉద్యోగం లేదా వ్యాపారం లక్ష్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఏకాగ్రతతో పనిని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. కొత్త వారిని కలిసే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పనిని ప్రణాళికను కొంతమంది కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు


Also Read: అష్టదరిద్రాల తీర్చే మహాగౌరి, దుర్గాష్టమి రోజు నవదుర్గల్లో ఎనిమిదవది మహాగౌరి


సింహరాశి
ఈ రోజు మీలో కొందరికి చాలా వివాదాస్పదమైన రోజు అవుతుంది. మీరు మీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి గురవుతారు. మీ బలహీనతలను ఉపయోగించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు.


కన్యా రాశి
ఈ రోజు మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. స్నేహితులు , సోదరుల సహకారంతో మీ పని పూర్తి అయ్యే అవకాశం ఉంది.ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలనుకున్న ప్లేస్ కి వెళ్లలేరు..ఈ కారణంగా కొంత నిరాశగా ఉంటారు.


తులారాశి
ఈ రోజు మీకు ఫలవంతమైన రోజు. మనస్సు ఏదో ఒక విషయంలో చంచలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ మనసులో ఉన్నమాట పంచుకుంటారు. ఆర్థిక పరిస్థి బాగానే ఉంటుంది..ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. 


వృశ్చిక రాశి
చాలా పనులు సులభంగా పూర్తి చేస్తారు. మీ తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. పనిలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ ఉన్న పనులు పూర్తిచేయడంతో జీవిత భాగస్వామి నుంచి సహకారం అందుతుంది. గృహ సమస్యలు పరిష్కారమవుతాయి. మాటతీరు మార్చుకోండి.


ధనుస్సు రాశి
నిరుద్యోగులకు మంచి సమయం. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను అమలు చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోండి. ఇతరులను విశ్వసించండి. జీవిత భాగస్వామితో  విడిపోయిన తర్వాత కూడా మీ నమ్మకాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు


Also Read: ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి పర్వదినం


మకరరాశి
రాజకీయ నాయకులకు మంచి సమయం. నెరవేరని కోరికలను నెరవేర్చుకోవడానికి మీరు కష్టపడతారు. కొత్త ప్రాజెక్టులు డైనమిక్‌గా ఉంటాయి. మీ ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారుల నుంచి మద్దతు ఉంటుంది. ఈ రోజు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే..ఏ పని చేసినా పూర్తి అవగాహనతో చేయాలి లేదంటే ప్రతికూలత ఎదుర్కోక తప్పదు.


కుంభ రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో గందరగోళ వాతావరణం ఉండొచ్చు ...జాగ్రత్తగా ఉండండి. వివాహితులైన వారి గృహ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు పని విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.


మీనరాశి
భాగస్వామ్య పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులు, సోదరుల సహకారం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీరు ఈరోజు పనిలో బిజీగా ఉంటారు. బాధ్యతలు పెరుగుతాయి. మానసికంగా చురుకుగా ఉంటారు. రోజువారీ పనిని మార్చడానికి ప్రయత్నాలు చేయవచ్చు.