అక్టోబర్ 31 రాశి ఫలాలు; ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నయో ఒకసారి చూద్దాం
మేష రాశి
కుటుంబ స్థితి గతుల గురించి చర్చిస్తారు. ఇవ్వాళ మీ అమ్మగారి కోసం సమయం కేటాయిస్తారు. అందువల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పనులు సానుకూలంగా సాగుతాయి. ఆఫీసు పని మీద బయటికి వెళ్లాల్సిందనే ఆదేశాలు అందుకోవచ్చు. అందువల్ల ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు.
వృషభ రాశి
ఏదో పెద్ద విషయం గురించిన నిర్ణయం తీసుకోవడమో లేదా ఏదైనా ముఖ్యమైన విషయంలో రాజిపడడం కోసమో సిద్దంగా ఉండాలి. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. మీ ప్రియతములతో సమయం గడుపుతారు.
మిథున రాశి
ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో ఉంటారు. విశ్రాంతి గా గడుపుతారు. ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్న వారు దీనికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ భాగస్వామిని అర్థం చేసుకునే అవకాశం ఈ రోజు మీకు లభిస్తుంది. కుటుంబ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటారు.
కర్కాటక రాశి
ధన లాభం ఉంటుంది. అపరిచితులతో వాగ్వాదం వద్దు. డబ్బు లావాదేవీలకు సంబందించిన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. అసలు డబ్బు లావాదేవీలు చెయ్యకపోతే మంచిది. ఏకాగ్రతతో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. మీ లక్ష్యసాధనలో ఏర్పడే అడ్డంకులను గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి.
సింహ రాశి
ఈ రోజు మీకు ఎత్తు పల్లాల్లో గడుస్తుంది. చాలా పనులు మిమ్మల్ని ఆకర్శిస్తాయి. హాడావిడిగా రోజు గడిచిపోతుంది. విశ్రాంతి దొరకదు. ఆరోగ్యం మీద దుష్ప్రభావం ఉండొచ్చు. వివాహితుల కుటుంబ జీవితం బావుంటుంది.
కన్యారాశి
మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. రోజు పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రాశి విద్యార్థులకు బావుంటుంది. చదువు మీద శ్రద్ధ నిలుపుతారు. తరగతిలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇవ్వాళ శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు.
తులారాశి
ఆత్మవిశ్వాసంతో ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. మీరు కూడా ఈ విషయాన్ని నమ్మండి మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ రోజు మీరు సాధించిన దాని తో మీకు చాలా ఉత్సాహంగా గడుస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు సంతోషంగా గడుస్తుంది. మీ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మంచి వార్తలు వింటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లిదండ్రులతో వాగ్వాదం రావచ్చు. దీని నుంచి తప్పించుకోవాలంటే మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
ధనస్సు రాశి
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం కాదు. కాబట్టి పాత ప్రయత్నాలను కొనసాగించే పనిలో ఉండండి. చట్ట సంబంధ పనులకు దూరంగా ఉండాలి. చిన్న తప్పు జరిగినా మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఈరోజు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.
మకర రాశి
ఈరోజు సామాన్యంగా గడుస్తుంది. మనోబలంతో పనులు ముందుకు నడిపిస్తే మంచిది. వ్యాపారంలో మార్పులు రావచ్చు. ఆఫీసులో మీ వ్యూహాలు ఇదివర కంటే బావుంటాయి. వీరికి ఈరోజు బావుందనే చెప్పవచ్చు.
కుంభ రాశి
ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వారి సహాయంతో మీరు పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆఫీసులో వివాదాల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
మీన రాశి
ఇవ్వాళ మీరు ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. తల్లిదండ్రులతో కలిసి ఏదైనా దేవాలయ సందర్శనకు వెళ్లవచ్చు. అందువల్ల మీకు లాభం చేకూరవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.