Horoscope Today (జూన్ 29 రాశిఫలాలు)


మేషరాశి
ఈ రాశివారికి ఈ రోజు ప్రభావవంతమైన వ్యక్తుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను దృష్టిలోపెట్టుకోండి . ప్రియమైన వారి ప్రేమలో మునిగి తేలుతారు. ఎదుటి వారు మీ బలహీనతని ఆసరాగా తీసుకుని మీతో పనులు చేయించుకుంటారు. వివాహితులు సంతోషంగా ఉంటారు.


వృషభ రాశి
ఈ రాశి వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్టాక్ మార్కెట్, మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఇది మంచి రోజు.  కెరియర్ పరంగా పుంజు కుంటారు. మీరు పనిచేసే  రంగంలో  విజయాన్ని  పొందే అవకాశం ఉంది. ఎటువంటి కారణం లేకుండా కొంతమంది వల్ల ఇబ్బందుల్లో పడవచ్చు. మీ విలువైన సమయం  వృధా అవుతుంది. వైవాహిక జీవితాన్ని అద్భుతంగా మలచుకుంటారు. 


మిథున రాశి
పని ఒత్తిడి మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. పరిస్థితిలను  అదుపులో ఉంచుకోవడానికి మీ సోదరుడి సహాయం తీసుకోండి. వివాదాలను  స్నేహపూర్వకంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ప్రేమికులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. సహోద్యుగులతో  అవగాహన తో, సహనంతో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, తద్వారా మీరు జీవితంలో తర్వాత చింతించాల్సిన అవసరం లేదు. మీ జీవిత భాగస్వామి తో వివాదాలు. 


కర్కాటక రాశి
ఈ రోజు నుంచి  డబ్బు ఆదా చేయడంపై దృష్టి సారించండి. సన్నిహిత  వ్యక్తులకు మీ అభిప్రాయాన్ని వివరించడానికి చాలా కష్ట పడతారు. మీరు చేసిన తప్పును అంగీకరించడం  వల్ల మీకే మంచి జరుగుతుంది. మీ వల్ల నష్టపోయిన వారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మూర్ఖులు మాత్రమే తప్పులను  పునరావృతం చేస్తారు. ఈ రోజు అత్యుత్తమ రోజులలో ఒకటి కావచ్చు. 


Also Read: తొలిఏకాదశి (జూన్ 29) శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


సింహరాశి 
ఈ రాశివారి ఆర్థిక జీవితం అధ్వాన్నంగా ఉంటుంది. అనవసర అనుమానాల వల్ల సంబంధాలు చెడిపోతాయి. సన్నిహితులను అనుమానించవద్దు. మీకు ఏదైనా సందేహం ఉంటే వారితో కూర్చుని పరిష్కారానికి ప్రయత్నించండి. పనిలో వచ్చే మార్పుల వల్ల మీరు లాభాలను పొందుతారు.  మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.


కన్యా రాశి
మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో అనవసర వాగ్వాదానికి దిగకండి. పాత జ్ఞాపకాలు ఈరోజు మిమ్మల్ని శాసిస్తాయి. అనుకున్న పనులు సాదించటానికి ఈరోజు అనుకూలమైన రోజు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. సోమరితనం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు, ఏ పని లేకపోవడం వల్ల, మీరు నిరాశకు గురవుతారు. జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు.


తులారాశి
నూతన పెట్టుబడులకు ఈరోజు మంచి రోజు. ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు. మీరు  స్నేహితులతో బయటకు వెళ్లే అవకాశముంది. ప్రయాణాల వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి కానీ కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు సద్దుమణుగుతాయి. జీవిత భాగస్వామి తో అన్యోనంగా గడుపుతారు. 


వృశ్చిక రాశి
విందు, వినోదాల్లో సంతోషంగా గడుపుతారు.  మీ మనస్సులో త్వరగా డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక ఉంటుంది. ఇంట్లో శాంతి వాతావరణం ఉండేలా సామరస్యంగా పని చేయండి. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారికి సమయం కేటాయించండి.  పనిలో వస్తున్న మార్పుల వల్ల మీరు లాభాలను పొందుతారు.అనవసర ఖర్చు చేయాల్సి వస్తుంది. ఖర్చులను నియంత్రించండి. జీవిత భాగస్వామితో  వివాదాలు తలెత్తిన తొందరగానే సద్దు మణిగి ఆనందంగా గడుపుతారు. 


ధనుస్సు రాశి
కొంత మంది వలన  మీ మానసిక స్థితి గందరగోళానికి గురవుతుంది. అనవసరమైన ఆందోళనలు, ఇబ్బందులు మీ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఆర్థికంగా బలపడాలనుకుంటే, ఈ రోజు నుంచే డబ్బు ఆదా చేయడం ప్రారంభించండి. కొన్ని ముఖ్యమైన పనుల కోసం నూతన ప్రణాళికలు వేసుకోండి. మీ ప్రమేయం లేకపోయినా మీకు సంభందించిన  పనులు సజావుగా సాగుతాయి.  కొన్ని కారణాల వల్ల ఏదైనా సమస్య తలెత్తినప్పటికీ మీరు దానిని సులభంగా పరిష్కరిస్తారు. 


మకరరాశి
ఈ రోజు, సన్నిహితులు మీ నుంచి ఆర్థిక సహాయం కోసం అడగవచ్చు. వారికి సహాయం చేయడం ద్వారా  ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబ ఉద్రిక్తతలు మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి. చెడు సావాసాలు వలన ఇబ్బంది పడతారు. బాధతో సమయాన్ని వృధా చేసుకోవడం కంటే జీవితంలో ఎదురైన  అనుభవాల నుంచి  గుణపాఠం నేర్చుకోవడం ఉత్తమం. 


Also Read: తొలి ఏకాదశి(జూన్ 29 ) ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!


కుంభ రాశి
ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ప్రమోషన్‌కు  అవకాశం ఉంది. మీ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి  సహోద్యోగులతో సన్నిహితంగా మెలగండి. ఈ రోజు మీరు ఒంటరిగా గడపడానికి  బయటకు వెళ్తారు కానీ ప్రశాంతంగా ఉండరు. మానసిక ప్రశాంతత ఉండదు. 


మీనరాశి
ఈరోజు మీరు ఆశించిన విధంగా రాబడి ఉండదు. ఈ రోజు ప్రతి ఒక్కరూ మీతో స్నేహంగా మెలుగుతారు. ఉద్యోగులు సంబంధించిన మంచి వార్తను వింటారు. ఈ రోజు ముఖ్యమైన పనులను పూర్తి చేసి మీ కోసం  సమయాన్ని వినియోగిస్తారు. జీవిత భాగస్వామితో సన్నిహితంగా మెలుగుతారు.