By: RAMA | Updated at : 03 Feb 2023 05:34 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Freepik
Horoscope Today 03rd February 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం
మేష రాశి
ఈ రాశి వ్యాపారులు కొత్త ప్రణాళికలు రచిస్తారు. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలేన ఆలోచనలో ఉంటారు. ఉద్యోగులు పురోభివృద్ధి చెందుతారు. సీనియర్ల నుంచి మీకు పూర్తి సహకారం ఉంటుంది. మీ ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేయడానికి సహాయపడుతుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీపనిని మీరు సక్రమంగా పూర్తిచేస్తారు. ఆస్తులు కొనుగోలు చేయాలనే ప్రణాళికను ఈ రోజు వాయిదా వేసుకోవడం మంచిది. బయటకు వెళ్లాలి అనుకుంటే డబ్బుపరంగా జాగ్రత్తలు అవసరం.
మిథున రాశి
ఈ రాశి వ్యాపారులు అజాగ్రత్తగా ఉండకండి. ప్రేమ జీవితం గడిపేవారికి ఈ రోజు మంచి రోజు. మీ వ్యక్తిగత పనుల కారణంగా, మీరు మీ పనిపై కొంచెం తక్కువ శ్రద్ధ చూపుతారు. సంభాషణలో సున్నితంగా ఉండండి. కొత్త పథకాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం.
Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!
కర్కాటక రాశి
ఆర్థికంగా మీకు కలిసొచ్చే సమయం ఇది. వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు వారు పనిచేసే రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటారు. మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
సింహ రాశి
ఈ రోజు సాధారణమైన రోజు . అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ మీరు విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఇంకొంతకాలం ఎదురుచూడక తప్పదు. కెరీర్ సంబంధిత సవాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
కన్యా రాశి
వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఉండేవారు లాభపడతారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన రోజు. మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఒక ఈవెంట్ కు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. మీ నిజాయితీ మీ గౌరవాన్ని పెంచుతుంది.
తులా రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త భాగస్వామ్యం లేదా కొత్త వెంచర్లోకి ప్రవేశించడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీరు వేసుకునే ప్రణాళికలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీ పనిపై ఎక్కువ దృష్టి పెడతారు..అదనపు సమయం కష్టపడతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీ ఉల్లాసమైన స్వభావం మీకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల అభిప్రాయాలు విని వాటిని అంగీకరిస్తే మంచిది. మీరు వాహనం కొనాలని ఆలోచిస్తుంటే, ఈ రోజు శుభదినం. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి రోజు.
ధనుస్సు రాశి
ఈ రోజు గృహోపకరణాలు కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. ఉద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అపరిచితుడి వల్ల మీ మానసిక స్థితి కొంచెం పాడవుతుంది.
Also Read: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్
మీరు ప్రతిష్టాత్మకమైన వ్యాపారంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉన్నత చదువులు, ఉద్యోగం లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే, మీరు మీ స్వంత ప్రయత్నాలతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఉన్నవారు స్నేహతుల నుంచి సహాయం తీసుకుంటారు
కుంభ రాశి
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు. అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సైన్సుతో సంబంధం ఉన్న పిల్లలకు మంచి జాబ్ ఆఫర్ లభిస్తుంది.
మీన రాశి
ఈ రోజు మీ ప్రయత్నాలు లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయవంతమవుతాయి. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. మీరు ఏ రంగంలో ప్రయత్నించినా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంటా బయటా మీ బాధ్యతలు పెరుగుతాయి.వ్యాపార సంబంధ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం
జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!
Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!
Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !