అన్వేషించండి

అక్టోబర్ 7 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

Daily Horoscope in Telugu: 2025 అక్టోబర్ 07న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025 అక్టోబర్ 07 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 7 October 2025

మేష రాశి

ఈ రోజు మీ సృజనాత్మకత స్నేహితులను మీ వైపుకు ఆకర్షిస్తుంది. వజ్రాలు, బొగ్గు, సున్నం రంగాల్లో వ్యాపారులకు లాభాలొస్తాయి. జీవితాన్ని  సాధారణంగా ఉంచుకోవడం మీకు మంచిది. అకస్మాత్తుగా వచ్చిన బాధ్యత మీ దినచర్యను దెబ్బతీస్తుంది. మీరు ఇతరుల కోసం ఎక్కువ మరియు మీ కోసం తక్కువ సమయం కేటాయిస్తున్నారని గుర్తించండి
 
శుభ సంఖ్య: 9
రంగు: ఎరుపు
పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి.

వృషభ రాశి

అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు వ్యాపారంలో లాభం చేకూర్చే వ్యక్తిని కలుసుకుంటారు. మీ సృజనాత్మకతతో అందర్నీ ఆకట్టుకుంటారు.

శుభ సంఖ్య: 6
రంగు: తెలుపు
పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.

మిథున రాశి

మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞులైన వారి అభిప్రాయాన్ని తీసుకోండి. గృహ వ్యవహారాలను వెంటనే పరిష్కరించండి, నిర్లక్ష్యం ఖరీదు భారీగా ఉంటుంది. భాగస్వామ్యంలో విజయం సాధిస్తారు.. కానీ ఆలోచించి అడుగు వేయండి.

శుభ సంఖ్య: 5
రంగు: ఆకుపచ్చ
పరిహారం: అవసరమైన వారికి ఆకుకూరలు దానం చేయండి.

కర్కాటక రాశి

ఈ రోజు మీకు నిజమైన ప్రేమ లభిస్తుంది. కుటుంబ సహాయం తీసుకోవలసి రావచ్చు. ఉద్యోగస్తులకు బయటి అవకాశాలు లభిస్తాయి. మీ కీర్తి పెరుగుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. గాయపడే అవకాశం ఉంది..వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త
 
శుభ సంఖ్య: 2
రంగు: తెలుపు
పరిహారం: దుర్గామాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి.

సింహ రాశి

మీరు కష్టపడి పనిచేయడం ద్వారా కుటుంబం ఆశలు నెరవేరుస్తారు. వ్యాపారంలో కొత్త ప్రారంభం చేయవచ్చు. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. మీడియా , సృజనాత్మక రంగాల వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది.

శుభ సంఖ్య: 1
రంగు: బంగారు
పరిహారం: చేపలకు ఆహారం వేయండి
 
కన్యా రాశి

ఈ రోజు మీరు ఖాళీ సమయాన్ని ఆనందిస్తారు. లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. తల్లి ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెడుతుంది. కార్యాలయంలో వాతావరణం కష్టంగా ఉండవచ్చు. పుకార్లను నమ్మవద్దు.

శుభ సంఖ్య: 3
రంగు: ఆకుపచ్చ
పరిహారం: గణేశునికి దూర్వా సమర్పించండి.

తులా రాశి

ఈ రోజు మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందుతారు. పని చేసే ప్రదేశంలో అనవసర వాగ్ధానాలు చేయొద్దు.  పెద్దల ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి.

శుభ సంఖ్య: 6
రంగు: నీలం
పరిహారం: వృద్ధులకు సేవ చేయండి.

వృశ్చిక రాశి

ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో సహోద్యోగితో వాగ్వాదం పెట్టుకుంటారు. తల్లిదండ్రులకు నమస్కరించి ఇంటి నుంచి బయలుదేరండి.

శుభ సంఖ్య: 9
రంగు: ముదురు ఎరుపు
పరిహారం: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

ధనుస్సు రాశి

మంచి డబ్బు సంపాదిస్తారు కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధువులు , స్నేహితుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి.  కొత్త ఆలోచనలు లాభం చేకూరుస్తాయి. ప్రతికూల ఆలోచనల వల్ల నష్టం జరగవచ్చు.

శుభ సంఖ్య: 3
రంగు: పసుపు
పరిహారం: విష్ణువుకు అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించండి
 
మకర రాశి

విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడాలి. ఉద్యోగం చేసేవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా ధన వ్యయం పెరగుతుంది. సహోద్యోగులతో విభేదాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది.

శుభ సంఖ్య: 8
రంగు: నలుపు
పరిహారం: శని దేవునికి ఆవాల నూనె సమర్పించండి.

కుంభ రాశి

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. పేదలకు వస్త్రాలు దానం చేయండి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి.

శుభ సంఖ్య:4
రంగు: నీలం
పరిహారం: శివలింగానికి అభిషేకం చేయండి
 
మీన రాశి

చట్టపరమైన సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. సహోద్యోగులు మీ పని శైలితో అసంతృప్తి చెందవచ్చు. కొత్త ఆలోచనల వల్ల లాభం ఉంటుంది.

శుభ సంఖ్య: 7
రంగు: లేత నీలం
పరిహారం: తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills byelection arrangements: జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
AP Cabinet decisions: ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Mahindra XEV 9e or Tata Harrier EV: మహీంద్రా XEV 9e లేదా టాటా హారియర్ EVలలో భారతదేశపు అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ SUV ఏది?
మహీంద్రా XEV 9e లేదా టాటా హారియర్ EVలలో భారతదేశపు అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ SUV ఏది?
Another storm AP: ఏపీని పలకరించబోతున్న మరో తుఫాన్ - 20వ తేదీన అల్పడీనం - తుఫాన్‌గా మారే చాన్స్
ఏపీని పలకరించబోతున్న మరో తుఫాన్ - 20వ తేదీన అల్పడీనం - తుఫాన్‌గా మారే చాన్స్
Advertisement

వీడియోలు

IPL Trade Deal CSK, RR | ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
Akash Choudhary Half Century | 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్ చౌదరి
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా?  డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్‌లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Narmada Human: భారతదేశ చరిత్రని మార్చిన ఆ పుర్రె ఎవరిది?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills byelection arrangements: జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు -మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ !
AP Cabinet decisions: ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌స్టేషన్స్‌ - విశాఖలో రోడ్ల విస్తరణ - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Mahindra XEV 9e or Tata Harrier EV: మహీంద్రా XEV 9e లేదా టాటా హారియర్ EVలలో భారతదేశపు అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ SUV ఏది?
మహీంద్రా XEV 9e లేదా టాటా హారియర్ EVలలో భారతదేశపు అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ SUV ఏది?
Another storm AP: ఏపీని పలకరించబోతున్న మరో తుఫాన్ - 20వ తేదీన అల్పడీనం - తుఫాన్‌గా మారే చాన్స్
ఏపీని పలకరించబోతున్న మరో తుఫాన్ - 20వ తేదీన అల్పడీనం - తుఫాన్‌గా మారే చాన్స్
Andhra Cabinet: ఆ 48 మంది ఎమ్మెల్యేల బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ
ఆ 48 మంది ఎమ్మెల్యేల బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ
పాతబస్తీలో హిందూ మైనర్‌ బాలికలను ట్రాప్ చేస్తున్నారు…. మజ్లిస్ సపోర్ట్ చేస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
పాతబస్తీలో హిందూ మైనర్‌ బాలికలను ట్రాప్ చేస్తున్నారు…. మజ్లిస్ సపోర్ట్ చేస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
Railway Job Recruitment Process:రైల్వేలో ఉద్యోగాల భర్తీ ఎలా జరుగుతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి!
రైల్వేలో ఉద్యోగాల భర్తీ ఎలా జరుగుతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి!
Ravi Teja : భర్తలకు మాస్ మహారాజ రవితేజ రిక్వెస్ట్ - 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేసింది
భర్తలకు మాస్ మహారాజ రవితేజ రిక్వెస్ట్ - 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేసింది
Embed widget