Jupiter  Retrograde 2025: జ్యోతిష్య శాస్త్రంలో గురువును శుభ,  గొప్ప గ్రహంగా భావిస్తారు. గురువు ఎప్పుడైనా రాశిని మార్చినప్పుడు లేదా తిరోగమనం చెందినప్పుడు ఈ ప్రభావం  అన్ని రాశులపై  ఉంటుంది. ఈ సంవత్సరం దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్  ఆఖర్లో మిథునం నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించాడు. నవంబర్ 11 రాత్రి కర్కాటకంలో తిరోగమనం చెందుతున్నాడు. డిసెంబర్ 05 వరకు కర్కాటక రాశిలో ఇదే స్థితిలో సంచరిస్తాడు.  

Continues below advertisement

గురువు "అతిచారి గమనం" అంటే గ్రహం సాధారణ వేగం కంటే చాలా వేగంగా కదలడం. సాధారణంగా, గురువు ఒక రాశిలో 12-13 నెలల వరకు ఉంటాడు, కానీ అతిచారి అయినప్పుడు త్వరగా రాశిని మారుస్తాడు. ఈ గమనం ప్రత్యక్ష ప్రభావం కెరీర్, విద్య, వైవాహిక జీవితం, ధనం, అదృష్టంపై పడుతుంది. అతిచారి గురువు యొక్క ప్రభావాలు త్వరగా కనిపిస్తాయి.

2025 సంవత్సరంలో గురువు 3 సార్లు గమనాన్ని మార్చుకుంటాడు

Continues below advertisement

2025 సంవత్సరంలో బృహస్పతి మూడు సార్లు గమనాన్ని మార్చుకుంటాడు-

మే 14, 2025 న అతిచారి గమనంతో మిథున రాశిలోకి ప్రవేశం,నవంబర్ 11, 2025 న వక్రీ గమనంతో కర్కాటక రాశిలోకి ప్రవేశం,డిసెంబర్ 5, 2025 న వక్రీ స్థితిలో తిరిగి మిథున రాశిలోకి ప్రవేశం.

ఈ సంవత్సరం గురువు గమనంలో ఈ తీవ్రమైన మార్పు అనేక రాశులకు అదృష్టం,  కొత్త అవకాశాలను తెస్తుంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, తుల, కుంభం , మీన రాశి వారికి ప్రయోజనకరమైన ఫలితాలున్నాయి

బృహస్పతి  ప్రాముఖ్యత

బృహస్పతిని దేవగురువు, జ్ఞానం ,  ధర్మ స్థాపకుడు అని పిలుస్తారు. ఇది కెరీర్, విద్య, సంతానం, ధనం, వైవాహిక జీవితం,  అదృష్టం కారక గ్రహం.బృహస్పతి సాధారణంగా మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు , మీన లగ్నం వారికి శుభ ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు.  వృషభం, మిథునం, కన్య, తుల, మకరం,  కుంభ లగ్నం వారికి ఇది తక్కువ ప్రభావవంతమైన గ్రహం.

ఏదైనా గ్రహం వక్రీ అవ్వడం అంటే దిశను మార్చుకుని వెనుకకు తిరగడం. ఇది ఆత్మపరిశీలన .. లోతుగా ఆలోచించే సమయం. గురువు వక్రీ అవ్వడం అంటే భావాలు   జీవిత దిశలో మార్పు వస్తుందని సూచిస్తుంది.  గురువు తిరగోమనం సమయంలో ఆ ప్రభావం దేశంపై ఎలా ఉంటుందంటే.. షేర్ మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి.విద్య ,  సామాజిక సంస్కరణలకు సంబంధించిన పనుల్లో వేగం పెరుగుతుంది.రాజకీయాల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది.భారీ వర్షాలు, భూకంపాలు, తుఫానులు, కొండచరియలు విరిగిపడటం వంటి సహజ సంఘటనలు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్య సంక్షోభాలు ,  ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.ఉద్యోగాలు , ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి.

గురువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ చర్యలు తీసుకోండి 

ప్రతిరోజూ “ఓం భగవతే వాసుదేవాయ నమః” మంత్రాన్ని ఒక మాల జపించండి.

గురువారం నాడు పసుపు రంగు దుస్తులు, పప్పులు, పసుపు, శనగపిండి లడ్డూలను దానం చేయండి.

అరటి చెట్టుకు నీరు సమర్పించండి.

క్రమం తప్పకుండా రామ రక్షా స్తోత్రం, మృత్యుంజయ మంత్రం పఠించండి.

హనుమంతునికి తమలపాకులు సమర్పించండి.

విష్ణువును,  దుర్గాదేవిని ఆరాధించండి.

12 రాశులపై గురు వక్రీ ప్రభావం

మేష రాశి: మతపరమైన  శుభ కార్యాలలో ధనం ఖర్చు అవుతుంది. వివాహానికి బలమైన అవకాశాలు ఏర్పడతాయి.

వృషభ రాశి: ఆర్థిక లాభం ,వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు. కొత్త పథకాలతో లాభం ఉంటుంది.

మిథున రాశి: ఉద్యోగం ,పదోన్నతికి అవకాశాలు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కర్కాటక రాశి: శుభ సమయం, పెద్దల అనుగ్రహంతో అదృష్టం కలిసొస్తుంది.

సింహ రాశి: విద్య , పరిశోధనలో విజయం, ఆదాయం - వ్యయం మధ్య సమతుల్యత ఉంటుంది.

కన్యా రాశి: వివాహం ,  కుటుంబ శుభ కార్యాలకు అవకాశాలు. వ్యాపారంలో అభివృద్ధి.

తులా రాశి: వ్యాధులు, అప్పులు , శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

వృశ్చిక రాశి: సంతానం ,  స్నేహితుల సహకారం లభిస్తుంది. విజయానికి అవకాశాలు.

ధనుస్సు రాశి: ఇల్లు, వాహనాలకు సంబంధించిన పనుల్లో విజయం, సామాజిక గౌరవం పెరుగుతుంది.

మకర రాశి: అనవసరమైన పనులకు దూరంగా ఉండండి. మతపరమైన కార్యకలాపాలలో ఆసక్తి.

కుంభ రాశి: ధన యోగం బలంగా ఉంటుంది, కొత్త ఆర్థిక పథకాలు రూపొందుతాయి.

మీన రాశి: గౌరవం  పెరుగుతుంది. శుభ కార్యాలు జరుగుతాయి. 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.