Past Life: భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు మన వ్యక్తిత్వం, అదృష్టం, భవిష్యత్ ను సూచిస్తాయి. కుడివైపు ఉండే పుట్టుమచ్చలు పురుషులకు, ఎడమవైపు ఉండే పుట్టుమచ్చలు స్త్రీలకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. నుదురు, చెంపలు, ఛాతి మధ్యలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం గౌరవం అని చెబుతారు. అయితే ఈ పుట్టుమచ్చలన్నీ గత జన్మతో ముడిపడి ఉంటాయంటారు సాముద్రిశాస్త్ర నిపుణులు
జన్యుశాస్త్రానికి (genetics) అతీతంగా, కొన్ని ప్రత్యేక గుర్తులు గత జన్మ జ్ఞాపకాలను సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు. ఇవి మన భయాలు, ప్రవర్తనా సరళి , భావోద్వేగ ప్రతిస్పందనలను చూపుతాయి. పుట్టిన తేదీకి సంబంధించిన కర్మ జ్యోతిష్యం , పూర్వ జన్మల సరళిని అధ్యయనం చేసే జ్యోతిష్కులు, పుట్టుమచ్చ స్థానం ఆధారంగా కూడా గత జన్మలో ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారో చెప్పొచ్చంటారు. ఇవి ప్రజల్ని భయపెట్టడం కోసం కాదు..ఆత్మజ్ఞానం, స్వస్థత కోసం ఉపయోగపడతాయంటున్నారు. పుట్టుమచ్చలు ఉన్న ప్రదేశం ఆధారంగా గత జన్మలో మీరు ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నారో ఇక్కడుంది...
ముఖంపైముఖంపై పుట్టుమచ్చ కనిపిస్తే అది భయానికి సంకేతం కాదు. అలాంటి వ్యక్తులు గత జన్మలో హింస, ఎగతాళి లేదా తిరస్కరణను ఎదుర్కొని ఉండవచ్చని నమ్ముతారు.
మెడపై
మెడ లేదా గొంతుపై పుట్టుకతో వచ్చిన గుర్తు, స్వరం కోల్పోతామనే భయంతో ముడిపడి ఉంటుంది. గత జన్మలో ఈ వ్యక్తులను శారీరకంగా లేదా మానసికంగా అణచివేతకు గురైనవారు కావొచ్చు గుండెపై
ఛాతీ లేదా గుండెపై పుట్టుమచ్చ ఉండటం, భావోద్వేగ బలహీనత , భయం గుండె దగ్గర ఉన్న గుర్తుతో ముడిపడి ఉంటుందని సూచిస్తుంది. గత జన్మలో ద్రోహం, ఒత్తిడితో కూడిన సంబంధాలు లేదా దుఃఖానికి కారణం కావచ్చు.
పొట్టపై
కడుపు లేదా బొడ్డు చుట్టూ పుట్టుమచ్చ ఉండటం, గత జన్మలో మీరు జీవనోపాధి సమస్యలు, త్యాగం లేదా ప్రియమైన వారిని కోల్పోయారని సూచిస్తుంది. ఈ జన్మలో నియంత్రణ, భద్రత, స్వాతంత్ర్యం గురించి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
వీపుపై
వీపు పైభాగంలో ఏర్పడిన గుర్తులు ద్రోహాన్ని సూచిస్తాయని నమ్ముతారు. గత జన్మలో మీరు శారీరకంగా లేదా మానసికంగా హింసిను ఎదుర్కొన్నారు
చేతులపై
వేళ్లు లేదా చేతులపై ఎక్కడైనా పుట్టుమచ్చ ఉండటం, తగినంత కృషి చేయలేదనే భయాన్ని కలిగిస్తుంది. కర్మల పరంగా, ఇది గత జన్మలోని ఏదో ఒక పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది.
కాళ్లపై
కాళ్లు లేదా పాదాలపై ఏదైనా గుర్తు, దిశ లేదా స్థిరత్వాన్ని కోల్పోతామనే ఆందోళనను సూచిస్తుంది. గత జన్మలో ఈ ఆత్మలు స్థానభ్రంశం, బహిష్కరణ లేదా బలవంతపు ప్రయాణాన్ని ఎదుర్కొని ఉండవచ్చని నమ్ముతారు.
నడుముపై
నడుము కింది భాగం లేదా వెన్నెముక దగ్గర పుట్టుమచ్చ, ఆధారపడటం లేదా దోపిడీకి గురవుతామనే భయాన్ని సూచిస్తుంది. గత జన్మ అనుభవాల ఆధారంగా, అధికారంలో అసమతుల్యత , ద్రోహాన్ని ఎదుర్కోని ఉండొచ్చు.
చెవిపై
చెవిపై పుట్టుమచ్చ ఉండటం అసాధారణ పరిస్థితులను సూచిస్తుంది. అలాంటి వ్యక్తులకు గత జన్మ నుంచే ఆధ్యాత్మిక అవగాహన ఎక్కువగా ఉంటుంది, కానీ వారు దానిని పూర్తిగా విశ్వసించడానికి వెనుకాడతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.