Expected Gold Rate in 2026 Baba Vanga Prediction:  బంగారం ధరలు రోజురోజుకి అంచనాలను మించి పెరుగుతున్నాయి. ఈ ధరలు వచ్చే ఏడాది ఎలా ఉండబోతున్నాయ్? బల్గేరియన్ భవిష్యత్ వక్త , అంధ మహిళ బాబా వాంగ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటాయ్. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు నుంచి AI వరకూ ఆమె ప్రతి విషయంపైనా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ సారి ఆమె చెప్పిన విషయం బంగారానికి సంబంధించినది. ఇటీవలి నెలల్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర దాదాపు లక్షా 30 వేలు ఉంది.  గత నెల అక్టోబర్ 17న బంగారం ధర 10 గ్రాములకు 1.33 లక్షల రూపాయలకు చేరుకుంది, ఇది అక్టోబర్లో అత్యధిక స్థాయి. బంగారం ఈ కొత్త ప్రమాణాలు పెట్టుబడిదారులు , వినియోగదారులలో  ఆందోళనను రేకెత్తించాయి. ఇప్పుడు 2026 సంవత్సరానికి సంబంధించి బాబా వాంగ చేసిన బంగారం గురించి చేసిన భవిష్యవాణిలు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతున్నాయి మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం , వాణిజ్యంలో హెచ్చుతగ్గులు బంగారం సురక్షితమైన పెట్టుబడిగా మారడానికి కారణమయ్యాయి. దీనికి రెండవ కారణం అమెరికన్ డాలర్ బలహీనపడటం , అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా కూడా బంగారం ప్రజల మొదటి ఎంపికగా మారుతోంది.

Continues below advertisement

బాబా వాంగ 2026 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక సంక్షోభం మరియు నగదు కొరత గురించి ఒక అంచనా వేశారు. ఇది నిజమైతే, సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం కావచ్చు, దీనివల్ల బంగారం ధరలు 10 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా భారతదేశంలో బంగారం ధర 1.62 లక్షల రూపాయల నుంచి 1.82 లక్షల రూపాయల వరకు 10 గ్రాములకు చేరుకోవచ్చు, ఇది ఇప్పటివరకు అత్యధిక స్థాయి అవుతుంది.

బాబా వాంగ  అంచనాలు బంగారం ధరల గురించి నేరుగా ఉన్నాయా? అంటే లేదనే చెప్పాలి. ఆమె చెప్పిన విషయాలు 2026 లో ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి, నగదు కొరత మరింత తీవ్రమవుతుందని సూచిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో, బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. బాబా వాంగ అంచనాలు నిజమైతే, నగదు సంక్షోభం బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది.. బంగారంలో పెట్టుబడి పెరుగుతుంది. తత్ఫలితంగా, బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1,50,000 నుంచి రూ. 2,00,000 వరకు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

Continues below advertisement

ఆర్థిక అస్థిరత సమయంలో బంగారం అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా చెప్పొచ్చు. అయితే బాబా వాంగ భవిష్యవాణిపై పూర్తిగా ఆధారపడటం  కూడా ప్రమాదకరమే అని చెప్పాలి.  భవిష్యవాణిల గురించి నిపుణులు ఏమంటున్నారంటే ఏ విధమైన పెట్టుబడికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ప్రపంచ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాలి. కేవలం భవిష్యవాణిని ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసకున్నా, నూతన పెట్టుబడులు పెట్టినా దానివల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

2025 నవంబర్ 02 క్షీరాబ్ధి ద్వాదశి! లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం సులువైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి