Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు వచ్చారు. డిసెంబర్ 04 సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్​ భారత్​ పర్యటన రాజకీయంగా ఎంతో కీలకం కానుంది, దీనిపై ప్రపంచమంతా దృష్టి సారించింది. ఈరోజు భారత్, రష్యా దేశాల మధ్య ఎలాంటి అంశాలపై ఒప్పందాలు కుదురుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Continues below advertisement

73 ఏళ్ల పుతిన్ తన రాజకీయాల్లో 'డెస్టినీ డ్రివెన్' నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. రాజకీయాలు, వ్యూహాలు, కఠినమైన నిర్ణయాలతో పాటు పుతిన్ తన హై-ప్రొఫైల్ లైఫ్​స్టైల్​తో కూడా చాలా చర్చల్లో నిలిచారు.

పుతిన్​ సామ్రాజ్యంలో 1.4 బిలియన్ డాలర్ల భారీ కోట, 716 మిలియన్ డాలర్ల విమానం, 100 మిలియన్ డాలర్ల పెద్ద పడవ, 700 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు, 60 వేల డాలర్లతో సహా ఒకటి కంటే ఎక్కువ ఖరీదైన గడియారాలు ఉన్నాయి.

Continues below advertisement

పుతిన్ తన వృత్తిని నేరుగా రాజకీయ నాయకుడిగా ప్రారంభించలేదు. లా చదివిన తర్వాత పుతిన్​ను కేజీబీ (కమిటీ ఫర్ స్టేట్ సెక్యూరిటీ)లో నియమించారు. ఇక్కడ స్పెషల్ ఏజెంట్​గా శిక్షణ పొందిన తర్వాత విదేశీ ఇంటెలిజెన్స్ మిషన్​కు పంపించారు. ఆ తర్వాత 6 సంవత్సరాల పాటు తూర్పు జర్మనీలోని డ్రెస్డెన్​లో రహస్యంగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది, అదే ఆయన బలంగా మారింది.

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుతిన్​ విధి

సంఖ్యాశాస్త్రవేత్త అనీష్ వ్యాస్ ప్రకారం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు రాజకీయాలకు మాత్రమే కాదు, ఒక ప్రత్యేక శక్తి, విధికి సంకేతం. అతని పేరులోని ఆంగ్ల అక్షరం VLADIMIR PUTIN, దీని ఆధారంగా 8 సంఖ్య వస్తుంది, ఇది శని ప్రభావాన్ని సూచిస్తుంది. శని క్రమశిక్షణ, నియంత్రణ, వ్యూహం, కఠినమైన నిర్ణయాలకు కారకుడు. పుతిన్ నాయకత్వ శైలిలో ఇదే శక్తి ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

పుతిన్ అక్టోబర్ 7, 1952న జన్మించారు. ఈ ప్రకారం  పుట్టిన సంఖ్య 7, ఇది కేతు సంఖ్యగా పరిగణిస్తారు. అందుకే పుతిన్ రహస్యమైన, వ్యూహాత్మకమైన, లోతైన ఆలోచనలు కలిగిన నాయకుడిగా కూడా పరిగణిస్తారు. పుట్టిన సంఖ్య 7, సంఖ్య 8 కలయిక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, సహనంతో, కష్టతరమైన పరిస్థితుల్లో స్థిరంగా ఉండటానికి, దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది.

పుతిన్​ ను ఎందుకు రాజకీయాల్లో 'డెస్టినీ డ్రివెన్' నాయకుడిగా పరిగణిస్తారు

రష్యా అధ్యక్షుడు పుతిన్​ను డెస్టినీ డ్రివెన్ నాయకుడిగా నిర్వచించడమంటే, ఆయన నిర్ణయాలు కేవలం ప్రస్తుత పరిస్థితులు లేదా కోరికల ఆధారంగా కాకుండా, విధిని నెరవేర్చాలనే భావనతో తీసుకుంటారని అర్థం.

న్యూమరాలజీ ప్రకారం వీరు స్వల్ప రాజకీయ ప్రయోజనాల కన్నా చారిత్రక సంస్కరణలు లేదా అధికార సమతుల్యతను మార్చడం వంటి పెద్ద లక్ష్యాలపై దృష్టి పెడతారు, దీని కోసం అంతర్జాతీయంగా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చినా సరే.

7 నంబర్ కలిగిన వ్యక్తులు విధిని నమ్ముతూ, తమ మార్గం ముందే నిర్ణయించిఉందని.. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఏ అడ్డంకినైనా అధిగమిస్తామని భావిస్తారు. కానీ వారు ఫలితం గురించి పట్టించుకోరు. పుతిన్ తీసుకునే నిర్ణయాల్లో ఇదే దృఢత్వం, రిస్క్ తీసుకునే సామర్థ్యం కనిపిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం.