Surya Gochar in Kanya Rashi 2025 : జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్య భగవానుడిని అన్ని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ప్రతి నెలా రాశిని మారే ఆదిత్యుడి ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది..

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాశి మార్పు.. వ్యక్తి జాతరంలో మార్పులకు కారకంగా చెబుతారు. ఏదైనా గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు, ఒక నిర్దిష్ట సమయంలో మరొక రాశిలోకి మారినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది.  సూర్యుడు ప్రతి నెలా రాశిని మారుస్తాడు. 

గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడు సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. నెల రోజులుగా సింహ రాశిలో ఉన్న సూర్యుడు కన్యాలోకి అడుగుపెడతాడు.  అక్టోబర్ 17వరకూ ఇదే రాశిలో ఉంటాడు. ఇది సూర్యుడికి మిత్ర గ్రహానికి సంబంధించిన రాశి. పైగా సూర్యుడి రాశి మార్పు ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు

సూర్యభగవానుడు ఓ వ్యక్తి జాతకంలో మంచి స్థానంలో ఉంటే?

సూర్యుడు ఆరోగ్యం,కీర్తి, పేరు, మంచి ఉద్యోగం, విజయం, ఉన్నత పదవికి కారకుడు అవుతాడు.  సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు.. తులా రాశిలో నీచ రాశిగా..మేష రాశిలో ఉన్నతంగా ఉంటాడు. ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు గ్రహాలు మరింత శక్తివంతంగా ఉంటాయి. నీచ రాశిలో ఉన్నప్పుడు బలహీనపడతాయి. ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు. ఆత్మకారక గ్రహంగా చెప్పే సూర్యుడి సంచారం ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఉన్నత స్థానానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో, కార్యాలయంలో, పాలనాపరమైన విషయాల్లో విజయం లభిస్తుంది. 

సూర్యుడు ఓవ్యక్తి జాతకంలో అశుభ స్థానంలో ఉంటే?

అన్నింటా వైఫల్యాలే కనిప్తాయి. ఎంత నమ్మకంగా చేసే పని అయినా మధ్యలోనే ఆగిపోతుంది. అనుకోని ఇబ్బందులు పెరుగుతాయి. ఆర్థిక నష్టం జరుగుతుంది. సూర్యుడి అశుభ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఈ 4 రాశులకు శుభ సమయం

కన్యా రాశిలో సూర్య సంచారం వృషభం, కన్య, వృశ్చికం, మకర రాశి వారికి శుభ సమయం. ఈ రాశులవారు ఉద్యోగం వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఆస్తి , ఆర్థిక విషయాలలో ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యంబావుంటుంది. అదృష్టం కలిసి  వస్తుంది.  కుటుంబ విషయాలకు కూడా సమయం శుభంగా చెప్పవచ్చు. 4 రాశులకు మిశ్రమ ఫలితాలు

మేషం, మిథునం, సింహం , ధనుస్సు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారికి ధనలాభం ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. పనిలో ఆటంకాలు, ఒత్తిడి, వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

కర్కాటకం, తులా, కుంభం, మీన రాశి వారికి కష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఈ 4 రాశుల వారు ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిలో ఆటంకాలు రావచ్చు. వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ధన నష్టం   ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండాలి. అప్పులు తీసుకోకూడదు. పనిలో నిర్లక్ష్యం ,తొందరపాటును కూడా నివారించాలి.

సూర్యుడు అశుభ స్థానంలో ఉన్నప్పుడు ఇలా చేయండి నిత్యం శ్రీ మహావిష్ణువును పూజించండి

రోజూ ఉదయాన్ని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి

ఆదిత్య హృదయం పారాయణం చేయండి.  

పశువులకు, పక్షులకు ఆహారం అందించండి

పెద్దలను గౌరవించండి

ఆదివారం రోజు ఉపవాసం ఉండండి

ప్రతిరోజూ బెల్లం తిని అయినా నీరు తాగిన తర్వాత అయినా ఇంట్లోంచి బయలుదేరండి

తల్లిదండ్రులను గౌరవించండి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ఏబీపీ దేశం ఎటువంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదు.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.