15th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మీ స్వభావాన్ని మార్చుకోండియ. మీ మనసులోని మాటను బయటకు చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. సోదరులతో వాదోపవాదాలు ఉండొచ్చు. పిల్లల పురోగతిలో ఆటంకాలు ఏర్పడవచ్చు.
వృషభ రాశి
ఈ రోజంతా బిజీ బిజీగా ఉంటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన చర్చలుంటాయి. కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే మంచి సమయం.
మిథున రాశి
మీ ప్రాముఖ్యతను మీ చుట్టూ ఉన్నవారు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు. మీ దినచర్యలో మార్పులుంటాయి. ప్రేమ వ్యవహారం కారణంగా కుటుంబంలో వాదోపవాదాలు జరుగుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం
కర్కాటక రాశి
మీ అలవాట్ల వల్ల మీరు ఇబ్బంది పడతారు. న్యాయ శాఖతో సంబంధం ఉన్న వ్యక్తులు బిజీగా ఉంటారు. మీ నుంచి సహాయం పొందేవారి సంఖ్య పెరుగుతుంది. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సవాళ్లుంటాయి కానీ ముందుకు సాగుతారు
Also Read: ఈ రాశులవారికి ఈ వారం స్తిరాస్థి వ్యవహారాలు కలిసొస్తాయి, నవంబరు 13 నుంచి 20 వారఫలాలు
సింహ రాశి
ఈ రాశివారు తమకు నచ్చినట్టు తాముండడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. అయితే తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి సరైన మద్దతు లభించకపోవడం వల్ల వీరిలో కోపం పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన పనులు పూర్తవుతాయి, ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికితగిన ఫలితం పొందుతారు.
కన్యా రాశి
మీరు ఏదైనా మాట్లాడే ముందు , ఏదైనా చేసే ముందు ఓసారి ఆలోచించండి.ఎందుకంటే మీకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టేది మీ మాటతీరే. ఎవరైనా సహాయం అర్థిస్తే కాదు అనొద్దు. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు శుభసమయం.రాజకీయాలతో ముడిపడిన వారికి అనుకూల ఫలితాలున్నాయి.
తులా రాశి
ఒకప్పుడు మీ నుంచి సహాయం అందుకున్నవారే ఈరోజు మిమ్మల్ని విస్మరిస్తారు. అంతే కాదు వారు మిమ్మల్ని విమర్శిస్తారు. అయినప్పటికీ మీరు నష్టపోయేది ఏమీ ఉండదు..ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
వృశ్చిక రాశి
వృత్తి వ్యాపారాల్లో మీ సమర్థకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పరస్పర సమన్వయం లోపించడం వల్ల కుటుంబ సభ్యులతో వైరం ఏర్పడుతుంది. మీ ప్రవర్తన ఎవరికైనా బాధ కలిగించవచ్చు.
ధనస్సు రాశి
వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పురోగమిస్తాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. మతానికి సంబంధించిన పనులపై ఆసక్తి పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడేందుకు ఇదే మంచి సమయం. ఆర్థిక స్థితిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.
మకర రాశి
మానసిక ఒత్తిడి ఉంటుంది, ఆస్తికి సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. తల్లిదండ్రుల మార్గదర్శకత్వంతో మీరు కీర్తిని పొందుతారు.ప్రయాణాల మధ్య ఆర్థిక పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి.
Also Read: ఈ రాశివారు కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహకరించకపోతే నష్టపోతారు, ఈ వారం రాశిఫలాలు
కుంభ రాశి
ముఖ్యమైన పత్రాలను జాగ్రత్త చేయండి..పనులు సకాలంలో పూర్తిచేయండి. మీ ప్రవర్తనా విధానంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇంటి అలంకరణకు ఖర్చు పెరుగుతుంది.ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఈ రోజు శుభవార్త వింటారు. ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సిరావొచ్చు.
మీన రాశి
పిల్లల వివాహానికి సంబంధించి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆగిపోయిన పనులు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులకు శుభసమయం.