ఏలూరు కార్పొరేషన్  వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 47 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండగా ఎన్నికల ముందే 3 ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఈ కారణంగా మార్చి 10న 47 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి. 


ఏలూరు కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు.. వైసీపీ ఖాతాలోకి వెళ్లడంతో ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఇవాళ వచ్చిన ఫలితాల్లో వైసీపీ 44, టీడీపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. గతంలో ఏకగ్రీవమైన 3 స్థానాలు కలిపి వైసీపీ 47 గెలిచినట్టైంది.  2, 4, 5, 6, 8, 10, 11, 13, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 31, 33, 35, 36, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 48, 49, 50 సహా మరికొన్ని డివిజన్లలో వైసీపీ గెలవగా..  28, 37, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.


హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్లను లెక్కిస్తోంది. ఏలూరులోని సీఆర్‌రెడ్డి కాలేజీలోని నాలుగు కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఇవాళ మధ్యాహ్నం వరకు ఏలూరు కార్పోరేషన్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే.


ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.  సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే విధించగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఓ పిటీషనర్ ఆ తీర్పును సవాలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి నేృతృత్వంలోని ధర్మాసనం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు అనుమతిచ్చారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశాలిచ్చింది. హైకోర్టు తాజా ఆదేశాల మేరకు ఇవాళ ఓట్లను లెక్కించారు.


మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 75 మున్సిపల్ స్థానాలకు గానూ ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ 73 చోట్ల విజయం సాదించింది. టీడీపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రమే ఆధిక్యం దక్కించుకుంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి మున్సిపాలిటీ సీటు దక్కించుకుంది. 


గతంలో 12 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా ఏలూరులో కౌంటింగ్ జరగలేదు. మిగిలిన 11 మునిసిపల్ కార్పొరేషన్లలో వైసీపీనే జెండా ఎగరేసింది. ఇవాళ వెలువడిన ఏలూరు ఫలితాలతో అన్నీ.. కార్పొరేషన్లు వైసీపీ దక్కించుకున్నట్టైంది.


Also Read: Congress Conflict: రంగంలోకి కాంగ్రెస్ అధిష్ఠానం.. రాజస్థాన్ రాజకీయంపై దృష్టి


                CM Yediyurappa Profile: యడియూరప్ప రాజకీయ జీవితంలో ఆఖరి పేజీ ఇదేనా?


                Ladakh Conflict: లద్దాఖ్ లో యుద్ధ మేఘాలు.. భారీగా బలగాల మోహరింపు