వైసీపీ అభ్యర్థుల ఎంపికపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఏడాదికి పైగా పలు సంస్థలతో సర్వేలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. వాటి నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దాదాపు 60కి పైగా స్థానాల్లో అభ్యర్థులను జగన్ మారుస్తారని వైసీపీ పెద్దలు చెబుతున్న మాట. ఇదే జరిగితే బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులను మార్చిన ఘనత జగన్కే దక్కుతుంది.


అయితే ఈ మార్పుల అంతిమ ప్రభావం జగన్ పైనే పడుతుంది. అభ్యర్థుల మార్పు వల్ల మరోసారి అధికారాన్ని దక్కించుకుంటే జగన్ పేరు చరిత్రలోనే నిలిచిపోతారు. అదే బైరాగి చిట్కాలా తేడా కొట్టిందా.. రాజకీయంగా సంక్షోభంలో పడిపోతారు. ఎందుకంటే ఏపీలో భిన్నమైన రాజకీయాలకు జగన్ మార్గం వేశారు. అవి తిరిగితిరిగి ఎటు దారి తీస్తాయోనని చర్చ మొదలైంది.


రాజకీయంగా మాత్రమే కాదు, భౌతికంగాకూడా కొన్ని చోట్ల దాడులు జరిగాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఇది ఏ స్థాయికి చేరుతుందోనని కొన్ని ఈ క్రమంలో వైసీపీ మార్పులపై సొంత పార్టీలోనే అసంతృప్తి మొదలైంది. జగన్ ఇదివరకే 11 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్చారు. మరికొన్ని చోట్ల సైతం భారీగా మార్పులు ఉంటాయని పార్టీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు సైతం స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మార్చితే ప్రచారానికి ఇబ్బంది, పార్టీలో అంతర్గత పోరు ఉంటుందని భావించిన జగన్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. 


ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలిచ్చినట్టు, నవరత్నాల పథకాలను చిత్తశుద్ధితో జనానికి అందిస్తున్నాననీ, ఇంతకంటే అద్భుతమైన పాలన ఏముంటందని వినిపిస్తోంది. ఓట్లు సైతం అభ్యర్థిని చూసి కాదని, జగన్ ను చూసి వేస్తారని గత ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీ నేతలు ప్రచారం చేశారు.. అయితే ఎమ్మెల్యేలపై చేయించిన సర్వేలలో అంత పాజిటివ్ లేకపోవడంతో అభ్యర్థులను మార్చుతున్నారా అని ప్రజల్లోకి వెళ్తోంది. 


సంక్షేమ పథకాల అమలు కోసం సభల్లో కనిపించడం మినహా, మిగిలిన సమయమంతా ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం, ఇంటికే పరిమితం అయ్యారు. ప్రజలతో మమేకం కావడం, ఎమ్మెల్యేలు నేతలతో రెగ్యూలర్ గా టచ్ లో ఉండి క్షేత్రస్థాయిలో పనిచేస్తే అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్న భావన ఉంది. ఈ మధ్య సీఎంవో నుంచి కాల్స్ రావడం, ఎమ్మెల్యేలకు టెన్షన్ పెరుగుతోంది. తమ సీటు మార్చుతారా, అసలు ఛాన్స్ ఉంటుందా లేదా అని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొన్నా ఎందుకు తమను మార్చేస్తున్నారని భిన్నాభిప్రాయాలున్నాయి. జగన్ ను చూసి ఓట్లు వేస్తున్నారని పార్టీ కీలక నేతలు చెప్పడం నిజమైతే.. ఇప్పుడు కూడా ఆయనను, జగన్ చేసిన సంక్షేమ పథకాలకు ఎందుకు ఓట్లు వేయారో తెలియక తలలు పట్టుకుంటున్నారు.


భారీ స్థాయిలో మార్పులు జరిగితే మొదటికే మోసం వచ్చి, ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల అంతర్గత భావన. సంక్షేమంతో పాటు చేయాల్సిన పనులు చేస్తే సరి, కానీ ఇంఛార్జ్ లను మార్చితే ఎన్నికల్లో నెగ్గుతారా, జగన్ వ్యూహం సక్సెస్ అయితే నామినేటెడ్ పోస్టులయినా దక్కుతాయి. లేకపోతే ఎమ్మెల్యే పోస్ట్ ఉండదు, వచ్చ ఐదేళ్లు పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకమేనని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ నిర్ణయాలతో టెన్షన్ పట్టుకుంది.