బీసీలకు ఒక స్వరూపం ఇస్తే అది ఆర్.కృష్ణయ్య అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బీసీ అనేది తెలుగు రాష్ట్రాల్లో  కృష్ణయ్య ఇంటి  పేరు అయిందని ఆయన వ్యాఖ్యానించారు.


బీసీ వర్గాలతో సమావేశం...
ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. బీసీ సంఘ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బీసీ సంఘం  అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఇతర బీసీ సంఘాల నాయకులు హజరయ్యారు. రాజకీయాల్లో  బీసీ సంఘాల  పాత్ర బీసీల అభివృద్ధి  పై చర్చ నిర్వహించారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ.. జగన్ అధికారం లోకి రాక ముందు  బీసీ డిక్లరేషన్ చేశారని తెలిపారు. బీసీలు సమాజ  నిర్మాణంలో  భాగస్వాములు కావాలి  అని  జగన్ ఆలోచించారని అన్నారు. నిజమైన సమ సమాజం అంటే  సామాజిక న్యాయం అమలు జరగడమనని నమ్మింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కేవలం కొద్ది  మంది చేతుల్లో అధికారం  మంచిది  కాదని, అందుకే  సాధికారత అవసరమని ఆయన అన్నారు. 
ఐదేళ్ల తర్వాత దేశంలో ఎక్కడా  లేని  విధంగా  వెనకబడ్డ  వర్గాలు ముందు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయం అంటే  నలుగురు కూర్చుని  మాట్లాడుకోవడం కాదని, గ్లోబల్  సిటిజెన్ గా పోటీ పడే  విద్య  ప్రభుత్వం  అందిస్తోందన్నారు. సోషల్ ఇంజినీరింగ్  ఏపీలో 100 కిలోమీటర్ల స్పీడ్ లో ఉందని వ్యాఖ్యానించారు. 


ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి...
బీసీ కులాల బాధలు కష్టాలు అనేకం ఉన్నాయని వాటిని ప్రభుత్వం దృష్టికి  తీసుకు వెళ్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రభుత్వ  సలహాదారు సజ్జల  దృష్టిలో  బీసీల  సమస్యలు ఉంచుతామని, రాష్ట్ర ప్రభుత్వం  అమలు  చేస్తున్న పథకాలకు బీసీలకు 60శాతం గ్రాంట్  ఇవ్వాలని డిమాండ్ చేశారు.  పార్లమెంట్ లో  బీసీల సమస్యలపై  పోరాటం చేయాలని   సీఎం జగన్ అనేక సార్లు తనతో అన్నారని తెలిపారు. బీసీలను  అభివృద్ధి  చెయ్యాలనే  కమిటిమెంట్ జగన్  కు  ఉందని చెప్పారు. 18  మంది ఎమ్మెల్సీ  ల్లో  11 మంది  బీసీ  లకు ఇచ్చారని గుర్తు చేశారు. బీసీ లకు  పదవులు  ఇవ్వాలంటే  ధైర్యం  కావాలి.. ఆ ధైర్యం జగన్ లో ఉందని కొనియాడారు.


బీసీలకు ఇప్పుడే ప్రాధాన్యత...
బీసి  లకు  సీఎం  జగన్  అనేక  అవకాశాలు ఇచ్చారని తెలిపారు శాసన మండలి సభ్యులు పోతుల సునీత వ్యాఖ్యానించారు. చంద్రబాబు బీసీ లను అనేక రకాలుగా అవమానించారని తెలిపారు. బీసీ  లు  వెన్నెముక   అని  చెప్పే  చంద్రబాబు  బీసీ  లను  ఓట్ బ్యాంక్ గా మాత్రమే వాడుకున్నారని మండిపడ్డారు. ఆర్  కృష్ణయ్య  బీసీల కోసం  పోరాటం  చేస్తున్నారని, జగన్ బీసీలకు  వేస్తున్న  బాట  అవకాశంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో బీసీలకు ఇచ్చేందుకు కూడ జగన్ సిద్దం అయ్యారని, బీసీల పట్ల జగన్ కు ఉన్న సంకల్పానికి ఇది నిదర్శనమని తెలిపారు.