ఆంధ్రప్రదేశ్‌లో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అత్యధికం గెల్చుకుంది. అయితే టీడీపీ కూడా పుంజుకుంది. కొన్ని చోట్ల మెరుగైన ఫలితాలను సాధించింది. మొత్తం పది జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 7, తెలుగుదేశం పార్టీకి 3 దక్కాయి. 123 ఎంపీటీసీ స్థానాల్లో 83 వైఎస్ఆర్‌సీపీ, 32 తెలుగుదేశం, బీజేపీకి 6, ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల విజయం సాధించారు.
Also Read: దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !
కృష్ణా జిల్లాలో మూడు జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. విస్సన్నపేట, జి.కొండూరు జడ్పీటీసీల్లో వైసీపీ విజయం సాధించింది. పెడన జడ్పీటీసీలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. కృష్ణా జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైఎస్ఆర్‌సీపీకి ఆరు, టీడీపీకి రెండు దక్కాయి. తూర్పుగోదావరి జిల్లాలో 11 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఐదు వైఎస్ఆర్‌సీపీ, నాలుగు టీడీపీ, ఒకటి సీపీఐ, మరొకటి సీపీఎం గెల్చకున్నాయి. అనంతపురం జిల్లాలో చిలముత్తూరు జెడ్పీటీసీని వైఎస్ఆర్‌సీపీ గెల్చుకుంది. విశాఖ జిల్లాలో ఆనందపురం జడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు ఘన విజయం సాధించారు. ప.గో జిల్లాలో14 ఎంపీటీసీలు, రెండు జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. 10 ఎంపీటీసీ స్థానాలు, పెనుగొండ జెడ్పీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. జనసేన-1,టీడీపీ-3 ఎంపీటీసీ స్థానాల గెలుచుకున్నాయి.
Also Read: బీజేపీ మద్దతుతో అమరావతి రైతులకు నైతిక బలం .. పాదయాత్రలో పాల్గొననున్న ఏపీ నేతలు !
కర్నూలు జిల్లా నంద్యాల జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణ రెడ్డి గెలిచారు. విజయనగరం జిల్లాలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైఎస్ఆర్‌సీపీ 6, టీడీపీ 2, బీజేపీ 1 స్థానంలో గెలిచాయి. శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలు జరగగాని వైఎస్ఆర్‌సీపీ పది, టీడీపీ ఐదు చోట్ల గెలిచాయి. చిత్తూరు జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి ఐదు.. టీడీపీకి మూడు దక్కాయి. నెల్లూరు జిల్లాలో 4 ఎంపీటీసీ స్థానాల్లో మూడు వైఎస్ఆర్‌సీపీకి ఒకటి టీడీపీకి దక్కాయి. కడప , కర్నూరు జిల్లాల్లో జరిగిన అన్ని ఎంపీటీసీల్లో అధికార పార్టీ గెలిచింది. గుంటూరు జిల్లాలో 11 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైఎస్ఆర్‌సీపీకి 9, టీడీపీకి రెండు లభించాయి. శావల్యాపురం జడ్పీటీసీని టీడీపీ గెల్చుకుంది. అనంతపురం జిల్లాలో 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైఎస్ఆర్‌సీపీ పది, టీడీపీ ఆరు చోట్ల విజయం సాధించింది.
Also Read: మహిళా సాధికారతలో సువర్ణ అధ్యాయం.. చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ది రావాలన్న సీఎం జగన్ !
పలు చోట్ల హోరాహోరీ పోరు సాగింది. ఫలితాలు మరీ ఏకపక్షంగా లేకపోవడం...నిర్బంధాల మధ్య అయినా టీడీపీ మెరుగైన సీట్లు సాధించడంతో ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కడప, కర్నూలు వంటి జిల్లాల్లో మాత్రం ఒక్క ఎంపీటీసీ కూడా గెలవలేకపోయారు.
Also Read : సంబరాలే కాదు సమీక్ష కూడా చేసుకోవాలి.. వైఎస్ఆర్‌సీపీకి సంకేతాలిస్తున్న ఫలితాలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి