YSRCP bids farewell to Vijayasai Reddy: రాజ్యసభ పదవికి, రాజకీయాలకు గుడ్ బై చెప్పాలన్న విజయసాయిరెడ్డి నిర్ణయాన్ని తాము ఆమోదించనప్పటికీ... గౌరవిస్తున్నామని వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. విజయసాయిరెడ్డి రాజీనామాపై ట్విట్టర్ లో ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఓ పిల్లర్ గా ఉన్నారని.. బలంగా నిలబడ్డారని ..క్లిష్టమైన సమయాల్లో .. విజయాలు అందుకున్న సమయంలోనూ కీలక పాత్ర పోషించారని అభినందించారు. హార్టికల్చర్ లో కొనసాగాలన్న నిర్ణయాన్ని.. రాజకీయాల నుంచి వైదొలగాలన్న ఆసక్తిని తాము గౌరవిస్తామన్నారు. వైసీపీకి మీ సేవలు ఎప్పుడూ అభినందించదగ్గవిగానే ఉంటాయన్నారు. విష్ యు వెరీ బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అని.. వైసీపీ సమాధానం ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ కు స్పందనగానే వైసీపీ ఈ ప్రకటన చేసింది.
విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల వైఎస్ఆర్‌సీపీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఓ రాజ్యసభ సీటు తగ్గిపోవడం మాత్రమే కాదు.. అది కూటమి పార్టీలకు వెళ్తుంది. అంతే కాదు జగన్ కు అత్యంత సన్నిహితుడు అక్రమాస్తుల కేసుల్లో నెంబర్ టు అయిన విజయసాయిరెడ్డి దూరం అయితే వైసీపీలో అలజడి రేగుతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. వైసీపీ విజయం సాధించిన 2019లో ఆయన పాత్ర కీలకం. అందుకే విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోతారని .. రాజకీయాలకు దూరమవుతారని ఎవరూ అనుకోలేకపోయారు.కానీ ఆయన గుడ్ బై చెప్పారు.
రాజీనామా చేయడానికి ఆయన సహేతుకమైన కారణాలు కూడా చెప్పలేదు. అబద్దాలు ఆడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని ఆయన చెప్పడం కామెడీగా మారింది. ఆయనతో ఎవరు అబద్ధాలు చెప్పించాలనుకున్నారు.. ఏ అబద్దాలు చెప్పించాలనుకున్నారో కూడా చెబితే బాగుండేదని అంటున్నారు. వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేసేందుకు ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారని అందులో విజయసాయిరెడ్డి భాగమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు నిష్ఠూరంగా వైసీపీ బై చెప్పిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇప్పటికే విజయసాయిరెడ్డిని పార్టీ కార్యక్రమాలో యాక్టివ్ చేసే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర ఇంచార్జ్ పదవిని ఇచ్చారు. అయితే ఆయన మొత్తం వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆయన వల్ల అవకాశాలు రాలేదని భావిస్తున్న కొంత మంది వైసీపీ నేతలు.. పార్టీకి మంచే జరుగుతుందని అంచున్నారు.