Rally For MLC Anantababu : హత్య చేసినట్లుగా అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రోజు రోజుకు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయనపై వైఎస్ఆర్సీపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి మాత్రం తరచూ జైల్లో అనంతబాబును కలుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె కొంత మంది అనంతబాబు అనుచరులతో ర్యాలీ నిర్వహింప చేసి .. అనంతబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
దేవీపట్నం మండలం ఇందుకూరు పేటలో అనంతబాబుని హీరోగా కీర్తిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఊరేగింపు నిర్వహించిన దృశ్యాలను టీడీపీ నేత లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వంలో నిందితులకు రక్ష, బాధితులకు శిక్షేనని మరోసారి రుజువైందన్నారు. దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోందని ఆరోపించారు.
హత్య కేసులో అనంతబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనను పోలీసులు కస్టడీలోకి కూడా తీసుకోలేదు. సుబ్రహ్మణ్యంను తాను హత్య చేసినట్లుగా అంగీకరిస్తూ ఉచ్చిన వాంగ్మూలను బట్టే కేసు నమోదు చేశారు. కావాలని చంపలేదని.. గట్టిగా నెట్టడంతో పడిపోయి చనిపోయాడరని అనంతబాబు వాంగ్మూలం ఇచ్చారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం అనంతబాబు చనిపోకే ముందే పెద్ద ఎత్తున గాయాలున్నాయన్న రిపోర్ట్ వచ్చింది.
దీంతో అసలు సుబ్రహ్మణ్యం ను హత్య చేయడానికి ముందు ఏం జరిగింది ? ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్నారు ? వంటి అంశాలపై పోలీసులు ఆరా తీయాల్సి ఉంది. కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ విషయంపై పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. మరో వైపు వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేసినా ఆయనకు మద్దతుగా ర్యాలీలు.. పాలాభిషేకాలను ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు.