Laptop Explode : ఛార్జింగ్ పెట్టి వర్క్ చేసుకుంటున్న ల్యాప్ టాప్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. వైఎస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సుమతి తన ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్‌ పెట్టి వర్క్ చేస్తుండగా అది ఒక్కసారిగా మంటలు వచ్చి పేలిపోయింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన సుమతిని కుటుంబ సభ్యులు కడపలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ సెల్ ఫోన్ పేలిన ఘటనలు జరిగాయి. తాజాగా ల్యాప్ టాప్ పేలడం చాలా అరుదు కాబట్టి ఈ విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. 


సాఫ్ట్ వేర్ ఉద్యోగులు జాగ్రత్త


కరోనా కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. కరోనా తగ్గిన సాఫ్ట్ వేర్ కంపెనీలు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ హోం కొనసాగిస్తున్నాయి. కాస్ట్ కట్ అనే యోచనలో కంపెనీలు ఇలా చేస్తున్నాయని అని విశ్లేషకులు అంటున్నారు. గత రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇళ్ల వద్ద నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆఫీసుల్లో వర్క్ కండీషన్లకు తగిన విధంగా విద్యుత్ సప్లై, ఎయిర్ కండీషన్ సదుపాయం ఉంటుంది. కానీ ఉద్యోగుల ఇళ్లలో ఈ సౌకర్యాలు అంతంత మాత్రమే. అసలే వేసవి కాలం కాబట్టి విద్యుత్ కోతలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, ఎండ వేడిమి, ఇతర కారణాల వల్ల ల్యాప్ టాప్ పనితీరుపై ప్రభావం పడతాయి. ఉద్యోగులు ఉదయం నుంచే ల్యాప్ టాప్ లను పట్టుకుని వర్క్ చేస్తుంటారు. వర్క్ చేసే క్రమంలో ల్యాప్ టాప్ ఆఫ్ అయిపోతుండడంతో ఛార్జింగ్ పెట్టి పనిచేస్టుంటారు. ఇలా చేయడమే ఓ మహిళా సాఫ్ట్ వేర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ల్యాప్ టాప్ పేలిన ఘటనలో సాప్ట్ వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడింది. 


నాసిరకం ఛార్జర్ వల్లే!


సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ల్యాప్‌ టాప్‌ నిత్యవసరం.  24 గంటలు అది ఆన్ చేసే ఉంటుంది. ఎప్పుడూ ఏ ప్రాజెక్టులో డౌట్ వస్తుందో క్లైంట్ కు అని, ఎక్కువశాతం ఉద్యోగులు ల్యాప్ ట్యాప్ ఆఫ్ చేయడమే మానేస్తారు. ఈ పరిస్థితే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కు ప్రాణం మీదకు తెచ్చింది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల సుమలత ల్యాప్ టాప్ పేలి తీవ్రగాయాలయ్యాయి. ఛార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా బాంబులా అది పేలిపోయింది. దీంతో సుమలత తీవ్రగాయలయ్యాయి. సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లు కరోనా టైమ్‌ నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేస్తూ ల్యాప్‌ టాప్‌లతో ఇంటి దగ్గరే కుస్తీ పడుతున్నారు. పనిఒత్తిడితో ల్యాప్ టాప్ పై ఎక్కువ సమయం పనిచేస్తూనే ఉంటారు. ఇలా చేసుకుంటుండగానే సుమలత ల్యాప్‌టాప్‌ పేలింది. అయితే నాసిరకం ఛార్జర్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్షసాక్షులు అంటున్నారు. ఏది ఏమైనా సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లు ల్యాప్ టాప్ తో పనిచేస్తు్న్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తుంది.